Type Here to Get Search Results !

Vinays Info

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు 2018

 తెలుగు సాహిత్యంలో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018వ ఏడాదికి సాహితీ పురస్కారాలను 2021, అక్టోబర్ 21న ప్రకటించింది. ఈ అవార్డుల్లో ‘కొంగవాలు కత్తి’ ఉత్తమ నవలా పురస్కారం దక్కింది. గడ్డం మోహన్‌రావు రాసిన కొంగవాలు కత్తికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార్-2019 లభించిన విషయం విదితమే. అక్టోబర్‌  29న తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరగనుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రకటించిన అవార్డుల వివరాలు ఇలా...


  • పద్య కవితా ప్రక్రియలో మొవ్వ వృషాద్రిపతి రచన (శ్రీ కృష్ణదేవరాయ విజయ ప్రబంధము)
  • వచన కవితా ప్రక్రియలో కాంచనపల్లి గోవర్ధన్‌ రాజు (కల ఇంకా మిగిలే ఉంది)
  • బాల సాహిత్యంలో సామలేటి లింగమూర్తి (పాటల పల్లకి)
  • కథానికా ప్రక్రియలో రావుల పాటి సీతారాంరావు (ఖాకీకలం)
  • నవలా ప్రక్రియలో డాక్టర్‌ గడ్డం మోహన్‌ రావు (కొంగవాలు కత్తి)
  • సాహిత్య విమర్శలో డాక్టర్‌ కిన్నెర శ్రీదేవి (సీమకథ అస్తిత్వం)
  • నాటకం/నాటికల్లో ఎన్‌.ఎస్‌.నారాయణబాబు (అశ్శరభ శరభ)
  • అనువాదంలో కె.సజయ (అ శుద్ధ భారత్‌)
  • వచన రచనల విభాగంలో లక్ష్మణరావు పతంగే (హైదరాబాద్‌ నుండి తెలంగాణ దాక)
  • రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగం లో సమ్మెట ఉమాదేవి (రేలపూలు)

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section