History of National Good Governance Day in India | జాతీయ సుపరిపాలనా దినోత్సవం - డిసెంబర్ 25
ఉద్దేశ్యం:
ప్రభుత్వంలో జవాబుదారీతనం గురించి భారత ప్రజలలో అవగాహన పెంపొందించడం, అలాగే మాజి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee) ని స్మరించుకుని, గౌరవించటం సుపరిపాలనా దినోత్సవం (Good Governance Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఎప్పటి నుంచి?
2014 లో మోడీ ప్రభుత్వం డిసెంబర్ 25 ను జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా ప్రకటించింది.
డిసెంబర్ 25నే ఎందుకు?
మాజి ప్రధాని వాజ్‌పేయి పుట్టిన రోజైన డిసెంబర్ 25ను (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటారు.
వ్యతిరేకత - విమర్శ:
డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగ జరుపుకునే రోజు కావడంతో ఆ రోజును సుపరిపాలనా దినంగా నిర్వహించడం విమర్శలు రేకెత్తించింది. కాంగ్రెస్, వామపక్షాలు మొదలుకొని చాలా రాజకీయ పక్షాలు ఈ ప్రయత్నాన్ని నిరసించాయి.
క్రిస్మస్ సెలవును రద్దుచేసి ఆరోజున సుపరిపాలనా దినంగా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై పార్లమెంటులో దుమారం చెలరేగింది. చివరకు పార్లమెంటులో ఈ విషయంపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం క్రిస్మస్ సెలవు రద్దు చేస్తూ ఏ ఆదేశమూ వెలువడలేదని స్పష్టం చేశారు.
మౌలిక లక్షణాలు:
సుపరిపాలనకు 8 అంశాలను మౌలిక లక్షణాలుగా యునైటెడ్ నేషన్స్ (United Nations) పేర్కొంది.
(1) Consensus Oriented: ప్రతి విషయంలోనూ అభిప్రాయం సేకరించి అంతిమ నిర్ణయానికి రావడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం.
(2) Participation: సమాజంలోని ప్రతి ఒక్క రినీ భాగస్వాములను చేయడం.
(3) Rule of Law: ఆయా దేశాలలో అమలులో ఉన్నటువంటి న్యాయ నిబంధనలను పాటించడం.
(4) Effectiveness and Efficiency: పటిష్టంగా పనిచేయడం, ప్రతిభావంతంగా ఫలితాలు సాధించడం.
(5) Accountability: జవాబుదారీతనం.
(6) Transparency: ప్రతిదీ పారదర్శకంగా ఉండడం.
(7) Responsiveness: బాధ్యతాయుతంగా ఉండడం.
(8) Equity and Inclusiveness: అందరికీ సమాన ఫలితాలు అందాలి, అందు కోసం అందరిని కలుపుకోగలిగి ఉండాలి.