Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ ఎకానమీ

1. 1956-1965 మధ్యకాలంలో తెలంగాణ ఆదాయాన్ని వివిధ రంగాల వాటాలను ఆరోహణ క్రమంలో గుర్తించండి ? 

1) వ్యవసాయరంగం, పరిక్షిశమలు, సేవలు
2) సేవలు, పరిక్షిశమలు, వ్యవసాయరంగం
3) పరిక్షిశమలు, వ్యవసాయం, సేవలరంగం
4) సేవలు, వ్యవసాయం, పరిక్షిశమలరంగం

2. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి.

ఎ) 1956 నుంచి 1967 మధ్యకాలంలో సాగు విస్తీర్ణం, నీటిపారుదల కింద ఉన్న విస్తీర్ణంలో సాధించిన పెరుగుదల అతిస్వల్పం
బి) 1956లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో 9 జిల్లాలు ఉన్నాయి.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

3. 1961లో తెలంగాణలోని జనసాంవూదత ఎంత ?

1) 286 2) 285 3) 256 4) 386

4. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం గడిచిన 53 ఏండ్లలో తెలంగాణ యువత ఎన్ని ఉద్యోగవకాశాలను కోల్పోయింది?

1) 1.5 లక్షలు 2) 2.5 లక్షలు
3) 53 వేలు 4) 60 వేలు

5. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి .

ఎ) రెండో ప్రణాళిక కాలంలో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ ప్రాంత ఆదాయం 45 శాతం ఉండగా, తెలంగాణలో చేసిన వ్యయం 34 శాతానికి మించలేదు.
బి) 3వ ప్రణాళిక కాలంలో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర రాబడికి తెలంగాణ సమకూర్చిన మొత్తం 42 శాతం కాగా, ఖర్చుపెట్టిన వ్యయం రూ. 19 కోట్లు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

6. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి .

ఎ) 1956-68 మధ్యకాలంలో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి 22,000 మంది, 1975 నాటికి రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి 58,962 మంది తెలంగాణేతరులు తెలంగాణ వారికి చెందాల్సిన ఉద్యోగాల్లో నియామకమయ్యారని ప్రభుత్వాలు నియమించిన కమిటీలు తెలిపాయి.
బి) 2005లో నియమించిన గిర్‌గ్లానీ ఏకసభ్య కమిషన్ తెలంగాణ ప్రాంతం వారు 2.5 లక్షల ఉద్యోగాలు కోల్పోయారని తేల్చింది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

7. 1973లో మణుగూరులో ఏర్పాటు చేయాల్సిన విద్యుత్ ప్రాజెక్ట్‌ను విజయవాడకు మార్చడం ద్వారా తెలంగాణ ప్రాంతం ఎన్ని మెగావాట్ల విద్యుత్ సామర్థం కోల్పోయింది ?

1) 1750 మెగావాట్లు 2) 1760 మెగావాట్లు
3) 1850 మెగావాట్లు 4) 2000 మెగావాట్లు

8. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి ?

ఎ) తెలంగాణ బడ్జెట్‌లో మిగులును అంచనా వేయడానికి కె. లలిత్, జస్టిస్ వి. భార్గవ నేతృత్వంలో కమిటీలను నియమించారు.
బి) 1-11-1956 నుంచి 31-3-1968 వరకు తెలంగాణకు సంబంధించిన మిగులు నిధులను అంచనా వేయడం ఈ కమిటీల లక్షం. 
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

9. 1956-68 మధ్యకాలంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని కుమార్ లలిత్ కమిటీ అంచనా వేసిన మొత్తం ఎంత ?

1) రూ. 53 కోట్లు 2) రూ. 64 కోట్లు
3) రూ. 10 కోట్లు 4) రూ. 34 కోట్లు

10. 1956-68 మధ్య కాలంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని భార్గవ కమిటీ అంచనా వేసింది. అయితే ఆ మొత్తం ఎంత ?

1) రూ. 34 కోట్లు 2) రూ. 28 కోట్లు
3) రూ.64 కోట్లు 4) 36 కోట్లు 

11. కిందివాటిలో లతిత్ కుమార్ కమిటీ, భార్గవ కమిటీ సిఫారసుల్లో సారూప్యతను గుర్తించండి.

ఎ) తెలంగాణలో స్థానికేతరుల సంఖ్య 4,500
బి) ఆంధ్రవూపాంతంతో పోలిస్తే తెలంగాణ ప్రాంతం వెనుకబడి ఉంది.
సి) పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన జరిగింది.
డి) రెండు కమిటీలు తెలంగాణ మిగులు ఆదాయం రూ. 34 కోట్లుగా అంచనా వేశాయి.
1) అన్నీ సరైనవే 2) బి,సి,డి 3) ఎ,బి 4) ఎ,బి,సి 

12. వశిష్ట భార్గవ కమిటీలోని సభ్యులను గుర్తించండి.

ఎ) విహారి మాథుర్ బి) హరిభూషణ్
సి) కృష్ణస్వామి డి) కుమార్
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) పై అందరూ

13. జస్టిస్ భార్గవ కమిటీని ఏ పథకంలో భాగంగా ఏర్పాటు చేశారు ?

1) పంచసూత్ర పథకం 2) అష్టసూత్ర పథకం 
3) షట్‌సూత్ర పథకం 4) రాష్ట్రపతి ఉత్తర్వులు

14. భార్గవ కమిటీ నివేదికను ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది?

1) 18-2-1970 2) 18-3-1970
3) 18-4-1970 4) 18-2-1971

15. వశిష్ట భార్గవ కమిటీ సిఫారసులను గుర్తించండి.


ఎ) రాష్ట్రం మొత్తం కేటాయింపుల్లో తెలంగాణకు 40 శాతం నిధులను సమకూర్చాలి.
బి) పెద్దమనుషుల ఒప్పందాన్ని క్రమబద్ధ్దీకరించాలి.
సి) 1956-68 మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతానికి వాస్తవంగా రావాల్సిన రూ. 44 కోట్లను నాలుగో ప్రణాళికలో ఖర్చు చేయాలి
1) ఎ,బి 2) బి,సి 3) ఎ,బి,సి 4) ఏదీకాదు

16. ఎవరి కాలాన్ని ‘ఎరా ఆఫ్ రిజర్వాయర్స్’గా అభివర్ణిస్తారు ?


1) అలీ నవాబ్‌జంగ్ 2) విశ్వేశ్వరయ్య 
3) వెల్లోడి 4) చౌదరి

17. కైలాస్‌నాథ్ కమిటీని ప్రభుత్వం ఎప్పుడు నియమించింది ?


1) 28-3-1969 2) 28-3-1970
3) 30-3-1969 4) 28-4-1969

18. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి .


ఎ) 1969లో హైకోర్టు ముల్కీ నిబంధలను రాజ్యాంగబద్ధ్దమే అని ప్రకటించింది 
బి) 20-3-1969న సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధ్దమైనవిగా ప్రకటించింది.
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

19. ముల్కీ నిబంధనలు, పెద్ద మనుషుల ఒప్పందాన్ని పునరుద్దరించడం, తెలంగాణ ప్రాంతానికి అనుగుణంగా చర్యలు చేపట్టడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఎప్పుడు నిర్వహించారు ?


1) 19-1-1969 2) 19-1-1970
3) 20-1-1970 4) 19-1-1968

20. అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలేవి?


ఎ) ఆంధ్రవూపాంతానికి తరలించిన నిధులను తెలంగాణ అభివృద్ధికి ఖర్చుచేయాలి.
బి) హైదరాబాద్‌లో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
సి) తెలంగాణలో స్థానికేతరులను తొలగించి వారి ప్రాంతాలకు వారిని పంపించాలి.
డి) ముల్కీ నిబంధనలను అమలు చేయాలి.
1) ఎ,బి,సి 2) బి, సి, డి 3) ఎ,డి 4) అన్నీ సరైనవే

21. జీఓ నెం.36కు కేంద్రవూపభుత్వం ఏ రోజున రాజ్యాంగ హోదా కల్పించింది ?


1) అక్టోబర్ 6, 1972 2) అక్టోబర్ 6, 1971 
3) అక్టోబర్ 7, 1972 4) అక్టోబర్ 8, 1971

22. ఆరు సూత్రాల కార్యక్షికమాన్ని అమలుచేసేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులను ఎప్పుడు జారీ చేశారు ?


1) 17-10-1975 2) 18-10-1975
3) 20-10-1975 4) 18-10-1976

23. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల ఆధారంగా స్థానికత నిర్ణయించాలని తీర్మానించారు?


1) 12 2) 11 3) 4 4) 9 

24. తెలంగాణలో 15 ఏండ్లు నివసించి ఉంటే ఈ ప్రాంతంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించడానికి అర్హత ఉంటుందని అర్ధశతాబ్దం క్రితం నిజాం ప్రవేశపెట్టిన ముల్కీ నిబంధనలు నేటికీ చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పునిచ్చింది ?


1)3-10-1972 2) 3-11-1972 
3) 14-2-1972 4) 9-12-1972

25. 1969, ఫిబ్రవరి 3న జస్టిస్ చిన్నపడ్డి ముల్కీ నిబంధనలు చెల్లవని చెప్పిన తీర్పును ఏ డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది ?


1) కొండ మాధవడ్డి 2) పింగళి జగన్‌మోహన్‌డ్డి
3) కృష్ణారావు 4) ఆవుల సాంబశివరావు

26. కేంద్రవూపభుత్వం కైలాస్‌నాథ్ వాంఛూ కమిటీ నియమించడానికి ప్రధాన ఉద్దేశం ?


1) ముల్కీ నిబంధనలపై విధి విధానాలను సూచించడానికి
2) ముల్కీ నిబంధనలు తొలగించడానికి
3) ముల్కీ నిబంధనలను అమలు పర్చడానికి 
4) ఏదీకాదు

27. జయభారత్ కమిటీని ఎందుకు నియమించారు ?


1) 1975 నుంచి 1985 మధ్యకాలంలో నిధుల పంపకాల్లో అవకతవకలను పరిశీలించడానికి 
2) 1975 నుంచి 1985 మధ్యకాలంలో తెలంగాణలో స్థానికేతరులు పొందిన ఉద్యోగాలను పరిశీలించడానికి
3) 1,2 4) ఏదీకాదు

28. కిందివాటిలో సరైనవాటిని గుర్తించండి.


ఎ) 1975-85 మధ్యకాలంలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన 58,9,62 మందిని తరలించేందుకు ప్రభుత్వం సుందరేశన్ కమిటీని నియమించింది
బి) సుందరేశన్ కమిటీ సూచనలను అమలు చేయడానికి 1985, డిసెంబర్ 30న 610 జీవో విడుదల చేశారు.
1) ఎ సరైనది 2) బి సరైనవి 
3) ఎ,బి సరైనవి 4) ఏదీకాదు

29. 610 జీఓలో ఎప్పటిలోగా స్థానికేతరులను వారి ప్రాంతాలకు తరలించాలని పేర్కొంది ?


1) 31-3-1987 2) 31 11-1986
3) 1-4-1986 4) 31-3-1981

30. కింద పేర్కొన్న ఏ జీవోను రాయలసీమ ప్రాంతం వారు విజయవంతంగా అమలుచేసి స్థానికేతరులను తొలగించారు ?


1) జీఓ 2) జీఓ 564 
3) జీఓ 610 4) జీఓ 510

31. రాష్ట్ర వూపభుత్వం గిర్‌గ్లానీ కమిటీని ఎప్పుడు నియమించింది ?


1) 25-6-2001 2) 25-6-2002 
3) 24-6-2001 4) 31-3-1986

32. 610 జీఓ అమలును పరిశీలించడానికి రాష్ట్రవూపభుత్వం ఏ కమిటీని నియమించింది ?


1) సుందరేశన్ కమిటీ 2) గిర్‌గ్లానీ కమిటీ 
3) జైభారత్ కమిటీ 4) లలిత్ కమిటీ

33. కేంద్రవూపభుత్వం జై ఆంధ్ర ఉద్యమాన్ని తగ్గించేందుకు ఆరు సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రకటించింది ?


1) 11-4-1969 2) 27-10-1972
3) 21-9-1973 4) 19-1-1968

34. కిందపేర్కొన్న వాటిలో ఆరు సూత్రాల పథకంలో పొందుపరచిన అంశం ఏది ?


ఎ) రాష్ట్ర ప్రణాళిక బోర్డును ఏర్పాటు చేయడం
బి) రాజధానిలో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం
సి) పెద్ద మనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలను రద్దు చేయడం
డి) జంటనగరాల పోలీస్ బలగాల విషయంలో ప్రాంతీయత భేదం ఉండకూడదు ?
1) ఎ,బి,సి 2) బి,సి,డి 3) ఎ,బి,సి,డి 4) ఎ,డి

Economy-Answers

35. ఆరు సూత్రాల పథకాన్ని అమలుచేసేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులను చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం ఏ జీఓను తీసుకొచ్చింది ?


1) 675 2) 456 3) 674 4) 36

36. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు నిర్మించారు ?


1) 26-7-1963 2) 11-4-1956 
3) 26-7-1962 4) 26-6-1963

37. కిందివాటిలో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ కాలువ కానిది ఏది ?


1) కాకతీయ 2) సరస్వతి 
3) లక్ష్మి 4) పార్వతి

38. జతపర్చండి.



ప్రాజెక్ట్ మరోపేరు 
ఎ. దేవాదుల 1. చొక్కారావు
బి. పీవీ నర్సింహారావు సుజల స్రవంతి 
2. కంతనపల్లి
సి. అంబేద్కర్ 3. ప్రాణహిత
డి. ఎల్లంపల్లి 4. శ్రీపాదరావు
ఎ బి సి డి
1) 1 2 4 3
2) 1 3 2 4
3) 1 2 3 4
4) 3 4 2 1

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section