గుణాడ్యుడు:
ఇతడు పైశాచీ ప్రాకృత భాషలో ‘బృహత్‌కథ’ రచించాడు. పైశాచీ అంటే వాడుక భాష. ఇతడు తెలంగాణ వాడుక భాషలో ఈ గ్రంథాన్ని రచించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. పైశాచీ భాషపై ప్రాకృతం, ప్రాకృతంపై సంస్కృతం ఆధిపత్యం చూపాయి. ప్రాచీన తెలుగు భాషనే దేశీ భాష అని డాక్టర్ దినేశ్ చంద్ర సర్కార్ అనే పండితుడి అభిప్రాయం.
గుణాడ్యుడిని తెలంగాణ మొదటి లిఖిత కవిగా పేర్కొంటారు. ఇతడు ‘బృహత్‌కథ’ గ్రంథాన్ని మెదక్ జిల్లాలోని కొండాపురంలో రచించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. బృహత్‌కథను మూలకథగా తీసుకొని క్షేమేంద్రుడు ‘బృహత్‌కథామంజరి’, సోమదేవసూరి ‘కథా సరిత్సాగరం’ రచించారు.
హాలుడు: శాతవాహన వంశానికి చెందిన 17వ రాజైన హాలుడు స్వయంగా కవి. ఇతడు ‘గాథా సప్తశతి’ గ్రంథాన్ని ప్రాకృత భాషలో రాశాడు.