Type Here to Get Search Results !

Vinays Info

గణిత శాస్త్ర చరిత్ర - అరబ్బులు

Top Post Ad

గణిత శాస్త్ర చరిత్ర :

ప్రాచీన కాలంలో అనేక నాగరికతలు ఏర్పడినా వాటిలో కొన్ని నాగరికతల్లో మాత్రమే గణనీయ స్థాయిలో గణిత శాస్త్రం అభివృద్ధి అయింది. వాటిలో ఈజిప్టు, బాబిలోనియా, భారతదేశం ముఖ్యమైనవి.

వేదాలలోని, శ్లోకాలలోని వర్ణించిన జీవన పరిస్థితులు, భూగోళ విషయాలపై గల వివరాల ఆధారంగా వేదకాలం క్రీ.పూ 6000 నుంచి క్రీ.పూ 3000 వరకు అని నిర్ణయించారు. కానీ ప్రాచీన చరిత్రకారులు ప్రముఖంగా వారికి తెలిపిన బాబిలోనియా, ఈజిప్టు గణిత చరిత్రనే ప్రచారం చేశారు.

అరబ్బులు :

అరబ్బులు వ్యాపారం కోసం ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ ఉన్నప్పుడు వారు పర్యటించిన ప్రతీ ప్రాంతంలోనూ వాడుకలో ఉన్న సమాచారాన్ని సేకరిస్తూ ఉండేవారు. టాలమీ గ్రంథ రాజం అయిన గణిత శాస్త్ర సమాహారంను 'ఆల్మగెస్ట్' అని పిలిచేవారు.

ఈ క్రమంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వీరి ద్వారా సమాచారం ప్రసారమయ్యేది. వీరు గ్రీకులు, భారతీయుల నుండి కూడా కొన్ని ఉపయోగకరమైన భావనలు గ్రహించారు.

అరబ్బులు 1 నుండి 9 వరకు ఉన్న ప్రత్యేక సంజ్ఞానాత్మక అంకెలు, సున్నా (0) కలిగి 10 ఆధారంగా గల భారతీయ సంఖ్యా విధానం వారి దేశంలో ప్రవేశపెట్టారు.

అరబ్బు గణిత శాస్త్రజ్ఞుడు ఆల్క్వారిజ్మీ రచించిన బీజగణితం రెండు ముఖ్య నియమాల మీద ఆధారపడి ఉంది. 

1) రెస్టోరేషన్ అనగా ఒక సమీకరణంలోని ఋణ పదాలను సమీకరణంలోని రెండవ వైపు తీసుకొని వెళ్ళడం.

2) రిడక్షన్ అనగా సజాతి పదాల కూడిక. ఇతడు సామాన్య వర్గ సమీకరణం సాధించే పద్ధతిని వివరించాడు.

3) టబి ఐబిన్ కొర్ర అను గణిత శాస్త్రవేత్త అమికబుల్ నెంబర్స్ అను అంశం మీద ఒక గ్రంథాన్ని రాశాడు. వీరు కోణాన్ని త్రిధాకరించాడు. మాత్రిక చతురస్రాలను గురించి చర్చించిన తొలి చైనీయుడు.

19వ శతాబ్దపు ఖగోళ శాస్త్రజ్ఞులలో ప్రముఖుడు ఆల్-బట్టాని. ఇతడు కో-టాంజంట్ పట్టికలు తయారు చేశాడు.

Below Post Ad

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.