పరలంబిక నుంచి విడుదలయ్యే ఆక్సిటోసిన్ శిశు జననానికి తోడ్పడుతుంది. వాసోప్రెసిన్ అతిమూత్రాన్ని నిరోధిస్తుంది. మెడలో వాయునాళానికి ముందుగా స్వరపేటిక దిగువన అవటు గ్రంథి ఉంటుంది. దీని నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది జీవక్రియారేటును నియంత్రిస్తుం ది. థైరాక్సిన్ లోపం వల్ల క్రెటినిజం అనే మానసిక, శారీరక మాంద్యంతో శిశువు పుట్టే ప్రమాదముంది. పెద్దల్లో థైరాక్సిన్ అల్పస్రావం ద్వారా మిక్సోడియ/ గల్స్ వ్యాధి అధిక స్రావం ద్వారా గ్రేవ్‌స వ్యాధి/ ఎక్సాఫ్తాల్మిక్ గాయిటర్ వస్తాయి.
అవటుకు దగ్గరగా నాలుగు చిన్న పార్శ్వ అవటు గ్రంథులుంటాయి. వీటి నుంచి పారాథార్మోన్ విడుదలవుతుంది. అవటు నుంచి విడుదలయ్యే కాల్సిటోనిన్ అనే హార్మోన్‌తో కలిసి పారాథార్మోన్ రక్తంలో కాల్షియం శాతాన్ని నియంత్రిస్తుంది.
అంతస్రావిక వ్యవస్థ
అంతస్రావిక వ్యవస్థలో అంతస్రావిక గ్రంథులు, వాటి నుంచి హార్మోన్లు అనే రసాయన విభాగాలు ఉంటాయి. అంతస్రావిక గ్రంథులు వాటి స్రావితాలను, ఏ నాళం సాయం లేకుండా నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయి. వీటిని వినాళ గ్రంథులు అంటారు. ఇవి శరీరంలోని వివిధ భాగాల్లో ఉంటాయి. ఒక అంతస్రావిక గ్రంథి ద్వారా రక్తంలోకి విడుదలై, రక్తం ద్వారా ఇతర భాగాలకు చేరి, క్రియాశీల చర్యలను నియంత్రించే రసాయనాలను హార్మోన్లు అంటారు.
మెదడు కింది భాగంలో పీయూష గ్రంథి ఉంటుంది. దీనిలో పూర్వ, మధ్యస్థ, పర లంబికలు ఉంటాయి. పూర్వలంబిక నుంచి ట్రాపిన్‌స అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి కొన్ని ఇతర అంతస్రావిక గ్రంథులను ప్రేరేపిస్తాయి. పూర్వలంబిక నుంచి విడుదలయ్యే పెరుగుదల హార్మోన్ శారీరక పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని అల్పస్రావం ద్వారా పిల్లల్లో మరుగుజ్జుత నం వస్తుంది. అధికస్రావం వల్ల జెగాంటిజం (అతిదీర్ఘకాయం)వస్తుంది. మధ్యస్థలంబిక నుంచి మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (MSH) విడుదలవుతుంది.