World Tuberculosis Day-ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24 న నిర్వహించబడుతుంది. భయంకరమైన అంటువ్యాధైన టీబీ(క్షయ) దేశంలో ప్రతి సెకనుకు ఒక్కరికి సోకుతున్నదని, ప్రతిరోజు దేశవ్యాప్తంగా 1000మంది క్షయ వ్యాధితో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962ను క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైన చర్యలను తీసుకోవడం ప్రారంభించింది.
ప్రారంభం
1882, మార్చి 24న డా. రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను (మైకోబ్యాక్టీరియమ్ టూబరిక్లోసిస్) మొదటిసారిగా కనుగొన్నాడు. 1982లో అంతర్జాతీయ క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల వ్యతిరేక యూనియన్, రాబర్ట్ కోచ్ క్షయ వ్యాధికారక సూక్ష్మక్రిములను కనుగొని 100 సంవత్సరాలైన సందర్భంగా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించింది.
కార్యక్రమాలు
- క్షయవ్యాధిపై విస్తృత అవగాహన కలిగిచడం, ర్యాలీలు నిర్వహించడం
- క్షయవ్యాధి లక్షణాలు, దాని తీవ్రత తగ్గించేందుకు మందులు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేసే శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేయడం