1.వానదేవుడా!(Vana Devuda)
- ప్రక్రియ: గేయం
- ఇతివృత్తం : పర్యావరణం
- వానల్లు కురవాలె వానదేవుడా !
- వరిచేలు పండాలె వానదేవుడా !! ..... అనే గేయ పంక్తులతో ఈ పాఠం మొదలవుతుంది.
- పై గేయంలో గల అలంకారం - అంత్యానుప్రాసాలంకారం
- చెరువులు నిండాలి, అలుగులై పారాలి అనే పంక్తులు ఇందులోనివే.
- బీడు భూములన్నీ ఎలా తడవాలి ? - బిరాన తడవాలి.
- పంట భూములన్నీ ఎలా మారిపోవాలి ? - పన్నెండు రకాల ధాన్యాలు పండేలా మారిపోవాలి.
- వలస పోయినోళ్ళంతా ఊళ్ళకు రావాలి, బతుకులు మారాలి, సౌభాగ్యం అందాలి వానదేవుడా... అని ఈ గేయం ద్వారా తెలియజేయబడింది. - వానదేవుడా!
- వానదేవుడా గేయంలోని ప్రాస పదాలు - కురువాలె, నిండాలె, పండాలె.
- వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడుతాయి.
- మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాం. ఈ గుర్తులనే మనం అక్షరాలు అంటున్నాం.
- అక్షరాలన్నింటిని కలిపి వర్ణమాల అంటున్నాం.
- అచ్చులు : అ - ఔ వరకు గల అక్షరాలు
- ఉభయాక్షరాలు :
- హల్లులు : 'క' నుండి 'ఱ' వరకు గల అక్షరాలు.
సూక్తి : పగలనక, రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు