విద్య-పరిమిత, విస్తృత అర్థాలు (Narrow and broader Meaning of education)
VINAYS INFOMarch 14, 2022
విద్య-పరిమిత, విస్తృత అర్థాలు (Narrow and broader Meaning of education)
విద్య అనేది ఏకరూప వివరణ ఇవ్వలేనిది. విద్య చాలా విస్తృతమైన పరిధిని కలిగిఉందని చెప్పవచ్చు.
విద్య అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞావంగా లేదా జీవితానుభవాల వల్ల కలిగే జ్ఞాన వికాసంగా నిర్వచించవచ్చు.
ఇలా విద్య సంకుచిత విస్తృత అర్థాలను కలిగిఉంది. పాఠశాల వ్యవస్థ ద్వారా నేర్చుకొనే అంశాలు సంకుచితంగాను, వీటితోపాటు జీవితానుభవాలను జోడించి నేర్చుకొనే జ్ఞానాన్ని విస్తృతంగాను చెప్పవచ్చు.
పరిమితార్ధం(Narrow Meaning of Education)
పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి.
పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు, కార్యక్రమాల ప్రభావాల ఫలితం.
క్రమబద్ధమైన విద్యావిధానం కేవలం 3R's (Reading, writing and Arithmetic) కు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమైంది.
విద్య యొక్క విస్తృతార్థం(Border Meaning of Education)
విస్తృతార్థంలో విద్య అంటే కేవలం 3R's చదవటం (Reading), రాయటం (Writing) లెక్కించటం (Arithmetic) మాత్రమే కాదు, జీవితమే విద్య, ఇది ఒక నిరంతర ప్రక్రియ.
ఇది తల్లి గర్భం నుంచి మృత్యువు (womb to tomb) వరకు సాగుతూనే ఉంటుంది.
విద్య మానవ జీవితంలో జరిగే అవిరామ కృషి, విస్తృతార్తంలో ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి మానవుడి ప్రవర్తనను పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చేయుటకు ఉపయోగపడుతుంది. అపరిమితమైనదేకాకుండా సంపూర్ణ మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడుతుంది.