తెలంగాణలో కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన కేంద్రం - New approved new zones in Telangana state, President Nods for New Zones in Telangana State.
తెలంగాణ కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థతో స్థానికులకే 95శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం(19.04.2021) రాత్రి జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు మినహాయించి మిగిలిన అన్ని విభాగాలకూ ఈ జోన్ల విధానం వర్తిసుందని తెలిపింది.
కొత్త జోనల్ విధానాన్ని రాష్ట్రపతి ఆమోదించడంతో తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమం కావడంతో పాటు విద్యార్థులకు, ఉద్యోగులకు అనేక రకాల ప్రయోజనాలు సమకూరనున్నాయి. ప్రధానంగా విద్యా ఉద్యోగావకాశాల్లో అసమానతలను తొలగిపోయి, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమానావకాశాలు దక్కనున్నాయి. అలాగే స్థానిక రిజర్వేషన్లు కూడా పక్కాగా అమలుకానున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జోన్ల విధానం వల్ల తెలంగాణకు నష్టం జరిగిందనే భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జోనల్ విధానం రూపకల్పనపై దృష్టి సారించారు. నగరాలు, పట్టణాలు, ఇతర రకాలుగా పురోగమించిన జిల్లాలకే కాకుండా మారుమూల, ఏజెన్సీ, ఇతరత్రా వెనకబడిన జిల్లాలకు అన్ని విధాలా న్యాయం జరగాలనే సంకల్పంతో కొత్త జోనల్ విధానాన్ని ఖరారు చేశారు. తొలుత 31 జిల్లాలకు జోనల్ విధానాన్ని రూపొందించారు. దానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత 2018 శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ములుగు, నారాయణపేటలను సైతం కొత్తగా ఏర్పాటు చేశారు. మొత్తం 33 జిల్లాల పరిధిలో జోనల్ విధానానికి ఆమోదం కోరుతూ 2019లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి మోక్షం కలిగింది.
Kaleshwaram (Zone-1) | Asifabad, Mancherial, Peddapalli and Bhupalapally districts. |
Basara (Zone-2) | Adilabad, Nirmal, Nizamabad and Jagtial districts. |
Rajanna (Zone-3) | Karimnagar, Siddipet, Siricilla, Kamareddy and Medak districts. |
Bhadradri (Zone-4) | Kothagudem, Khammam, Mahabubabad, Warangal Urban and Warangal Rural districts. |
Yadadri (Zone-5) | Suryapet, Nalgonda, Yadadri Bhuvanagiri and Jangaon districts. |
Charminar (Zone-6) | Medchal-Malkajgiri, Hyderabad, Rangareddy and Sangareddy districts. |
Jogulamba (Zone-7) | Vikarabad, Mahabubnagar, Gadwal, Wanaparthy and Nagarkurnool districts. |
There are 2 Multi Zones in Telangana
Multi-zone-1 | comprises Kaleshwaram, Basara, Rajanna and Bhadradri zones. |
Multi-zone-2 | comprises Yadadri, Charminar and Jogulamba zones. |