సరీసృపాలు(Reptiles)
- సరీసృపాల అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు.
- పాకే జంతువులను సరీసృపాలు అంటారు. ఇవి మొదటి సంపూర్ణ భూచర జీవులు.
- ఇవి మొదటగా నఖాలు ఏర్పడిన జీవులు.
- వీటి హృదయంలో మూడు గదులు ఉంటాయి (రెండు కర్ణికలు, ఒక జఠరిక).
- ఇవి శీతలరక్త జంతువులు (cold blooded).
- వీటిని 4 క్రమాలుగా విభజించవచ్చు. అవి..
- కీలోనియా,
- రింకోసెఫాలియా,
- క్రొకడీలియా,
- స్క్వామేట.
కీలోనియా
ఈ క్రమంలో తాబేళ్లను చేర్చారు. సముద్ర తాబేళ్లను టర్టిల్స్ అని, మంచినీటి తాబేళ్లను టెర్రాఫిన్స్ అని, నేలపై నివసించే తాబేళ్లను టార్టాయిస్ అని అంటారు. అత్యధిక కాలం జీవించే జంతువు - తాబేలు.
కీలోన్ - (సముద్ర తాబేలు) (టర్టిల్ టెస్టుడో - (భౌమ తాబేలు) (టార్టాయిస్) ఇది అతిపెద్ద తాబేలు ట్రయోనిక్స్
- (మంచినీటి తాబేలు) (టెర్రాఫిన్)
రింకోసెఫాలియా
దీనిలో స్పీనోడాన్ను (హట్టేరియా బల్లిని) చేర్చారు.
ఇది న్యూజిలాండ్లో మాత్రమే నివ సించే సజీవ శిలాజం (Living fossil).
క్రొకడీలియా
• దీనిలో మొసళ్లను చేర్చారు. ఇవి బతికున్న సరీసృపాల్లో అతిపెద్దవి.
• మొసలిలో 4 గదుల హృదయం ఉంటుంది.
క్రొకడైలస్ పాలుస్టిస్ : భారతదేశ మొసలి/మగర్.
అలిగేటర్: ఇది అమెరికా, చైనాలో ఎక్కువగా కనబడుతుంది.
గేవియాలిస్ : గంగానది కాలుష్యం కారణంగా అంతరించిపోయే దశలో ఉన్న మొసలి.
స్క్వామేటా
దీన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. బల్లులు తొండలు, పాములు
(సర్పాలు). బల్లులు, తొండలు
వీటి అధ్యయనాన్ని సారాలజీ అంటారు.