భారతీయ, పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలను గమనిస్తే విద్య స్వభావం అనేక అంశాలతో కూడిన విశిష్ట లక్షణాలను మేళవిస్తుంది.
శరీరంలోను, మనస్సులోనూ, ఆత్మలోనూ నిక్షిప్తమైన అత్యున్నత శక్తులను బయటకు తీయుటయే విద్య అని ఒకరంటే "జీవితమే విద్య" అని మరొకరన్నారు.
నాగరిక ప్రపంచంలో విద్య అందరికి అవసరమే. మానవ సామాజిక జీవితం మారుతోంది. దీని నేపథ్యంలో విద్య అర్ధం, స్వభావం కూడ మారుతూ ఉంటుంది.
మానవ పరిణామక్రమంలో విద్య స్వభావం కూడ గతిశీలమైనది. విద్య భావం అపరిమితమైనది. ఇది మానవ చరిత్రలో అతి ప్రాచీనమైనది.
'విద్య గర్భస్థ శిశువు నుంచి మరణించే వరకు నిరంతరం కొనసాగే ప్రక్రియ. మనిషి వివిధ దశల్లో పొందిన విజ్ఞానం, అనుభవం విద్యగా గమనించాలి.
విద్య అనేది ఒక క్రమమైన పద్ధతిలో కొనసాగే ప్రక్రియ. ఇందులో ఒకస్థాయి అనంతరం “మరోస్థాయిలో ప్రగతిని కొనసాగించేదేకాని ఖండికలుగా ఒక స్థాయిని వదలి మరొక స్థాయి నుంచి ఆరంభించడం సాధ్యంకాదు. విద్యాసంస్థల్లో ఒక పద్ధతి ప్రకారం నిర్వర్తించబడుతుంది.
విద్య అనేది వ్యక్తి నుంచి ఆరంభమై వ్యక్తుల సమూహం (society), సమాజంలోని అందరికి ఆవశ్యకమైనదని చెప్పవచ్చు. అనగా వ్యక్తి ప్రగతియే సామాజిక ప్రగతి, కాబట్టి విద్య. అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది.
విద్య వ్యక్తిలో పరివర్తన, ప్రవర్తన మార్పులను ఆశిస్తూ మానవ ప్రగతికి దిశానిర్దేశాన్ని సూచిస్తుంది.
విద్య ఒక సుశిక్షణ దానిద్వారా వ్యక్తిలో క్రియాశీలత, సృజనాత్మకత, ప్రయోజనాత్మకతను
పెంపొందిస్తుంది. విద్యలేని వాడు వింత్రపశువు. విద్యలేని జీవితం పశుత్తుల్యం, సకల ప్రాణులకు విద్య సహజాతంగా వస్తుంది. కాని మానవుడు మాట్లాడే జంతువు, అతనికి వివేచన, విచక్షణ విద్య ద్వారా మాత్రమే లభిస్తుంది.
విద్య అనేది మానవుల్ని - ఇతర ప్రాణులకంటే, అలాగే విద్యలేని మానవుని కంటే ఉన్నత భావాలు కలిగిన నిపుణత గల వ్యక్తిగా రూపొందిస్తుంది. విద్యయే బలం, విద్యయే ధనం, విద్యావంతుడు ఎక్కడైనా రాణించగలడు.
సమాజ ప్రగతికి, ఆరోగ్యకరమైన సమాజానికి విద్య ఎంతగానో ఆవశ్యకతను కలిగియుంది. కాబట్టి విద్య స్వభావం - ఇదమిద్దంగా ఇంతే అని చెప్పలేం. చాలా విస్తృతమైన పరిధిని కలిగిఉంది.