పెద్ద మనుషుల ఒప్పద్దం మరియు పరిణామాలు
:
పెద్ద మనుషుల ఒప్పద్దం:
ఆంధ్ర ప్రాంతంలో విలీనమైన తెలంగాణా కు 14 రకాల రక్షణలను కల్పిస్తామని ఆంధ్ర ప్రాంత నాయకులు హామీ ఇచ్చారు.
డిల్లీలోని హైదరాబాదు హౌస్ ఇరు ప్రాంత నేతలను కూర్చొని ఒప్పందానికి తుది రూపం ఇచ్చారు.
1956 ఫిబ్రవరి 20 న దిల్లీ లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది.
దీనికి చట్టబద్దత కల్పించే ప్రయత్నాలు కూడా జరిగాయి. వీటిని నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ పేరిట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అంటే షరతుల ఆధారంగా విలీనం జరుగుతుందని పార్లమెంట్ కు నివేదించారు. తద్వారా కేంద్ర వాటి అమలుకు భాధ్యత వహించాల్సిoది గా పర్రోక్షంగా చేపాడం జరిగింది.
కీలకమైన ఒప్పందాలు:
జనాభా దామాషా ప్రకారం ఉమ్మడి పాలన వ్యయం తెలంగాణా ఆదాయంలో మిగులను తెలంగాణకే కేటాయించాలి.
తెలంగాణాలోని విద్య అవకాశాలను తెలంగాణా విద్యార్థులకే కేటాయించాలి, సదుపాయాలను మరింత మెరుగు పరచాలి.
భవిష్యత్తు ఉద్యోగ నియామాకాలను ఇరు ప్రాంతాల నుంచి జనాభా దామాషా ప్రతిపాదికను జరపాలి.
తెలంగాణా దక్కే నియమాకాలలో ముల్కి నిబంధాలను పాటించాలి.
తెలంగాణాలోని వ్యవసాయ భూములను అమ్మకాన్ని నియంత్రించే అధికారం తెలంగణ ప్రాంతీయ మండలికి ఉండాలి.
తెలంగాణా అవసరాలు, అవకాశాల దృష్ట్యా ఇక్కడి సమగాభివ్రుద్దికి తెలంగాణా ప్రాంత మండలి ఏర్పాటు ఈ ప్రాంతీయ మండలిలో మెత్తం 20 మంది సభ్యులుoటారు.తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఎమ్మెల్యే చొప్పున 9 మంది అసెంబ్లీ లేదా పార్లమెంటు నుంచి యిదుగురు నున్వ్హి ఆరుగురు, అసెంబ్లీ బయటివారు యిదుగురు – వీరందరిని తెలంగాణా సభ్యులే ఎంచుకుంటారు. తెలంగాణా ప్రాంత మంత్రులంతా ఇందులో సభ్యులే.
జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గంలో ఇరు ప్రాంతాలకు వాటా దక్కాలి. హోం , ఆర్థిక, రెవిన్యూ,ప్రణాళిక, పరిశ్రమలు, వాణిజ్య శాఖలో ఏవేని రెండు శాఖలను తెలంగాణాకు విధిగా కేతంచాలి. ఒకవేళ ముఖ్యమంత్రి ఆంధ్ర వారైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు కేటంచాలి. తెలంగాణా ముఖ్యమంత్రి ఐతే ఉపముఖ్యమంత్రి ఆంధ్రకు కేటాంచాలి.
హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని 1962 వరకు కేటంచాలి.
కుదరని ఒప్పందాలు:
రెండు అంశాలపై ఒప్పందాలు కుదరలేదు. అవి
కొత్త రాష్ట్రానికి ఆంధ్ర-తెలంగాణా పేరు తెలంగాణా నేతలు ప్రతిపాదించగా, ఆంధ్ర ప్రదేశ్ గా నామకరణం చేయాలనీ ఆంధ్ర నేతలు వాదించారు.
గుంటూరులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాలనీ తెలంగాణా నేతలు ప్రతిపదిoచగా ఆంధ్ర నేతలు వ్యతెరేకరించారు. హైకోర్టు హైదరాబాద్ ఒక్కటే ఉంటె సరిపోతుందన్నారు.
ప్రాంతీయ మండలి:
తెలంగాణా ప్రాంతీయ మండలి గురించి రాజ్యాంగంలోని 371వ అధికరణాన్ని 1956 లో ఏడో రాజ్యంగా సవరణ ద్వారా సవరించారు.
దీని ప్రకార తెలంగాణా ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతి కీ కేటాయించారు.
1958 ఫిబ్రవరిలో ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు.
ఆర్టికల్ 16(3) ని సవరించి ఉద్యోగాల భర్తీలో నివాసార్హత విధించే అధికారాన్ని కల్పించారు.
1957 లో పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టం ద్వారా తెలంగాణా ముల్కి నిబంధలను చట్ట బద్దత తీసుకొచ్చారు.
మొదటసారిగా ముల్కి నిబంధాలు అమలు కొరకు పాల్వంచ లో ఉద్యమం ఆరంభమయింది.
మిగులు నిధులను గుర్తించేందుకు కాగ్ అధికారి కుమార్ లలిత్ సారథ్యంలో కమిటిని ఏర్పాటు చేసారు. కేంద్ర ప్రభుత్వం కూడా 8 సూత్రాల పథకం భాగంగా మిగులు నిధులను గుర్తించేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జుస్టిస్ వశిస్ట్ సారథ్యంలో కమిటిని ఏర్పాటు చేసారు. ఇ కమిటీ కూడా తెలంగాణా నిధులను ఆంధ్రకు తరలించారని అంగీకరించింది.
1969 ఉద్యమం కారణాలు:
ముల్కి నిబందుల అమలు చేయకపోవడం
రాష్ట్ర పునర్వ్యవస్తికరణ చట్ట ప్రకారంగా తెలంగాణా ఏ ప్రాజెక్ట్ ను పట్టించుకోకపోవడం.
వ్యవసాయం, విద్యుదికరణ , ఎరువల కేటాయిన్మ్పు పట్ల వివక్ష.