విద్యార్థుల క్రమశిక్షణ కూడా పాఠ్యపుస్తకాలలాగే తత్త్వశాస్త్ర పునాదులపైనే ఏర్పడుతుంది.
ఈ విషయంలోనూ తాత్వికుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి.
ఆదర్శవాదులు ఉపాధ్యాయుని మూర్తిమత్వమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తారు.
ఉపాధ్యాయుని వ్యక్తిత్వ ప్రభావమునకు విద్యార్థిలోనై తనంతటతానే క్రమశిక్షణ అలవరచుకొంటాడు అన్నది వీరి భావన.
శిశువును దండించకున్న అతడు చెడిపోవచ్చు అన్న భావన వీరిది. (spare the rod spoil the child) ప్రకృతివాదులు స్వేచ్ఛాక్రమశిక్షణ (free discipline) కావాలంటారు. విద్యార్థిని దండించడం నిరసిస్తారు. విద్యార్థికి
సంపూర్ణ స్వేచ్ఛనివ్వడంలో ఏకీభవిస్తారు. క్రమశిక్షణ విషయంలో తాత్వికులు భిన్న అభిప్రాయాలు వెలిబుచ్చుతారు. తత్వం విద్యావిధానంపై చూపు ప్రభావంలో ఇది ఒకటి.