జాతీయ పౌర సేవల దినోత్సవం(National Civil Services Day) ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది.
పౌర సేవల వ్యవస్థ దేశ పరిపాలన యంత్రాంగానికి వెన్నుముకలాంటిది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా శాశ్వత కార్యనిర్వాహక శాఖ. ప్రభత్వ రూపొందించిన విధానాలను, పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు జరిపే బాధ్యత పౌరసేవకులదే. పౌర సేవల విభాగాలు అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) లతోపాటు సెంట్రల్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బీ తదితరసర్వీసులు.
ప్రారంభం
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016, ఏప్రిల్ 21 ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది.
చరిత్ర:
బ్రిటిష్‌పాలనలో ఉన్న ఇండియన్ సివిల్ సర్వీస్ భారత స్వతంత్ర అనంతరం ఆల్ ఇండియా సివిల్ సర్వీస్‌గా మారింది. ఏప్రిల్ 21, 1947న స్వదేశీ పార్లమెంటు సభ్యుడు సర్దార్ వ్లభాయ్ పటేల్ అఖిల భారత సేవలను ప్రారంభించారు. ఢిల్లీలోని మెట్‌కాల్ఫ్ హౌస్‌లో ఉన్న ఆల్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ట్రైనింగ్ స్కూల్లో పటేల్ ప్రసంగించారు. తన ప్రసంగంలో పౌర సేవకులను స్టీల్ ఫ్రేమ్‌ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు.
జాతీయ పౌర సేవల దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ప్రజా పరిపాలన రంగంలో అసాధారణ సేవలు అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అవార్డులను ప్రదానం చేస్తారు. జాతీయ పౌర సేవల దినోత్సవం రోజున పబ్లిక్ అడ్మనిస్ట్రేషన్‌లో అత్యుత్తమ సేవలను అందించిన వారికి “ప్రధాన మంత్రి “అవార్డును ఇస్తారు.
నిర్వహించే కార్యక్రమాలు
- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రధానమంత్రి పేరిట అవార్డులను ఇవ్వడం జరుగుతుంది. 2006లో ప్రారంభించబడిన అవార్డుల ప్రకారం, వ్యక్తిగతంగా లేదా సమూహంగా లేదా సంస్థగా ఉన్న ప్రతినిధులందరు ఈ పథకానికి అర్హులు. వ్యక్తిగత బహుమతి లక్ష, సంస్థ బహుమతి ఐదు లక్షలు ఉంటుంది.
- పౌర సేవల విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలోనన్న అంశంపై పౌర సేవల ఉద్యోగులకు శిక్షణా కార్యాక్రమాలు నిర్వహించబడుతాయి.
- పౌర సేవల గురించి, పౌరుల హక్కుల గురించి గ్రామస్థాయిలో గ్రామస్తులకు, విద్యార్థులకు అవగాహన కలిపిస్తారు.