మాదవ వర్మ:
‘జనాశ్రయ చంధో విచ్ఛిత్తి’ గ్రంథం రచించాడు. ఇందులో ద్విపద, త్రిపద పద్యాలతో పాటు వివిధ జాతుల పద్యాలు ఉన్నాయి.
భవభూతి:
ఇతడు ‘మాలతీమాధవం’ అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. భవభూతి నాడు తెలంగాణ ప్రాంతంలో సుప్రసిద్ధ కవి.
అమోఘవర్షుడు
కన్నడ భాషలో ‘కవిరాజ మార్గం’ గ్రంథాన్ని రచించాడు. ఇతడు ‘రత్నమాలిక’ అనే చంధోవిచ్ఛిత్తి గ్రంథాన్ని కూడా రచించాడు.
మూడో కుసుమాయుధుడు:
ఇతడికి ‘వినేత జనాశ్రయుడు’ అనే బిరుదు ఉంది. కొరివి శాసనం నిర్మాత ఇతడే. ఇది తెలుగులో తొలి గద్య శాసనం. ఇందులో వచన రచన మృదుమధురంగా ఉంది.
రెండో హరికేసరి:
ఇతడు కన్నడ భాషను పోషించిన వేములవాడ చాళుక్యరాజు. ఇతడి ఆస్థానంలో పంప మహాకవి ఉన్నాడు. పంపకవి ‘విక్రమార్జున విజయం’ రచించాడు. ఇతడు ఆదిపురాణం, తెలుగులో జినేంద్రపురాణం కూడా రచించాడు.
ఒకటో గోకర్ణుడు: ‘
గోకర్ణ చంధస్సు’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
ఉదయాదిత్యుడు: ‘ఉదయాదిత్యాలంకారం’ అనే లక్షణ గ్రంథం రచించాడు.
విరియాల కామసాని: గూడూరి శాసనం వేయించారు. నన్నయకు ముందే వృత్త పద్యాలు వాడిన తొలి శాసనం ఇదే.
నరహరి: ప్రసిద్ధ లాక్షణికుడు మమ్మటుడు రచించిన కావ్య ప్రణాళికకు ఇతడు ‘బాల చిత్తానురంజన’ పేరుతో వ్యాఖ్యానం చేశాడు. ‘స్మృతి దర్పణం’, ‘తర్కరత్నం’ ఇతడి రచనలు.
రుద్రదేవుడు లేదా ప్రతాపరుద్రుడు:
ఇతడు తెలుగులో ‘నీతిసారం’ గ్రంథాన్ని రచించాడు. మానవల్లి రామకృష్ణ సంస్కృతంలో ‘నీతిసారం’ రచించాడు
పాల్కురికి సోమనాథుడు (1160-1240):
ఈయన ‘పండితారాధ్య చరిత్ర’ రచించాడు. ఏ సంస్కృత పురాణంలో లేని స్వతంత్ర ఇతి వృత్తాన్ని తీసుకొని, పూర్తిగా దేశీయమైన భాషను ఉపయోగించాడు.
పాల్కురికి రాసిన గ్రంథాలు:
1) అనుభవసారం
2) చతుర్వేద సార సూక్తులు
3) సోమనాథభాష్యం
4) రుద్రభాష్యం
5) బసవరగడ
6) గంగోత్పత్తి రగడ
7) శ్రీ బసవాద్య రగడ
8) సద్గురు రగడ
9) చెన్నమల్లు సీసములు
10) మల్లమదేవి పురాణం (అలభ్యం)
11) శీల సంపాదన (కన్నడ)
12) బసవపురాణం
13) బెజ్జమహాదేవికథ
జాయపసేనాని (1199-1259):
ఇతడు నృత్త రత్నావళి, గీత రత్నావళి, నాట్య రత్నావళి గ్రంథాలను సంస్కృతంలో రచించాడు. పాకాల చెరువు శాసనం, కలువ కొలను శాసనం రచించాడే. నృత్యానికి సంబంధించిన లక్షణ గ్రంథం రాసిన తెలుగువారిలో మొదటివాడు ఇతడే. కవి పోషకుడైన కాకతి గణపతిదేవుడికి ఇతడు బావమరిది. జాయపసేనాని గజ సైన్యాధ్యక్షుడిగా కూడా పని చేశాడు. గణపతి దేవుడు ఇతడి సోదరిని వివాహం చేసుకొని చిన్నతనంలోనే ఇతడిని తీసుకెళ్లి గుండమాత్యుని దగ్గర చేర్పించాడు. గుండమాత్యుడు ఇతడిని గొప్ప సాహిత్య, సంగీత విద్వాంసుడిగా తీర్చిదిద్దాడు. జాయపసేనాని.. భరతుడి నాట్య శాస్త్రం మొదలుకొని తన కాలం దాకా వచ్చిన అనేక నాట్య, నృత్య, శాస్త్ర గ్రంథాలను కూలంకషంగా పరిశీలించి స్వతంత్ర ప్రతిపత్తితో ప్రామాణిక గ్రంథాన్ని రచించాడు. ఇతడు తన గ్రంథాల్లో పేరిణి నాట్యం గురించి కూడా వివరించాడు. ఇతడు ‘కవి చక్రవర్తి’గా ప్రసిద్ధి చెందాడు.
గోన బుద్ధారెడ్డి (1210-1240):
రంగనాథ రామాయణం రాశాడు. ఇది తెలుగులో తొలి రామాయణం. ఇందులో.. ఇంద్రుడు కోడై కూయడం, లక్ష్మణుడు ఏడుగీతలు గీయడం, ఊర్మిళ నిద్ర, లక్ష్మణ దేవుడి నవ్వు లాంటి కథలు కూడా రాశాడు. దీన్ని ద్విపద కావ్యంలో రచించాడు.
శివదేవయ్య: ‘పురుషార్థసారం’ గ్రంథాన్ని రచించాడు. ఇతడు గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడి వద్ద మంత్రిగా పనిచేసి మన్ననలు పొందాడు. సంస్కృతాంధ్ర కవితా పితామహుడిగా కీర్తి పొందాడు.
కుప్పాంబిక (1230-1300):
ఈమె తొలి తెలుగు/ తెలంగాణ కవయిత్రి. మొల్ల కంటే ముందే అనేక కవిత్వాలు రచించారు.
చక్రపాణి రంగనాథుడు:
శివభక్తి దీపిక, గిరిజాది నాయక శతకం, చంద్రాభరణ శతకం, శ్రీగిరినాథ విక్రయం, వీరభద్ర విజయం (సంస్కృతం) రచించాడు. (‘వీరభద్ర విజయం’ తెలుగులో పోతన రాశాడు)
కపర్డి: అపస్తంభ శ్రౌత సూత్ర భాష్యం, భరద్వాజ గృహ్యాసూత్ర భాష్యం, అపస్తంభ గృహ్యాపరిశిష్ట భాష్యం, శ్రౌత కల్పకావృత్తి, దివ్య పూర్ణభాష్యం ఇతడి ప్రసిద్ధ గ్రంథాలు. ఇతడు ప్రఖ్యాత వ్యాఖ్యాత మల్లినాథసూరి తండ్రి. మెదక్ జిల్లా కొలిచెలిమివాసి. ఇతడు గొప్ప భాష్యకారుడు.
గంగాధర కవి: మహాభారతాన్ని నాటక రూపంలో రచించాడు.
అప్పయార్యుడు: జినేంద్రకల్యాణాభ్యుదయం రాశాడు.
మంచన: కేయూర బాహు చరిత్ర రాశాడు.
శేషాద్రి రమణ: ఇతడు సంస్కృతంలో యయాతి చరిత్ర, ఉషా రాగోదయం (నాటకం) రచించాడు. యయాతి చరిత్రను తెలుగులో పొన్నెగంటి తెనగానచార్యుడు గోల్కొండ రాజు ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో రాశాడు.
మారన (1289-1323): ఇతడు తెలుగులో తొలి పురాణమైన ‘మార్కండేయ పురాణం’ తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథమైన ‘ఆంధ్రభాషాభూషణం’ రాశాడు.
కేతన: ఇతడు ‘విజ్ఞానేశ్వరీయం’ రాశాడు. ఇది తెలుగులో తొలి శిక్షాస్మృతి. ఇది యజ్ఞవల్కుడి స్మృతికి అనువాదం.
విద్యానాథుడు (1289-1323): ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రతాపరుద్ర కల్యాణం గ్రంథాలను రాశాడు. వీటిలో ప్రతాపరుద్రుడి యశోగానం కనిపిస్తుంది.
కుమారస్వామి: ‘సోమిపథి రత్నాపణ’ గ్రంథాన్ని రాశాడు.
చిలకమర్రి తిరుమలాచార్యులు: ‘రత్నశాణ’ రచించాడు. భట్టుమూర్తి ‘నరసభూపాతియం’ దీని అనువాదమే.
అగస్త్యుడు (1289-1323): బాల భారతం, కృష్ణచరిత్ర (గద్య కావ్యం), నలకీర్తి కౌముది (పద్య కావ్యం), మణిపరీక్ష (లక్ష్మీ స్తోత్రం), లలిత సహస్రనామం, శివ సంహిత, శివస్తవం తదితర 74 గ్రంథాలు రచించాడు.
గంగాదేవి అగస్త్యుడి శిష్యురాలు. ఈమె విజయనగర రాజైన కుమార కంపరాయలను వివాహం చేసుకుంది. ‘మధుర విజయం’ గ్రంథంలో భర్త ఘన విజయాలను వివరించింది.
తిక్కన:
ఈయన భారతాన్ని తెలుగులోకి అనువదించారు.
‘నన్నయ’ రాజరాజనరేంద్రుడి, ‘తిక్కన’ గణపతిదేవుడి, ‘ఎర్రన’ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురిని ‘కవిత్రయం’గా పేర్కొంటారు.
మల్లికార్జునుడు, హుళక్కి భాస్కరుడు, రుద్రదేవుడు.. ఈ ముగ్గురు కలిసి ‘భాస్కర రామాయణం’ రచించారు.
గవాసి ఇబిన్ నిషాత్ – తోతినామా.
తబియా – బహురావగుల్.
తులసీమూర్తి – సంగీత విద్వాంసుడు.
క్షేత్రయ్య – రాజుపై 12 వేల కృతులు రాశారు.
మరింగంటి వేంకట నరసింహాచార్యులు – హరివాసర మాహాత్మ్యం.
చరిగొండ నరసింహ – శశిబిందు చరిత్ర.
రాజలింగ కవి – కూర్మపురాణం.
కోన నారాయణ – వజ్రాభ్యుదయం.
పిల్లలమర్రి వేంకటపతి – రాజేశ్వర విలాసం.
గోపతి లింగ కవి – చెన్నబసవ పురాణం.
సురభి మాధవరాయలు: చంద్రికా పరిణయం అనే ప్రౌఢ కావ్యాన్ని శ్లేష అనుప్రాసాది శబ్ద చిత్ర నిపుణత్వంతో రచించాడు.
ఎలకూచి బాలసరస్వతి: సుభాషిత రత్నావళి, మాధవ రాఘవ పాండవీయం రాశాడు. ఇతడు భర్తృహరి సంస్కృతంలో రాసిన శృంగార, నీతి, వైరాగ్య శతకాలను సుభాషిత రత్నావళి పేరుతో అనువాదం చేసి మాధవ రాయల తండ్రి మల్లభూపాలుడికి అంకితం చేశాడు.
అప్పకవి: సాధ్వీజన ధర్మం (ద్విపద కావ్యం), అనంతవ్రతకల్పం (కావ్యం), అంబికావాదం (యక్షగానం), కవి కల్పకం (లక్షణ గ్రంథం) రాశాడు.
పోనుగోటి జగన్నాథాచార్యులు: కుముదవల్లి విలాసం (ఇది భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉండటం గమనార్హం)
కంచర్ల గోపన్న:
దాశరథీ శతకం రాశారు. ఈయనను భక్తరామదాసుగా పేర్కొంటారు. ఈయన అక్కన్న, మాదన్న మేనల్లుడు. 1650లో భద్రాచలం తహశీల్దార్‌గా నియమితులయ్యారు.
భద్రాచలంలో రామాలయం నిర్మించారు. అబుల్‌హసన్ తానీషా ఈయనను గోల్కొండలో బంధించాడు. గోపన్న భక్తికి మెచ్చి చివరకు విడుదల చేశారు.
పెన్గలూరి వెంకటాద్రి: భువన మోహిని విలాసం రాశారు.
విశ్వనాదయ్య: సిద్ధేశ్వర పురాణం (ద్విపదం) రచించారు.
అన్నంభట్టు: తర్క సంగ్రహం రాశారు.
కృష్ణమాచార్యులు: భగవద్గీత (ద్విపద) రాశారు.