Type Here to Get Search Results !

Vinays Info

1.నేలబోగ్గు మరియు బొగ్గు(Coal And Petroleum)

  • సహజ వనరులను తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులుగా వర్గీకరించవచ్చు.
  • ప్రాణుల యొక్క మృత అవశేషాలు కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమి లోపల కప్పబడి ఉండటం వలన శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి.
  • బొగ్గు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువులు శిలాజ ఇంధనాలు.
  • కోక్, కోల్ తారు మరియు కోల్ గ్యాసులు బొగ్గు యొక్క ఉత్పన్నాలు.
  • ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుండి పెట్రోలియం తయారవుతుంది.
  • పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారఫిన్ మైనం, కందెనలు మొదలగునవి పెట్రోలియంను శుద్ధి చేయడం వలన పొందుతాం.
  • సహజ వాయువు కొన్ని సందర్భాలలో పెట్రోలియంతో పాటు, మరికొన్ని సందర్భాలలో పెట్రోలియం లేకుండా లభ్యమవుతుంది.
  • పెట్రోలియం నుండి గ్రహించబడిన ఉపయోగకరమైన పదార్థాలను పెట్రో రసాయనాలు అంటాం.
  • శిలాజ ఇంధనాల అతి వినియోగం గాలి కాలుష్యం, గ్రీన్హౌజ్ ప్రభావం, భూతాపం వంటి సమస్యలతో పాటు అనేకమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
  • శిలాజ ఇంధన వనరులు పరిమితమైనవి. వాటికి ప్రత్యామ్నాయాలను మనం ఆలోచించాలి.
  • శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి మన జీవితాలను మార్చగలిగింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section