Type Here to Get Search Results !

Vinays Info

భారతీయ విద్యా, తత్వవేత్తల అభిప్రాయం (Indian concept of Education)

 విద్య - భారతీయ విద్యా, తత్వవేత్తల అభిప్రాయం (Indian concept of Education) 

  • 'విద్' అనగా తెలుసుకొనడం (విద్ అనేది సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది).
  • మొదట తననుతాను తెలుసుకొనడం, అనంతరం దివ్యత్వం గురించి తెలుసుకొనడం ఆత్మనుగూర్చి తెలుసుకొనడం అనే ఉదాత్తమైన భావనల నుంచి ఆవిర్భవించిందే విద్య. 
  • విద్య అపరిమితమైనది. 
  • ఇది వ్యక్తి సంపూర్ణ మూర్తిమత్వానికి తోడ్పడుతుంది, దీనికి పరిధి లేదు. విశ్వ మానవుడిని తయారుచేస్తుంది.

విద్య-నిర్వచనాలు

  • "వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునదే విద్య" - గాంధీజీ
  • "వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య" - ఠాగూర్
  • “శిశువు అభివృద్ధి, జీవితాంతం కొనసాగే ప్రక్రియ" - జాకీర్ హుస్సేన్ 
  • "మానవుని నిస్వార్థ తత్పరునిగా, స్వావలంబకుడిగా తయారు చేయునది విద్య" వేదాలు.
  • “మోక్ష సాధనే విద్య”. ఉపనిషత్తులు
  • “ఆత్మ సాక్షాత్కారం పొందటమే విద్య". - శ్రీ శంకరాచార్య
  • "మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య”- స్వామి వివేకానంద
  • "ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య" - డి.ఎస్.కొఠారి

పై నిర్వచనాలను గమనిస్తే విద్య అనేది సమగ్రమైనది. దానిప్రభావానికి అనుగుణ్యంగా జరిగే మార్పులను తగనుగుణంగా సమతుల్యంచేసి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా రూపొందించడానికి తోడ్పడుతుంది. సూక్ష్మంగా పొందే విద్య పాఠశాల ద్వారా అందించబడుతుంది. స్థూలంగా లభించే విద్య సమగ్రమైనది. ఇది జీవితానుభవాలను జోడించి నిరంతరం కొనసాగే ప్రక్రియ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section