తృతీయ భూస్వారూపాలు-Tertiary landscapes
1. రెండు భూభాగాలని కలుపుతూ రెండు జలభాగాలను వేరు చేసే సన్నని భూభాగం?
జ. భూసంధి2. భూసంధులకు ఉదాహరణలు?
జ. పనామా, సూయజ్3. ఒక భూభాగపు చివరికొన సముద్రంలోకి చొచ్చుకొని పోయినట్లు ఉంటే దాన్ని ఏమంటారు?
జ. అగ్రం4. ఆఫ్రికా ఖండపు దక్షిణపు చివరి కొన?
జ. గుడ్‌హోప్ అగ్రం5. భారతదేశానికి దక్షిణ సరిహద్దు?
జ. కన్యాకుమారి అగ్రం6. అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో ఏ రకమైన భూస్వరూపం ఏర్పడుతుంది?
జ. ఎడారి7. సముద్రానికి ఆనుకొని ఉండే భూభాగం?
జ. తీరం8. సన్నని లోతైన భూతలాన్ని ఏమంటారు?
జ. లోయలు9. భూ అంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపైన ఉన్న రెండు సమాంతరభ్రంశాల మధ్య ఉన్న భూభాగం కిందికి జారిపోవడంతో ఏర్పడ్డ భూభాగాన్ని ఏమంటారు?
జ. పగులు లోయ10. భారతదేశంలో పగులు లోయలో ప్రవహించే నదులు?
జ. నర్మద, తపతి11. నదీ ప్రవాహం వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడ్డ లోతైన లోయను ఏమంటారు?
జ. అగాధదరి12. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అగాధ దరి
జ. అమెరికాలోని కొలరాడో13. నదీ ప్రవాహ జలం ఎత్తై ప్రాంతం నుంచి అగాధదరి కిందకు పడే ప్రదేశాన్ని ఏమంటారు?
జ. జలపాతం14. నయగారా జలపాతం ఏ ఖండంలో ఉంది?
జ. ఉత్తర అమెరికా15. నదులు సముద్రంలో కలిసే ప్రాంతం?
జ. నదీ ముఖద్వారం16. నదీ ముఖద్వారం వద్ద సముద్రాన్ని కలిసే ముందు నది రెండు లేక మూడు పాయలుగా చీలినపుడు ఆ పాయల మధ్య ఉండే ప్రాంతం?
జ. డెల్టా17. కృష్ణా, గోదావరి డెల్టాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి?
జ. ఆంధ్రప్రదేశ్18. ఖండ అంతర్భాగంలో ఉన్న నదీ జల భాగాన్ని ఏమంటారు?
జ. సరస్సు19. ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన సరస్సు?
జ. కొల్లేటి సరస్సు20. రవాణా, నీటి పారుదలకు తవ్వి కృత్రిమంగా ఏర్పాటు చేసిన జలమార్గం?
జ. కాలువ21. సూయజ్ కాలువ వేటిని కలుపుతుంది?
జ. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం22. సముద్రపు అలల ద్వారా క్రమక్షయం చెందిన అర్థచంద్రాకార భూస్వరూపాన్ని ఏమంటారు?
జ. అఖాతం23. రెండు విశాల సముద్ర ప్రాంతాలను కలుపుతూ, రెండు విశాల భూభాగాలను వేరు చేసే సన్నని సముద్ర భాగాన్ని ఏమంటారు?
జ. జలసంధి24. ఒక ప్రధాన భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన సముద్ర భాగాన్ని ఏమంటారు?
జ. సింధు శాఖ25. సముద్ర అంతర్భాగంలో భూతలంపై ఉండే పర్వత శిఖరాన్ని ఏమంటారు?
జ. రిడ్‌జ26. మన్నార్ సింధుశాఖ ఏ దేశాల మధ్య ఉంది?
జ. భారత్, శ్రీలంక27. అట్లాంటిక్ మహాసముద్రంలోని రిడ్‌జ
జ. మిడ్ ఓషనిక్ రిడ్‌జ