Potlapally Rama Rao | పొట్లపల్లి రామారావు
పొట్లపల్లి రామారావు (1917, నవంబర్ 20 - సెప్టెంబర్ 10, 2001) కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు. ఆంధ్రమహాసభను నడిపిన వ్యక్తులలో ముఖ్యులు.
జననం - బాల్యం - విద్యాభ్యాసం
వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలం, తాటికాయల గ్రామంలో భూస్వామ్య కుటుంబంలోని పొట్లపల్లి శ్రీనివాసరావు, చెల్లమ్మ దంపతులకు 1917, నవం బర్ 20న జన్మించారు. పొట్లపల్లి 7వ తరగతి వరకే చదివినప్పటికీ, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో వేలా ది పుస్తకాలు చదివారు. వట్టికోట, కాళోజీ రామేశ్వరావు, కాళోజీ నారాయణరావులకు సమకాలికుడి గా, సహచరుడిగా జీవించాడు.
రచనలు
- పొట్లపల్లి రామారావు సాహిత్యం
- చుక్కలు కవితా సంపుటి
- జైలు కథాసంపుటి. (1934-45)
- ఆచార్యుల వారి కథలు
- ఏనుగ చొప్ప
- పాదధూళి (నాటిక)
- సర్‌బారాహి (నాటిక)
- పగ (నాటిక)
- న్యాయం (నాటిక)
- ఊరు అడవి
- జైలు
- జైలు డైరీ
- న్యాయం
- న్యాయం
- మా ఊరికి ఆహ్వానం
- మామూళ్ళు
- ముత్యాల బేరం
- ముల్లా కథలు
మరణం
పొట్లపల్లి రామారావు 2001, సెప్టెంబర్ 10న మరణించాడు.