Type Here to Get Search Results !

Vinays Info

విద్య అర్థం, భావన(Means of Education and Concept)

1.0 విద్య అర్థం, భావన(Means of Education and Concept)

  • 'విద్య లేనివాడు వింతపశువు' అన్నాడు ఓ మహాశయుడు. విద్య మానవ సుగుణం.
  • విద్య మానవునికి మూడవ కన్ను వంటిది. మానవ సమాజాలు ఏర్పడ్డ తరువాత వాటి నిర్వహణకు సమాజ సభ్యులందరిని సమాయత్తం చేసి వారిని సమాజ నిర్వహణలో భాగం పంచుకోవడానికై జ్ఞానవంతులుగా మార్చవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం సమాజం ఇతర వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థను రూపొందించుకొన్నది. 
  • సమాజంలోని ఇతర వ్యవస్థలైన కుటుంబం, రాజకీయ వ్యవస్థ, ఆర్ధిక వ్యవస్థ తదితర వ్యవస్థల నిర్వహణకు సమర్థవంతమైన విద్యావంతులు అవసరం ఉందని ప్రపంచంలోని సమాజాలన్నీ ముక్తకంఠంతో అంగీకరించే విషయం. ఇటువంటి అంశాన్ని ప్రధానంగా ఉపాధ్యాయులు సరైన రీతిలో అవగాహన చేసుకొని తదనుగుణంగా విధులను నిర్వహించవలసి ఉన్నది. 
  • విద్యాభావనను సార్వత్రికంగా అవగాహన చేసుకొని దానికి భారతీయ, పాశ్చాత్య, తాత్విక దృక్పథంతో విద్యాభావన ఎలా వివరించబడిందో తెలుసుకోవాలి. దానితోపాటు విద్య అంతర్భావాలను కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది.
  • ఆధునిక సమాజంలో విద్య అందరికి అవసరం. విద్య మానవుని ప్రవర్తనను మార్చుతుంది.' విద్య గురించి తత్వవేత్తలు, విద్యావేత్తలు, రాజకీయ వేత్తలు, మతగురువులు కాలానుగుణంగా, సామాజిక అవసరాలకు అనుగుణంగా తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. అందుకే విద్యకు ఒకే నిర్ణీత అర్థం ఇవ్వటం సాధ్యంకాదు. విద్య భావన పరిణామ ప్రక్రియలో ఉందని చెప్పగలం.
విద్యా దృక్పథాలు (Perspectives in Education)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section