రక్త ప్రసరణ వ్యవస్థ నిమ్నశ్రేణికి చెందిన జీవుల్లో ఒకటే కణం ఉండటం వల్ల వివిధ పదార్థాల రవాణా సులభంగా జరుగుతుంది.
ఉదాహరణ: అమీబా వంటి జీవుల్లో జీవపదార్థమే రక్తం ప్రసరించి అన్ని భాగాలకు వివిధ పదార్థాలను రవాణా చేస్తుంది. దీనినే ‘వ్యాపనం’ అంటారు.
వ్యాపన పద్ధతిలో మానవుల్లో రవాణా జరగాలి. అంటే 2 మీటర్ల దూరానికి 60 సంవత్సరాల కాలం పడుతుంది.
రవాణాను వేగవంతం చేయడానికి రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడింది. మానవుని రక్తప్రసరణ వ్యవస్థలో మూడు భాగాలు కలవు.
1. రక్తం
2. రక్తనాళాలు
3. హృదయం
ఆరోగ్యవంతమైన వ్యక్తిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం అధ్యయనాన్ని ‘హిమటాలజీ’ అంటారు.
రక్తం ఒక ద్రవరూప కణజాలం, ఒక సంధాయక కణం.
రక్తం సాధారణంగా క్షారస్థితిలో ఉంటుంది.
దీని P.H విలువ (7.4) 7 కంటే ఎక్కువ.
రక్తంలో 2 భాగాలుంటాయి.
ప్లాస్మా, రక్తకణాలు
ప్లాస్మా:
రక్తం గడ్డకట్టకముందు గడ్డకట్టించే ద్రవపదార్థాన్ని ప్లాస్మా అంటారు. ఇది లేత పసుపు రంగులో ఉంటుంది. ప్లాస్మాలో 90 శాతం నీరు ఉంటుంది. ప్లాస్మా రక్తంలో 60 శాతం ఉంటుంది. ప్లాస్మాలో ప్రతిరక్షకాలు ఆల్బిమిన్లు, గ్లోబ్యులిన్స్ అనే ప్రొటీన్‌లు ఉంటాయి.
రక్తం గడ్డకట్టకుండా రక్తనాళాల్లో తోడ్పడే, ఉపయోగపడే పదార్థం ‘హిపారిన్’.
రక్తం గడ్డకట్టిన తర్వాత తేలియాడే ద్రవపదార్థం ‘సీరం’.
సీరం కూడా లేత పసుపు రంగులో ఉంటుంది. దీనిలో ఎలాంటి ప్రొటీన్స్ ఉండవు. ప్రతిరక్షకాలు కూడా ఉండవు.
రక్తకణాలు:
రక్తం గడ్డ కట్టిన తరువాత అడుగు భాగాన గల ఘన పదార్థాన్ని రక్తకణాలు అంటారు.
ఎర్ర రక్తకణాలు:
వీటినే ఎరిత్రోసైట్లు అంటారు. ఎర్రరక్త కణాలు ద్విపుటాకారంగా ఉంటాయి.
ఎర్రరక్త కణాల్లోని కేంద్రకం క్షీరదాల్లో సాధారణంగా ఉండదు. కానీ ఒంటె, లామా అనే రెండు క్షీరదాల్లో ఎర్రరక్తకణాల్లో కేంద్రకం ఉంటుంది.
ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ఎముక మజ్జ లేదా అస్థిమజ్జలో జరుగుతుంది. ఎర్ర రక్తకణాలు 120 రోజులు జీవిస్తాయి.
ఎర్ర రక్తకణాలు ఒక క్యూబిక్ మి.లీ. రక్తంలో 4.5-5×106
ఎర్ర రక్తకణాలు చనిపోయే భాగం ప్లీహం. దీనినే ఎర్ర రక్తకణాల స్మశానవాటిక/Burial Ground of the RBC అంటారు.
ఎర్ర రక్తకణాలు ఒక రోజులో చనిపోయేవి, జన్మించేవి 10×1012
ఎర్ర రక్తకణాలు చిన్నపిల్లల్లో శిశువు దశలో కాలేయం నుంచి, పిత్తాశయం నుంచి జన్మిస్తాయి.
ఎర్ర రక్తకణాలు ఎరుపురంగులో ఉండటానికి కారణం హిమోగ్లోబిన్. రక్తంలో అతిపెద్ద ప్రొటీన్ హిమోగ్లోబిన్ మూలకం Fe (ఐరన్).
సాధారణంగా హిమోగ్లోబిన్ స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ.
హిమోగ్లోబిన్ శాతం 4mgకు తగ్గిపోతే కలిగే జన్యుసంబంధ వ్యాధి ‘తలసేమియా’ అంటారు. ఈ వ్యాధిలో ఆల్ఫా, బీటా అనే రెండు రకాలు కలవు.
హిమోగ్లోబిన్ ప్రొటీన్‌లో వివిధ భాగాల్లో వచ్చే లోపాల వల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు కలుగుతాయి.
ఎర్ర రక్తకణాల సంఖ్య తగ్గిపోతే కలిగే వ్యాధి ‘ఎనీమియా’.
ఎర్ర రక్తకణాలు వాయువును రవాణా చేస్తాయి. ప్రతిజనకాలను కలిగి ఉంటాయి.
తెల్లరక్త కణాలు (ల్యూకోసైట్లు):
ఇవి అమీబా ఆకృతిలో ఉంటాయి. 12-13 రోజులు జీవిస్తాయి.
కేంద్రకం ఉంటుంది. తెలుపు రంగులో ఉంటాయి. ఇవి ‘లింఫ్’ ద్రవంలో జన్మిస్తాయి.
శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులతో తెల్లరక్త కణాలు పోరాటం చేస్తాయి.
వ్యాధులను అరికడతాయి. కాబట్టి వీటిని శరీరానికి రక్షక భటులు అంటారు.
గ్రాన్యులోసైట్లు: జీవ పదార్థంలో చిన్న చిన్న రేణువులు ఉంటాయి. వీటినే కణికాభ సహిత తెల్లరక్త కణాలు అంటారు. ఇవి 3 రకాలు.
1. ఇసినోఫిల్
2. బేసోఫిల్స్
3. న్యూట్రోఫిల్స్
ఆమ్లవర్ణకాలను సంతరించుకునేవి తెల్లరక్త కణాలు.
ఇసినోఫిల్
ఆమ్లవర్ణకాలను సంతరించుకునే తెల్లరక్తకణాలు.
ఇవి ఎలర్జీకి ప్రతి చర్యలు చూపుతాయి.
విషపదార్థాలను విషరహితం చేస్తాయి. ఇది 2 తమ్మెల కేంద్రకాన్ని కలిగి ఉంటాయి.
బేసోఫిల్స్
కేంద్రకం ‘ S’ ఆకృతిలో ఉండి మూడు తమ్మెలు ఉంటాయి.
క్షార వర్ణకాలను సంతరించుకునేవి తెల్లరక్త కణాలు. ఇవి గాయాలు మానడానికి తోడ్పడతాయి.
ఇవి తక్కువ సంఖ్యలో గల తెల్లరక్త కణాలు.
న్యూట్రోఫిల్స్
ఇది తటస్థ వర్ణకాలను సంతరించుకొంటాయి.
5 లేదా 6 తమ్మెల కేంద్రకం ఉంటుంది.
ఇది మొదటి వరుస రక్షక భటులు. వీటినే ‘సూక్ష్మ రక్షక భటులు’ అంటారు.
ఎగ్రాన్యులోసైట్స్
జీవ పదార్థంలో ఎలాంటి రేణువులు ఉండవు. ఇవి 2 రకాలు. మోనోసైట్లు, లింఫోసైట్లు.
మోనోసైట్లు
ఇవి పెద్దవిగా గల తెల్లరక్తకణాలు. కేంద్రకం మూత్రపిండ ఆకారంలో ఉంటుంది.
ఇవి రక్తంలో మృత కణాలను తొలగిస్తాయి.
ఇవి రక్తంలో ‘పారిశుధ్య కార్మికులు’ (Scavengers of the blood).
లింఫోసైట్లు
ఇవి చిన్నగా గల తెల్లరక్త కణాలు. ఇవి బ్యాక్టీరియా, వైరస్, ఫంజి వంటి సూక్ష్మజీవులకు ప్రతిచర్యను చూపుతాయి. ఇవి ఎయిడ్స్ వ్యాధిలో నశించిపోయే తెల్లరక్తకణాలు. ఇవి ప్రతిదేహాలను (Antibodies) ఉత్పత్తి చేస్తాయి.
రక్తఫలకికలు (త్రాంబోసైట్లు): ఇది ద్వికుంభాకారంగా ఉంటాయి.
కేంద్రకం ఉండదు. వీటినే త్రాంబోసైట్లు అంటారు. ప్లేట్‌లెట్స్ అంటారు.
రక్తఫలకికలు తెలుపు రంగులో ఉంటాయి. 3-10 రోజులు జీవిస్తాయి.
ఇవి రక్తం గడ్డకట్టించడానికి ఉపయోగపడతాయి.
రక్తం గడ్డకట్టేటప్పుడు అవి ‘త్రాంబోకైనేజ్’ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తే ఇది ప్రోత్రాంబిన్ త్రాంబిన్‌గా మారుస్తుంది.