Type Here to Get Search Results !

Vinays Info

బౌద్ధకాలంలో విద్యావిధానం - Education in Buddhist times

బౌద్ధకాలంలో విద్యావిధానం - Education in Buddhist times

  • "బౌద్ధ విద్యావిధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి, భారతీయ తాత్విక సిద్ధాంతమైన “మోక్షసాధన” ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది. 
  • బౌద్ధవిద్యావిధానంలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించబడింది. నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల మొదలైన ప్రముఖ విద్యాసంస్థలు ఈ కాలంనాటివే.
  • వేదవిద్యాపద్ధతిలాగ ఈ విధానంలో కూడా విద్యార్థిదశ “ప్రబృష్టి" అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో 8 సం॥ల వయస్సులో గురువు విద్యార్ధిచేత ఈ కింది మూడు మాటలు అనిపించేవారు. 

"బుద్ధం శరణం గచ్ఛామి

“ధర్మం శరణం గచ్ఛామి"

సంఘం శరణం గచ్ఛామి"

  • ఈ మాటలు వల్లించిన తరవాతనే విద్యార్థి సంఘంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించేవాడు.’ 
  • విహారాలు, మఠాలు' బౌద్ధకాలం నాటి విద్యా కేంద్రాలు.
  • ఉపాధ్యాయుడు కావడానికి 10 సం॥ల పాటు సన్యాసిగా ఉండి బోధనావృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి. ఉపాధ్యాయుడికి, విద్యార్థికి మధ్య తండ్రీకొడుకుల మధ్య ఉండే సంబంధం ఉండేది. విజ్ఞాన సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానాన్ని అందచేయడం ఉపాధ్యాయుడి బాధ్యత. నూలుతీయడం, వడకడం, గణన, దుస్తులతయారి (టైలరింగ్), చిత్రకళ (పెయింటింగ్), ఆయుర్వేదం, శిల్పకళ మొదలైన వృత్తి సంబంధమైనవి పాఠ్యాంశాలలో ఉండేవి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section