Type Here to Get Search Results !

Vinays Info

ఇది ఆట అయినప్పుడు యుధ్ధం ఎలా అవుతుంది..!ఆటే అవుతుంది..!

 ఈరోజు పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అంట..పేపర్లో మహా సంగ్రామం..మహా యుధ్ధం అని రాసారు..

ఇది ఆట అయినప్పుడు యుధ్ధం ఎలా అవుతుంది..!ఆటే అవుతుంది..!

నిజానికి ఇండియా వారు క్రికెట్ ఆడేది BCCI అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున..పాకిస్తాన్ వారు ఆడేది PCB అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరపున..మరి వీరు తమ దేశం తరపున ఎలా ఆడుతున్నట్లు..!అసలు దేశాలకు సంబంధం ఉండదు.

ఇక క్రికెట్ ఆట చూసే ప్రేక్షకులు జాతీయ జండాలు ఊపినంత కాలం ఇండియా ,పాకిస్తాన్ ల మధ్య ఉద్వేగాలు ఇలానే ఉంటాయి.నిజానికి వారి ఆటతో ఏ దేశానికీ వచ్చే కీర్తి పతాకాలేమీ ఉండవు.పోయే గౌరవమూ ఏమీ ఉండదు.

నిజానికి ఆ ఆట ఆడేవారిలో ఒక్కరికి కూడా దేశభక్తి ఉండదు.. కేవలం తమ ఆటలో పాకిస్తాన్ వాడు ఇండియా వాడిని..ఇండియా వాడిని పాకిస్తాన్ వాడు దూషించడం లేదా వార్నింగ్ ఇవ్వడం లేదా ఫోర్ కొట్టినప్పుడు, సిక్స్ కొట్టినప్పుడు, ఔట్ చేసినప్పుడు వెకిలి చెయ్యడం ద్వారా మాత్రమే ఫేమస్ అవుతారు. దీని కోసమే వారు తపిస్తుంటారు.

అయితే ప్రపంచంలో అంటే క్రికెట్ ఆడే 12దేశాల్లో అత్యధిక ఆదాయం BCCI కే ఉంటుంది కాబట్టి న్యాయం ఎక్కువ సార్లు మన వైపే ఉంటుంది.ఎలా అంటే హర్భజన్ సింగ్ #మంకీ అని వెకిలి గా అని #మాకీ అన్నా అని కవర్ చేసినా..సచిన్ టెండూల్కర్ బాల్ లో దారాల మధ్యలో ఇరికిన మట్టిని గోల్లతో పెకిలించి టాంపర్ చేసినా న్యాయం మనవైపే ఉండడానికి కారణం BCCI తన సంపన్నత ద్వారా నిర్ణయాధికారం కలిగి ఉండడమే. అలానే ఇండియా ఆటగాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా చాలా చిన్నతప్పులుగా పరిగణించడం.. చిన్న చిన్న ఫైన్స్ తో సరిపుచ్చడం వెనక ఉన్న #న్యాయం ఏంటో కూడా మనం గమనించవచ్చు.

ఎప్పుడైతే ఇండియన్ క్రికెట్ టీం ర్యాంకింగ్స్ లో దిగజారుతుందో.. ఇండియాలో క్రికెట్ చూసే వారి సంఖ్య తగ్గుతుందో వెంటనే ఇండియా అనూహ్యంగా #పుంజుకుని సంచలనాలతో సిరీస్ లు గెలుచుకుంటుంది.ఈ గెలుపు వెనక bcci కృషి అమోఘం.అసలు బ్యాటే పట్టుకోరాని జవగళ్ శ్రీనాధ్ పించ్ హిట్టర్ అయ్యి సెంచరీలు నమోదు చేయడం.. 11వ ఆటగాడైన వెంకటేష్ ప్రసాద్ సెంచరీలు చేయడం టైటాన్ కప్ లాంటి కప్పు లు గెలవడం వెనక ఏదో ఒక సౌత్ ఆఫ్రికా లాంటి టీం సపోర్ట్ ఉండనే ఉంటుంది.అలానే ఇంగ్లాడ్ వారి ఏలుబడిలో ఉన్న దేశాలకు మాత్రమే వరల్డ్ కప్ వస్తుంది. ఇంగ్లాండ్ కి రాదు.ఎందుకంటే వారు గెలవడం వలన వారి ఏలుబడి ఉన్న దేశాలలో క్రికెట్ మరుగున పడిపోయి ఆదాయం తగ్గిపోతుంది.కనుక వారు గెలవాల్సిన అవసరం లేదు.

అలానే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ల మధ్య కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లానే యాషెస్ సిరీస్ జరుగుతుంది. అందులో కూడా ఇంగ్లాండ్ బానిస రాజ్యమైన ఆస్ట్రేలియా దే పైచేయి ఎందుకౌతుందో ఊహించుకోవచ్చు.అలానే బంగ్లాదేశ్, UAE,కెనడా,కెన్యా లాంటి క్రికెట్ ఆడరాని అనామక దేశాలు కూడా ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ ఉన్న దేశాల మీద గెలుస్తాయి. దానిక్కారణం ఆ దేశాల్లో క్రికెట్ మీద నమ్మకం కలిగించి యాడ్స్ రూపంలో డబ్బు సంపాదించడం ,బ్యాట్స్, బాల్స్, మ్యాట్స్, స్టంప్స్ అమ్మడం ద్వారా కోట్లకు కోట్లు సంపాదించడమే వీరి లక్ష్యం.అలానే వెస్టిండీస్ లో క్రికెట్ పూర్తిగా పతనం అవుతున్న సంధర్బంలో ఆ దేశం కొన్ని సిరీస్ లను అనూహ్యంగా గెలుస్తుంది.తద్వారా క్రికెట్ ను కొనూపిరితో నైనా బతికించడమే దాని లక్ష్యం.అలానే ఒకనాడు బౌలింగ్ లో వెలుగు వెలిగిన వెస్టిండిస్ ను కట్టడి చేసి మిగతా దేశాలను ఎంకరేజ్ చేయడానికే బౌన్సర్ నిబంధన పెట్టారు.దాంట్లో సఫలీకృతమయ్యారు కూడా.

ఇప్పుడు క్రికెట్ ప్రపంచ ఆట అయిన పుట్ బాల్ తో సమానమైన ఆదాయాన్ని ఇస్తుంది.అందులో మేజర్ వాటా భారత్ దే అంటే అతిశయోక్తి కాదు..!

ఇక 1983 లో వెస్టిండీస్ మీద క్రికెట్ లో ఓనమాలు కూడా రాని ఇండియా గెలిచి వరల్డ్ కప్ గెలవడం ద్వారా ఇండియాలో క్రికెట్ వీక్షకుల సంఖ్య 30కోట్లకు చేరింది.తద్వారా ESPN,స్టార్ స్పోర్ట్స్ లు కోట్లకు పడగలెత్తాయి. అలానే క్రికెటర్లు యాడ్స్ చేయడం ద్వారా పొందే సంపద అయితే గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ , ఫుట్ బాల్ ఆటగాడు బెక్ హాంల తర్వాత స్థానం అంటే యాడ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఊహించుకోవచ్చు.ఈయాడ్స్ లో BCCI కి కూడా వాటా ఉంటుంది.

ఇక ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచుల్లో దావూద్ ఇబ్రహీం నివాసముండే షార్జాలో అయితే పాకిస్తాన్ దే పైచేయి.ఇక వరల్డ్ కప్ లో అయితే భారత్ దే పైచేయి.అంటే ఆ చేయి ఎందుకు పైకి ఉంటుందో bcci కి pcbకి ముందే తెలుసు. అవన్నీ ముందే సెట్ చేసి పెడతారు.ఎప్పుడు ఎవరు గెలవాలో అన్నీ ముందే రాయబడతాయి.ఈ రాయబడడం వెనక బెట్టింగ్ ది ప్రథమస్థానం అయితే వ్యాపారాభివృధ్ధిది రెండవస్థానం.

రెండు జట్ల మధ్య ఉద్వేగాలు ఉంటేనే మ్యాచ్ లో రసపట్టు ఉంటుంది.అందుకే ఆ ఉద్వేగాలు ఉండాలంటే స్లెడ్జింగ్, కొట్లాటలు,కొట్టుకోవడం,గుద్దుకోవడం ,వెకిలి చేష్టలు చేయాలి. ఇదంతా ఒక సినిమా..ఈ సినిమా అర్థం కాని జనం ఆ ఆటగాళ్ళేదో దేశం కోసమే ఆడుతున్నారనుకుని తమలో ఉద్వేగాలు రగుల్చుకుని తమ శత్రుదేశాలను ఇంకా ద్వేషిస్తుంటారు. నిజానికి ఆట అనేది ప్రాంతాలను, దేశాలను కలపాలి.కాని విడదీయడం ద్వారా తమ పబ్బం గడుపుకునే వ్యాపార సంస్థలున్నంత కాలం ప్రజలలో విద్వేషాలు ఉంటూనే ఉంటాయి.

BCCI లో బ్రాహ్మణుల ఆధిపత్యం ,కేంద్రప్రభుత్వం లో బ్రాహ్మణ రాజకీయ నాయకుల, బ్రాహ్మణ IAS,IPS ల ఆధిపత్యం ఉన్నంత కాలం ఇండియా పాకిస్తాన్ లు కలవవు. కలవనివ్వరు కూడా..!!ఈ విషయం జనానికి అర్థమైతే దేశంలో విప్లవం వస్తుంది..దేశ స్వరూపమే మారిపోతుంది.. కాని రాదు.

ఇక హాకీ ,ఫుట్ బాల్ లాంటి ఆటలు బ్రాహ్మణ, వైశ్యలకు ఆడరాదు.దీనికి కఠోర శారీరక శ్రమ ,బాడీ నేచర్ కూడా ఉండాలి. అవి వారికుండవు..అవి ఉండేది కేవలం శూద్రులకే.శూద్రులని ఎంకరేజ్ చేసి వారిని అందలం ఎక్కించే గొప్ప మనసు బ్రాహ్మణులకుండదు.అనుక్షణం పరుగులు పెట్టే ఆటలు బ్రాహ్మణులకు చాతకాదు కనుక ఆ ఆటలను ఎంకరేజ్ చేయరు.బ్రాహ్మణ ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలు, ఆటలు మాత్రమే ఎంకరేజ్ చేయబడతాయి.దీనికి దేశభక్తి ముసుగేసి జాతీయ జండాలూపి విద్వేషాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటారు.

ఇక IPL లో పాకిస్తాన్ ఆటగాళ్ళను తీసుకుంటే ఇప్పుడున్న ఉద్వేగాలుండవు..అంతా స్నేహ పూర్వకంగా ఉంటారు. మ్యాచ్ లో ఉన్న రంజు తగ్గిపోతుంది.పాక్ వారికి కూడా ఇండియాలో ఫ్యాన్స్ ఉంటారు.ప్రేమించే గుణం పెరిగిపోతుంది.. అందుకే వారిని తీసుకోరు.వరల్డ్ కప్ మొత్తం మీద రెండు లక్షల కోట్ల సంపద చేతులు మారితే ఒక్క పాకిస్తాన్ ,ఇండియా మ్యాచ్ లోనే అది లక్ష కోట్లుంటుందంటే ఈ ఉద్వేగాలు బెట్టింగ్ కి ఎంత అవసరమో ఊహించవచ్చు. ఏది ఏమైనా విద్వేషాలను రెచ్చగొట్టేవారు మట్టి కొట్టుకుపోవాలి. ఇండియా పాక్ మైత్రి కొనసాగాలని ఆకాంక్షిస్తూ..!

#KrishnaKorivi #VinaysInfo

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section