Type Here to Get Search Results !

Vinays Info

జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం | National Women Teachers Day

జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం | National Women Teachers Day 

జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం | National Women Teachers Day

జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం - జనవరి 3

  • సావిత్రి బాయి ఫూలే పుట్టిన రోజైన జనవరి 03 ను  జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 
  • ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. ఫూలే దంపతులు వీరి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు.

గణాంకాలు:

  • 2019 లో ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం, దేశంలో బోధన సిబ్బంది సంఖ్య మొత్తం 14 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉండగా అందులో మగవారు 57.8 శాతం, మహిళలు 42.2 శాతం ఉన్నారు. 
  • ఉపాధ్యాయుల లింగ నిష్పత్తి అత్యల్పంగా బీహార్‌లో నమోదైనట్లు పేర్కొంది. కొన్ని రాష్ట్రాల్లో (కేరళ, పంజాబ్, హర్యానా, చంఢీగర్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా) మగ ఉపాధ్యాయుల కంటే ఎక్కువగా మహిళా ఉపాధ్యాయులు ఉన్నారని  సర్వే నివేదిక వెల్లడించింది.


సావిత్రి బాయి ఫూలే గురించి

  • పేరు: సావిత్రి బాయి ఫూలే (Savitribai Phule)
  • జననం: 1831 జనవరి 03
  • జన్మస్థలం: మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాలా తాలూకా నయాగావ్‌ గ్రామం. ఇది పూణే నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • తల్లిదండ్రులు: లక్ష్మి మరియు ఖండోజీ నెవేషే పాటిల్
  • పెళ్ళి: ఆమె తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840 లో వివాహమాడింది.
  • పిల్లలు: స్వంత పిల్లలు లేరు. కానీ 1974 లో యశ్వంతరావును దత్తత తీసుకున్నారు. ఇతను ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడు.
  • చదువు: నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. జ్యోతీరావు ఫూలె ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొందింది.
  • 1848: పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతికదాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేది. 
  • 1849: జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు.
  • 1852: మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. 
  • 1854: ఆమె తన కవితా సంపుటి కావ్యఫూలే ను ప్రచురించింది.
  • 1860: వితతంతువులకు శిరోముండనం చేయవద్దని క్షురకులను చైతన్య పరిచి వారితో ఉద్యమం చేయించి విజయం సాధించారు.
  • 1868: అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.
  • 1873: తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాల నిర్మూలన, సతీసహగమనం రూపుమాపడం, వితతంతు పునర్వివాహం కోసం శ్రమించారు.
  • 1873: డిసెంబర్‌ 25 న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో వివాహం జరిపించారు. 
  • 1890: నవంబర్‌ 28 న భర్త మరణించడంతో తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది.
  • 1891: పావన కాశీసుబోధ్‌ రత్నాకర్‌ అనే మరో కావ్యాన్ని రాశారు.
  • 1897: మార్చి 10 న ప్లేగు వ్యాధితో మరణించారు.
  • 1998: భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది.
  • 2014: ఆగస్ట్ 09 వ తేదీన పూనే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు. (Savitribai Phule Pune University)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section