Type Here to Get Search Results !

Vinays Info

పొరిఫెరా (Porifera) - Sponges - స్పంజికలు

Top Post Ad

పొరిఫెరా (Porifera) - Sponges - స్పంజికలు

  • పొరిఫెర అనగా “రంధ్రాలు కలిగిన జీవులు (Pore bearers)” అని అర్థం.
  • వీటికి ప్రత్యేక చలనాంగాలు ఉండవు కనుక ఇవి ఒక చోట నుండి వేరొక చోటుకు చలించవు (స్థానబద్ధజీవులు). ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి.
  • శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు 'నాళవ్యవస్థ’గా పనిచేస్తాయి. వీటి గుండా ఆక్సిజన్, ఆహారపదార్థాల రవాణా.. జరుగుతాయి.
  • శరీరం మొత్తం ఒక బలమైన 'అస్థిపంజరం'తో కప్పబడి ఉంటుంది.
  • శరీరాకృతి సరళంగా ఉంటుంది.
  • పరిణామక్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి.
  • వీటిని సాధారణంగా "స్పంజికలు (sponges)” అంటారు.
  • ఇవి ప్రధానంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి.
  • స్పాంజిల్లెడే కుటుంబానికి చెందిన మంచినీటి జీవులు తప్ప ఇతర స్పంజికలన్నీ సముద్రంలో జీవించును.
  • ఇవి వలయ సౌష్ఠవంతో గాని, అసౌష్ఠవంగా గాని ఉంటాయి.
  • శరీరము ఆస్టియాలనే సూక్ష్మ రంద్రాలతో ఉండుట వీటి ప్రత్యేక లక్షణం. శరీరం ఒక చివరలో ఆధారానికి అంటిపెట్టుకుని రెండో చివర "ఆస్కులామ్" అనే పెద్ద రంద్రాన్ని కలిగి ఉంటాయి. నీరు ఆస్టియాల ద్వారా లోనికి ప్రవేశించి, ఆస్కులామ్ ద్వారా బయటకు పోవును.
  • స్థాన బద్ధ జీవులు. కొన్ని ఏకాంత జీవులు.
  • స్పంజికలు బహుకణ జీవులు. కణాలు ప్రత్యేకీకరణ చెందలేదు. కాబట్టి కణపొరలు, నిజకణజాలాలు లేవు. కణజాల, అవయవస్థాయి నిర్మాణం లేదు.
  • స్పంజికల శరీరంలో ఉన్న రెండు కణాల పొరలను వేరుచేస్తూ జాంతవ పదార్థం ఉంది.
  • శరీర కుడ్యం రంధ్రాలు కలిగి ఉంటుంది. ఇవి శరీర కుహరంలోకి నీరు తీసుకోడానికి ఉపయోగపడతాయి. ఈ రంధ్రాలు సాధారణ లేదా క్లిష్టమైన నాళికలతో కలిసి ఒక అద్వితీయమైన వ్యవస్థగా ఏర్పడింది. దీనిని కుల్యా వ్యవస్థ అంటారు. దీని ద్వారాఅ నీరు ప్రవహిస్తుంది. కొయనోసైట్ కణాలు నీటిని శరీరంలోకి మళ్ళించడానికి దోహదం చేస్తాయి. నీటి ప్రవాహంతో పాటు వచ్చే సూక్ష్మజీవులు స్పంజికా కుహరంలోకి ప్రవేశించి పోషణలో ఉపయోగపడతాయి.
  • జాంతవ భక్షక పోషణ ఉంటుంది. స్పంజికలు అవలంబక పోషకాలు (వడపోత ఆహార సేకరణ). కాలర్ కణాలు క్రిమభక్షణ పద్ధతిలో ఆహార సేకరణ చేసి జీర్ణించుకొంటాయి. కొంత ఆహారాన్ని పక్కన ఉన్న అమీబోసైట్లకు అందిస్తాయి. థీసోసైట్ లలో ఆహారం నిలువ చేయడం జరుగుతుంది.
  • స్పంజికల శారీరంలో గల అంతరాస్థి పంజరం కాల్షియం కార్బొనేట్ లేదా సిలికా కంటకాలు లేదా ప్రోటీన్ యుక్తమైన స్పాంజిన్ తంతువులతో నిర్మితమై ఉంటుంది.
  • నాడీ కణాలు, జ్ఞాన కణాలు లేవు. శరీరపు వివిధ భాగాల విధులలో సమన్వయం లేదు.
  • ప్రత్యేకమైన శ్వాస, విసర్జన వ్యవస్థలు లేవు. పరస్పర వ్యాపనం ద్వారా ఈ క్రియలు జరుగును.
  • కణాంతస్థ జీర్ణక్రియ మాత్రమే జరుగును.
  • అలైంగికోత్పత్తి మొగ్గతొడగడం వల్ల జరుగుతుంది. స్పంజికలు ఉభయలింగజీవులు. శుక్రకణాలు, అండాలు కొయనోసైట్లు, ఆర్కియోసైట్ల నుంచి ఏర్పడతాయి. కుల్యావ్యవస్థ ద్వారా స్పంజికా కుహరంలోకి ప్రవేశించిన శుక్రకణాలను కూయనోసైట్లు అండం వరకు చేర్చుతాయి. స్త్రీ సంయోగ బీజాలు గల మీసోహిల్ లో ఫలదీకరణ జరుగుతుంది.
  • స్పంజికలలో కొన్ని ఉభయ లైంగికాలుగా, కొన్ని ఏకలింగ జీవులుగా ఉంటాయి.
  • స్పంజికలలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. విడికణాలు కూడాఅ సంకలితంగా చేరి స్పంజిక పూర్తి శరీరాన్ని ఏర్పరుచుకొంటాయి.
  • స్పంజికల అధ్యయనాన్ని పారా జువాలజీ అంటారు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.