అంతస్రావిక వ్యవస్థ
మానవుని శరీరానికి సంబంధించి అన్ని రకాల జీవక్రియలను సమన్వయపరిచే వ్యవస్థనే ‘అంతస్రావిక వ్యవస్థ’ అంటారు. అంతస్రావిక వ్యవస్థ గురించి చదివే శాస్త్రం- ఎండోక్రినాలజీ
అంతస్రావిక వ్యవస్థలో రెండు రకాల గ్రంథులు ఉన్నాయి.
అవి..
1) నాళ గ్రంథులు/బాహ్యస్రావిక గ్రంథులు. ఈ గ్రంథులు ‘ఎంజైమ్’లను స్రవిస్తాయి.
2) వినాళ గ్రంథులు/అంతస్రావిక గ్రంథులు
ఇవి ‘హార్మోన్’లను స్రవిస్తాయి.
హార్మోన్స్
- హార్మోన్లను ‘రసాయన రాయబారులు అంటారు.
- హార్మోన్లను 1905లో ‘బేలిస్ అంట్ స్టార్లింగ్’ కనుగొన్నారు.
- అంతస్రావిక గ్రంథులు 5 రకాలుగా ఉంటాయి.
అవి..
1) థైరాయిడ్ గ్రంథి 2) అథివృక్క గ్రంథి
3) పీయూష గ్రంథి 4) బాల గ్రంథి
5) పీనియల్ గ్రంథి
ముష్కాలు
- ఇవి ముష్క గోణుల్లో అమరి ఉంటాయి.
- ముష్కాలు అనేవి ‘టెస్టోస్టిరాన్’ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ ‘శుక్రకణాల ఉత్పత్తి’లో పాల్గొంటుంది. పురుషుల్లో ‘ద్వితీయ లైంగిక లక్షణాలు’ ఏర్పడటానికి తోడ్పడుతుంది.
- టెస్టోస్టిరాన్ హార్మోన్ లోపిస్తే ‘పురుషుల్లో వంధ్యత్వం వస్తుంది.
స్త్రీ బీజకోశాలు
- ఇవి స్త్రీలలో ‘ఉదర భాగం’లో ఉంటాయి. వీటిలో 3 రకాల హార్మోన్లు ఉంటాయి.
1) ఈస్ట్రోజెన్
- ఇది స్త్రీలలో ‘అండాల విడుదలలో, ద్వితీయ లైంగిక లక్షణాలు ఏర్పడటంలో తోడ్పడుతుంది.
2) ప్రొజెస్టిరాన్
- ఈ హార్మోన్ గర్భాశయంలోని ‘పిండ ప్రతిస్థాపనకు’ సహాయపడుతుంది.
3) అయిస్ట్రాయిడల్ హార్మోన్
- ఇది గర్భాశయం పెరుగుదల, కడ్డీ వలయం పెరుగుదల, స్త్రీలల్లో 28 రోజుల రుతుచక్ర నియంత్రణకు సహాయపడుతుంది.
థైరాయిడ్ గ్రంథి/అవటు గ్రంథి
- ఈ గ్రంథి వినాళ గ్రంథుల్లోకెల్లా/అంతస్రావిక గ్రంథుల్లోకెల్లా అతిపెద్దది.
- ఇది గొంతు భాగంలో ఉంటుంది.
- ఇది ‘H’ ఆకారంలో ఉంటుంది.
- దీనిని ‘ఆడమ్స్ యాపిల్’ అంటారు.
- ఇది ‘థైరాక్సిన్ హార్మోన్’ని స్రవిస్తుంది.
థైరాక్సిన్
- దీనిలో ‘అయోడిన్’ మూలకం ఉంటుంది.
- అయోడిన్ లోపించడం వల్ల ‘సామాన్య గాయిటర్’ వస్తుంది.
- థైరాక్సిన్ చిన్నపిల్లల్లో లోపిస్తే ‘క్రిటినిజం’ అనే వ్యాధి వస్తుంది.
- ఈ వ్యాధి లక్షణం బుద్ధి మందగించడం.
- థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి మిక్సిడోమా. ఈ వ్యాధి లక్షణం కనుగుడ్లు బయటకు పొడుచుకుని రావడం.
అథివృక్క గ్రంథి
- ఇది మూత్రపిండాలకు అంటిపెట్టుకుని ఉంటుంది.
- దీనిని ‘సూప్రారీనల్ గ్రంథి/ఎడ్రినల్ గ్రంథి’ అంటారు.
- అథివృక్క గ్రంథిలో రెండు భాగాలు ఉన్నాయి. 1) వల్కలం 2) దవ్వ వల్కలం
- ఇది 3 రకాల హార్మోన్లను స్రవిస్తుంది.
1) ఆండ్రోజెన్
2) కార్టిసాల్
3) అల్డోస్టిరాన్
ఆండ్రోజెన్
- ఈ హార్మోన్లు ‘స్త్రీలలో ఎక్కువైతే విరిలిజం వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణం మీసాలు, గడ్డాలు రావడం.
కార్టిసాల్
- ఈ హార్మోన్ ఎక్కువ కావడం వల్ల ‘బఫెలో నెక్’ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణం మెడపై భాగంలో కొవ్వు పేరుకుపోవడం.
అల్డోస్టిరాన్
- ఈ హార్మోన్ లోపం వల్ల ఎడిసన్స్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి లక్షణం చర్మం ఇతర రంగుల్లోకి మారడం.
- ముఖంపై మచ్చలు ఏర్పడటం.
- ఇది 2 రకాల హార్మోన్లను స్రవిస్తుంది.
1) అడ్రినలిన్ 2) నాన్ అడ్రినలిన్
అడ్రినలిన్
- ఈ హార్మోన్‌ను పోరాట పలాయన హార్మోన్ లేదా 3F హార్మోన్ అంటారు.
- ఈ హార్మోన్ భావోద్వేగ సమయంలో విడుదలవుతుంది.
నాన్ అడ్రినలిన్
- ఈ హార్మోన్ ‘మానవుని రక్తపీడనాన్ని నియంత్రిస్తుంది.
పీయూష గ్రంథి/పిట్యూటరీ గ్రంథి
- ఈ గ్రంథి మెదడులో ఉంటుంది.
- దీనిని మాస్టర్ గ్లాండ్/గ్రంథుల్లోకెల్లా అతి ప్రధాన గ్రంథి.
- ఈ గ్రంథి ‘బఠాణీ గింజ’ ఆకారంలో ఉంటుంది.
- ఈ గ్రంథి మానవుని శరీరంలో ఉండే అతి చిన్న గ్రంథి/ వినాళ గ్రంథుల్లోకెల్లా/ అంతస్రావిక గ్రంథుల్లోకెల్లా అతి చిన్నది.
- ఈ గ్రంథి వివిధ రకాల హార్మోన్లను స్రవిస్తుంది.
సొమాటో-ట్రాపిక్ హార్మోన్ (ఎస్‌టీహెచ్)
- దీనిని పెరుగుదల హార్మోన్/ గ్రోత్ హార్మోన్ అంటారు.
- ఈ హార్మోన్ చిన్నపిల్లల్లో తక్కువైతే ‘మరుగుజ్జుతనం (డ్వార్ఫిజం)’ వస్తుంది.
- ఈ హార్మోన్ చిన్నపిల్లల్లో ఎక్కువైతే ‘అతిదీర్ఘకాయత్వం (జైగాంటిజం)’ వస్తుంది.
థైరో-ట్రాపిక్ హార్మోన్
ఈ హార్మోన్ ‘థైరాయిడ్‌పై ప్రభావం చూపుతుంది’.
గోనాడో-ట్రాపిక్ హార్మోన్
ఈ హార్మోన్ ‘ముష్కాలు, స్త్రీ బీజకోశాల’పై ప్రభావం చూపుతుంది.
ఎఫ్‌ఎస్‌హెచ్
ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్- ఎఫ్‌ఎస్‌హెచ్
ఈ హార్మోన్ స్త్రీలలో ‘అండాలను విడుదల చేసే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. పురుషుల్లో శుక్రకణాల విడుదలకు సహాయపడుతుంది.
ఎల్‌హెచ్
ల్యూటినైజింగ్ హార్మోన్- ఎల్‌హెచ్
ఈ హార్మోన్ స్త్రీలల్లో విడుదలైన అండం ఫాలోపియన్ నాళం ద్వారా వెళ్లడానికి తోడ్పడుతుంది.
వాసోప్రెసిన్
ఈ హార్మోన్ లోపం వల్ల ‘అతిమూత్ర వ్యాధి/డయాబెటిస్ ఇన్‌సిపిడస్’ వస్తుంది.
అతిమూత్ర వ్యాధి వచ్చిన వ్యక్తి ప్రతిరోజూ 5 లీటర్ల మూత్రం విసర్జిస్తాడు.
మానవుడు ఒక్కరోజుకు విసర్జిస్తున్న మూత్రం 1.5 లీటర్లు
ప్రొలాక్టిన్
ఈ హార్మోన్ స్త్రీలలో పాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఆక్సిటోసిన్
ఈ హార్మోన్ గర్భాశయంలోని మృదు కండరాలను వదులు చేస్తుంది.
బాల గ్రంథి/థైమస్ గ్రంథి
దీనిని తాత్కాలిక అంతస్రావిక గ్రంథి అని అంటారు.
ఇది గుండెకు, 2 ఊపిరితిత్తులకు మధ్య ఉంటుంది.
ఇది థైమోసిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
థైమోసిన్
ఇది చిన్నపిల్లల్లో ఉండి కౌమార దశలో అంతం అవుతుంది.
ఈ హార్మోన్ చేసే ముఖ్య పని తెల్ల రక్తకణాల్లో ఉండే 3 లింఫోసైట్స్ కణాల సంఖ్యను పెంచుతుంది. దీని ద్వారా ఆ వ్యక్తి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
పీనియల్ గ్రంథి
ఇది పీయూష గ్రంథి కంటే చిన్నది.
ఇది మెలటోనిన్ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
మెలటోనిన్
ఈ హార్మోన్‌లో ‘మెలనిన్’ అనే రంగు పదార్థం ఉంటుంది. ఇది చర్మానికి రంగును ఇస్తుంది.