Type Here to Get Search Results !

Vinays Info

Important Alloys - Uses(ముఖ్య మిశ్రమ లోహాలు - ఉపయోగాలు)

Important Alloys - Uses(ముఖ్య మిశ్రమ లోహాలు - ఉపయోగాలు)

రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలు లేదా ఒక లోహంతోపాటు ఇతర మూలకాలసజాతీయ మిశ్రమమే మిశ్రమ లోహం. శుద్ధ లోహాలతో పోల్చినప్పుడు మిశ్రమ లోహాల ధర్మాలు కాస్త భిన్నంగా ఉంటాయి.మిశ్రమ లోహాలు -ఇతరాంశాలు

  • ఇనుము ఒక అనుఘటకంగా ఉన్న మిశ్రమ లోహాలను ఫై మిశ్రమ లోహాలు అంటారు. ఉదా: స్టెయిన్‌లెస్ స్టీలు (ఐరన్ + కార్బన్ + క్రోమియం)
  • ఐరన్ లేని మిశ్రమ లోహాలను నాన్ ఫై మిశ్రమ లోహాలు అంటారు. ఉదా: జర్మన్ సిల్వర్ (కాపర్ + జింక్ + నికెల్)
  • పాదరసం (మెర్క్యురీ) ఒక అనుఘటకంగా ఉన్న మిశ్రమ లోహాన్ని అమాల్గం అంటారు. ఉదా: సోడియం అమాల్గం (మెర్క్యురీ + సోడియం)
  • ఐరన్, ప్లాటినం లోహాలు అమాల్గంను ఏర్పరచవు.
  • దంతాల్లోని రంధ్రాలను ఫిల్లింగ్ చేయడానికి డెంటల్ అమాల్గంను ఉపయోగిస్తారు. ఇది మెర్క్యురీ, సిల్వర్, టిన్, కాపర్‌ల మిశ్రమ లోహం.
  • సాంకేతికంగా మిశ్రమ లోహాన్ని ఘనరూపంలో ఉన్న ద్రవంగా పరిగణించవచ్చు.
  • మిశ్రమ లోహాల వల్ల పదార్థగట్టిదనం పెరుగుతుంది.
  • వీటి సాగే గుణం తక్కువగా ఉంటుంది.
  • ద్రవీభవన స్థానం తక్కువ.
  • తుప్పు పట్టే గుణం తగ్గుతుంది.
  • విద్యుత్ వాహకత తగ్గుతుంది.
  • లోహ కాంతిని, రంగును మెరుగుపర్చవచ్చు.
  • చర్యాశీలత మార్చవచ్చు.
  • ఆమ్లాలను, క్షారాలను తట్టుకునే గుణం పెరుగుతుంది.
  • బంగారు ఆభరణాల స్వచ్ఛతను క్యారెట్ ప్రమాణాల్లో కొలుస్తారు.
  • 24 క్యారెట్ల బంగారంలో 100 శాతం బంగారం ఉంటుంది. x క్యారెట్ల బంగారంలో (x×100)/24 శాతం బంగారం ఉంటుంది. ఒక క్యారెట్ 100/24 శాతం బంగారానికి సమానం. 18 క్యారెట్ల బంగారు ఆభరణాల్లో (18×100)/24 = 75 శాతం బంగారం, మిగతా 25 శాతం రాగి ఉంటుంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటాయి. మిగతా 8.4 శాతం రాగి ఉంటుంది.

తుప్పు పట్టడం: లోహం తుప్పు పట్టడమనేది ఆక్సీకరణ ప్రక్రియ. ఉదా: ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆక్సీకరణం చెంది ఐరన్ ఆక్సైడ్ (ఫెర్రిక్ ఆక్సైడ్) ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో దాని బరువు పెరుగుతుంది. సాధారణంగా గాలిలో తేమ ఎక్కువగా ఉండే తీరప్రాంతాల్లో తుప్పుపట్టడం వేగంగా జరుగుతుంది.
గాల్వనైజేషన్: ఇనుము లాంటి లోహాలు తుప్పు పట్టకుండా వాటిపై జింక్ లాంటి లోహాలతో పూత పూయడాన్నే గాల్వనైజేషన్ అంటారు. గాల్వనైజేషన్ చేయడం వల్ల ఇనుము క్షయం కాకుండా నివారించవచ్చు. గాల్వనైజేషన్ చేయడానికి ఎక్కువ చర్యాశీలత ఉన్న లోహాన్ని తీసుకుంటారు. ఉదా: జింక్ క్రియాశీలత ఎక్కువ కాబట్టి దీంతో ఇనుముపై పూత పూయడం వల్ల ఇది క్షయం చెంది ఐరన్‌ను పరిరక్షిస్తుంది.
  • ఎలక్ట్రోప్లేటింగ్‌లో కావాల్సిన లోహపు పూతను విద్యుద్విశ్లేషణ పద్ధతిలో వేస్తారు. ఏ లోహంపై పూత పూయాలో దాన్ని కాథోడ్(రుణధ్రువం)గా, పూతపూయాల్సిన లోహమున్న లవణ ద్రావణాన్ని విద్యుద్విశ్లేష్యం(ఎలక్ట్రోలైట్)గా తీసుకుంటారు. ఉదా: కారు విడిభాగాలు, కుళాయిలు, గ్యాస్ బర్నర్‌లపై క్రోమియం ప్లేటింగ్ చేస్తారు. దీనివల్ల తుప్పు పట్టవు. మన్నిక పెరుగుతుంది. నకిలీ నగల తయారీలో కూడా ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
  • మెర్క్యురీ తప్ప మిగతా లోహాలన్నీ ఘన పదార్థాలే. పాదరసం(మెర్క్యురీ) మాత్రం ద్రవం. గాలియం అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగే లోహం.
  • లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీసియం లాంటి క్షారలోహాలు మెత్తని లోహాలు. ఇవి కత్తితో కోయగలిగేంత మృదువైనవి.
  • లోహాలు మంచి విద్యుత్ వాహకాలు. స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు విద్యుత్‌ను మోసుకెళ్తాయి(ఎలక్ట్రాన్ కండక్టర్). లోహాలన్నింటిలో సిల్వర్ మంచి విద్యుత్ వాహకం. గృహావసరాల కోసం రాగి వైర్లను వాడితే, విద్యుత్ పంపిణీ సంస్థలు అల్యూమినియం వైర్లను ఉపయోగిస్తాయి.
  • అనాది నుంచి నాణేల తయారీలో ఉపయోగించిన బంగారం, సిల్వర్, కాపర్ లోహాలను కాయినేజ్ మెటల్స్ అంటారు.
  • బంగారానికి రేకులుగా సాగే గుణం ఎక్కువ. దీనిపై గీతలు పడవు. ఆభరణాలను తయారుచేసేటప్పుడు గట్టిదనం కోసం బంగారానికి రాగిని కలుపుతారు.
  • అత్యంత తేలికైన లోహం లిథియం. అత్యంత మృదువైన లోహం సీసియం.
  • అత్యంత కఠిన లోహం టంగ్‌స్టన్.
  • మానవుడు విరివిగా వాడే లోహం ఇనుము. మన రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్ (ఫై) అయాన్లు ఉంటాయి.
  • మొక్కల్లోని పత్రహరితంలో మెగ్నీషియం, విటమిన్ బి12 (సయనోకోబాలమిన్)లో కోబాల్ట్ లోహాల అయాన్లు ఉంటాయి.
  • భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం. దీనికి బాక్సైట్ గనులు ఆధారం. సిల్వర్ పెయింట్‌లో సిల్వర్ ఉండదు. అల్యూమినియం ఉంటుంది. గోల్డ్ పెయింట్‌లో కాపర్ ఉంటుంది.
  • కండరాల సంకోచానికి సోడియం అయాన్లు అవసరం.
  • ట్రాన్సిస్టర్ల తయారీలో ప్రధానమైంది జెర్మేనియం.
  • సహజ సిద్ధంగా లభించే భారాత్మక లోహం యురేనియం.
  • ఉప్పునీటి కాఠిన్యానికి కారణమైన ప్రధాన లోహ అయాన్లు కాల్షియం, మెగ్నీషియం.
  • తేలికగా ఉండి, గట్టిదనం కోసం విమాన విడిభాగాల తయారీలో మెగ్నీషియంను ఉపయోగిస్తారు.
  • బంగారాన్ని లోహాల రాజుగా పిలుస్తారు.
  • మన శరీరంలో ఎక్కువగా ఉండే లోహం కాల్షియం.
  • ద్విస్వభావం(ఆంఫోటరిక్) ఉన్న అర్ధలోహాలు ఆర్శెనిక్, జెర్మేనియం, ఆంటిమొని, జింక్.
  • లిథియం, సోడియం లాంటి లోహాలు గాలిలోనూ అత్యంత చర్యాశీలత చూపుతాయి. అందుకే వీటిని కిరోసిన్ లేదా పారాఫిన్ నూనెలో నిల్వచేస్తారు.
  • సోడియం అయాన్లు రక్తపోటును పెంచుతాయి. పొటాషియం అయాన్లు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి.
  • బాణసంచా తయారీలో విరివిగా వాడే లోహాలు మెగ్నీషియం(మిరుమిట్లు గొలిపే తెలుపు), స్ట్రాన్షియం(సింధూర ఎరుపు).
  • ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే నికెల్-సిల్వర్‌లో కాపర్, నికెల్, జింక్ ఉంటాయి. సిల్వర్ ఉండదు.

ముఖ్య మిశ్రమ లోహాలు - ఉపయోగాలు

మిశ్రమ లోహం

సంఘటనం

అనువర్తనాలు

ఇత్తడి (బ్రాస్)

కాపర్ + టిన్

పాత్రలు, యంత్రభాగాలు, బుల్లెట్లు

కంచు (బ్రాంజ్)

కాపర్ + టిన్

విగ్రహాలు, పాత్రలు

బెల్ మెటల్

కాపర్ + టిన్ (తగరం)

గంటల తయారీ

మాగ్నాలియం

మెగ్నీషియం + అల్యూమినియం

విమాన, మోటార్ వాహన భాగాలు

గన్‌మెటల్

కాపర్ + టిన్ + జింక్

గేర్లు, బేరింగ్‌లు, తుపాకీ పరిశ్రమ

జర్మన్ సిల్వర్

కాపర్ + జింక్ + నికెల్

పాత్రలు, నగలు, నిరోధక చుట్టలు

స్టెయిన్‌లెస్ స్టీల్

ఐరన్ + కార్బన్ + క్రోమియం + నికెల్

పాత్రలు, బ్లేడ్లు, బాల్ బేరింగ్‌లు, సర్జికల్ పరికరాలు

మాంగనీస్ స్టీల్

ఐరన్ + కార్బన్ + మాంగనీస్

హెల్మెట్లు, రైల్వేట్రాక్, రోడ్ రోలర్లు, రాళ్లను పగులగొట్టే యంత్రాలు

టంగ్‌స్టన్ స్టీల్

ఐరన్ + కార్బన్ + టంగ్‌స్టన్ + కోబాల్ట్ + క్రోమియం

శాశ్వత అయస్కాంతాలు

క్రోమ్ స్టీల్

ఎక్కువ క్రోమియం ఉన్న స్టీల్

వంటపాత్రలు

నిక్రోమ్

ఐరన్ + క్రోమియం + నికెల్

ఫ్యూజులు, నిరోధక తీగెలు, ఇస్త్రీపెట్టెలోని ఫిలమెంట్

డ్యూరాల్యుమిన్

మెగ్నీషియం + అల్యూమినియం

విమాన భాగాలు

అల్యూమినియం

కాపర్ + అల్యూమినియం+టిన్

ఆభరణాలు, నాణేలు

బ్రాంజ్ సోల్డర్

టిన్ + లెడ్

సోల్డరింగ్

డౌమెటల్

మెగ్నీషియం + అల్యూమినియం + జింక్

కార్లు, జలాంతర్గాములు, విమానాల తయారీలో

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section