Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణ విద్యార్థి సంఘాలు - Telangana Student Associations

తెలంగాణ విద్యార్థి సంఘాలు - Telangana Student Associations

తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ 

  • ఇది 1998 అక్టోబర్ 14న స్థాపించబడింది 
  • ఇది తెలంగాణ జనసభ అనుబంధ సంస్థ

తెలంగాణ విద్యార్థి సంఘం 

  • 2006 ఆగస్టు 8న స్థాపించబడింది 
  • ఇది 2006 ఆగస్టులో 10 వేల మంది విద్యార్థులతో భారీ బహిరంగ సభ నిర్వహించింది 
  • దీనికి ముఖ్య అతిధులుగా జార్జ్ ఫెర్నాండేజ్, గద్దర్, రసమయి, సింహాద్రి వంటి నాయకులు హాజరయ్యారు 
  • 2007లో గద్దర్ నాయకత్వంలో జరిగిన మహా సాంస్కృతిక శాంతియాత్ర లో ఈ సంఘం ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి వరకు యాత్ర నిర్వహించింది

తెలంగాణ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ 

  • 2006 సెప్టెంబర్ లో ప్రొఫెసర్ కోదండరాం సూచన మేరకు పి శంకర్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో స్థాపించారు 
  • ఇది 2007 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్స్ కాలేజీ నుంచి భారీ బహిరంగ సభ నిర్వహించింది

తెలంగాణ విద్యార్థి వేదిక 

  • 2006 అక్టోబర్ 27న ఆవిర్భవించింది. దీనికి అధ్యక్షుడుగా ఉన్న జంజర్ల రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా శివకుమార్ నియమించబడ్డారు 
  • ఇది 2006 నవంబర్ 1న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ విద్రోహదినం నిర్వహించింది 
  • ఫిబ్రవరి 28, 2008న ఐక్య కార్యాచరణ కమిటీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నాలో ఇది పాల్గొన్నది

తెలంగాణ ఐక్య విద్యార్థి సంఘం 

  • ఇది 2008 జనవరిలో వీరగోని చైతన్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పడింది 
  • ఫిబ్రవరి 2, 2008 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం లోని ఠాకూర్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్రం వెంటనే ప్రకటించాలని ఒక సదస్సు నిర్వహించింది

ఇతర అంశాలు 

చర్చా  పత్రిక 

  • దీనిని పిట్టల రవీందర్ 2001లో గోదావరి ఖని నుండి ప్రారంభించారు 
  • ఇది ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం నుండి నాలుగు సంవత్సరాలపాటు దినపత్రిక ప్రచురించబడింది

తెలంగాణ టైమ్స్ 

  • దీనిని 2006 జనవరి నుంచి ప్రచురించడం జరిగింది 
  • దీనికి వర్కింగ్ఎడిటర్ గా నాగోబా, గౌరవ సంపాదకులుగామల్లేపల్లి లక్ష్మయ్య పనిచేశారు
  • ఇది మూడు ప్రత్యేక సంచికలను ప్రచురించింది 

అవి 2006 లో 

  1. మహిళల ప్రత్యేక సంచిక 
  2. 2006 జూన్ లో '1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సంచిక'  
  3. 2007 అక్టోబర్ నవంబర్ లో 'పాలమూరు ప్రత్యేక సంచిక'

సహచర బుక్ హౌస్ 

  • దీనిని 1995లో పి.శంకర్ బాగ్ లింగంపల్లిలో స్థాపించారు 
  • ఇది తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు, సీడీలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర, సాహిత్యాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషించింది

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section