1.జీవులకు పేర్లు పెట్టే పద్థతిని ఏమంటారు? ద్వినామీకరణము
2.ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? లిన్నేయస్
3.లిన్నేయస్ రచించిన జంతుశాస్త్ర గ్రంధమేది? సిస్టమా నేచురే
4.లిన్నేయస్ రచించిన వృక్షశాస్త్రగ్రంధమేది? స్పీషిస్ ప్లాంటారమ్
5.కార్టేడా అంటే ఏమిటి? నోటో కార్డ్‌గల జంతువు
6.ఏకకణ జీవులు ఏ ఫైలం క్రిందకు వస్తాయి? ప్రోటోజోవా
7.శరీరం అంతటా కండరాలు ఉండే స్పాంజీలు ఏ ఫైలం క్రిందకు వస్తాయి? పొరిఫెరా
8.శరీర కుహరం ఉండే హైడ్రా ఏ ఫైలం క్రిందకు వస్తాయి? సీలెంటిరేటా
9.వానపాము ఏ ఫైలం క్రిందకు వస్తాయి? అనిలెడా
10.అతినిద్రా జబ్బును వ్యాపింపచేసే జీవి? సిట్సి- సిట్సి ఈగ
11.అతినిద్రా జబ్బు ఏఖండంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆఫ్రికా ఖండం
12.కాలా అజార్ వ్యాధికి కారణమైన ఏకకణ జీవి? లీష్మానియా డోనోవాని
13.మలేరియా వ్యాధికి కారణమైన జీవి? ప్లాస్మోడియం
14.మలేరియాను వ్యాప్తి చేసే దోమ? ఎనాఫిలిస్ దోమ
15.ప్లాస్మోడియం అనే ఏకకణజీవి వలన మలేరియ వస్తుందని కనిపెట్టిన శాస్త్రవేత్త? సర్ రోనాల్డ్ రాస్
16.దోమ గుడ్లను తిని దోమలను నిర్మూలించడానికి ఉపయోగించే చేపలు? గాంబూసియా
17.స్పాంజీల శరీరం మీదనున్న రంధ్రాలను ఏమంటారు? ఆస్టియంలు
18.సముద్రపు పువ్వు మరియు సాదుపీతలు జరిపే సహజీవనాన్ని ఏమంటారు ? కమెన్సిలిజం
19.పగడాల రసాయనిక సంఘటనం ఏమిటి? కాల్షియం కార్బోనేట్
20.మానవునిలో జీవించే బద్దె పురుగు శాస్త్రీయ నామం? టీనియా సోలియం
21.లివర్‌ప్లూక్ ఏయే జంతువులలో తన జీవితచక్రాన్ని పూర్తిచేస్తుంది. ? నత్త మరియు గొర్రె
22.మానవునిలో బోదకాలుకు కారణమైన ఫైలేరియా పరాన్నజీవుల జాతి? నిమాటి హెల్మింథస్
23.వ్యవసాయదారుల మిత్రుడని పేరుపొందిన జీవి? వానపాము
24.తేనేటీగలు, లక్కపురుగులు ఏజాతికి చెందినవి? ఆర్థ్రోపొడా
25.జంతువులలో అతిపెద్గ వర్గం ఏది? ఆర్ధ్రోపొడా
26.నత్తలు, ముత్యపు చిప్పలు, ఆల్చిప్పలు ఏజాతికి చెందినవి? మొలస్కా
27.శంఖువులు, నత్త గుల్లలు , ముత్యపు చిప్పలలో ఉండే రసాయన పదార్థం ఏమిటి? కాల్షియం కార్బోనేట్
28.తిరోగమన రూపవిక్రియను ప్రదర్శించే జంతువు? అసిడియా
29.అస్థిపంజరం శరీరం బయట ఉండే జంతువులేవి? మొలస్కా జాతి జంతువులు
30.ఉభయ చర జీవులలో విస్తారంగా వ్యాపించిన జంతువు? కప్ప
31.సరీసృపాలలో ఉండే రక్తం? శీతల రక్తం
32. పక్షుల గుండెలో ఎన్ని గదులుంటాయి? నాలుగు
33.బండ్లులాగటానికి ఉపయోగించే పక్షి? నిప్పుకోడి
34.కివి పక్షులు ఎక్కడ నివశిస్తాయి ? న్యూజిలాండ్
35.జలచరంగా మారిన పక్షి ఏది? పెంగ్విన్
36.పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువులను ఏమంటారు? క్షీరదాలు
37.మగ జంతువులుకూడా పాలివ్వగల క్షీరద జాతి? ఎకిడ్నా
38.సరీసృపాల లక్షణాలు గల క్షీరద జాతి? ప్రోటోధీరియా
39.ఏనుగు శాస్త్రీయ నామం? ఎలిఫాస్ ఇండికస్
40.తిమింగలాల్లో ఉండే కొవ్వు పొరను ఏమంటారు? బ్లబ్బర్
41.గబ్బిలం కాళ్లను, చేతులను కప్పుచూ ఉండే పలుచని పొరను ఏమంటారు. పెటాజియం
42.ధ్వని, ప్రతిధ్వనులను బట్టి దారితెలుసుకొని ప్రయాణించే జీవులు. ? గబ్బిలం
42.డైనోసార్ అనే ప్రాచీనకాల జంతువు ఏ జాతికి చెందినది? సరీసృపాలు
43.క్షీరదాలలో పెరుగుతున్న పిండాన్ని, మావితో కలిపేది ఏది? బొడ్డుతాడు
44.పట్టు పురుగుల ఆహారం ఏమిటి? మల్బరీ ఆకులు
45.అత్యున్నత సంఘజీవులు? చీమలు
46.తేనేటీగల పెంపెకాన్ని ఏమంటారు? ఎపికల్చర్
47. చేపల పెంపకాన్ని ఏమంటారు? పిసికల్చర్
48. అడవులపెంపకాన్ని ఏమంటారు? సిల్వికల్చర్
49.ద్రాక్షతోటల పెంపకాన్ని ఏమంటారు? విటికల్చర్
50.అకశేరుకాలంటే. ? వెన్నుముకలేని జంతువులు
51.బొద్దింకల్లో శ్వాసక్రియ వేటిద్వారా జరుగుతుంది?వాయునాళాలలె
52.అమీబా, యూగ్లీనాలలో శ్వాసక్రియ ఎలా జరుగుతుంది? వ్యాపన పద్థతి
53.రొయ్యలలో ఉండే మొప్పలు? ఫిల్లోబ్రాంక్
54.కప్పల్లో ఊపరితిత్తులు ఏపొరతో కప్పబడి ఉంటాయి? ఆంత్రవేష్టనం
55.వానపాము, జలగల్లో విసర్జక అవయవాలు ఏవి? వృక్కములు
56.హరిత గ్రంధి, జంబికా గ్రంధి, కోక్సల్ గ్రంథుల పని ఏమిటి? విసర్జన క్రియ
57. సకశేరుకాలలో విసర్జన క్రియ వేటిద్వారా జరుగుతుంది? మూత్రపిండాలు
58. తిమింగాలలో పూర్వ చర్మాంగాలు వేటిగా మారినవి? తెడ్లు
59.రోమాలు లేని క్షీరదం ఏది? తిమింగలం
60.కోరల్ రీఫ్స్ అంటే ? పగడపు తిన్నెలు
61.ఫిలిస్ డొమస్టికా దేని శాస్త్రీయ నామం? పిల్లి
62. న్యూజిలాండ్ లో మాత్రమే ఉండే సరీసృపం ఏది? స్పీనోడాన్
63.వేగంగా ఎగిరే పక్షి ఏది? స్విఫ్ట్
64.అత్యంత చిన్ని పక్షి? హమ్మింగ్ పక్షి
65. కెలోటిస్ వెర్సికోలాస్ దేని శాస్త్రీయ నామం? తొండ
66. సిల్వర్ ఫిష్ ఎక్కడ జీవిస్తుంది? పుస్తకాలలో
67.మానవ శరీరంలో అత్యంత పొడవైన కదలని ఎముక ? ఫీమర్
68.కీళ్లలో స్రవించే ద్రవం ఏది? సైనోవియల్ ద్రవం
69.ఎముకలో ఉండే సన్నని నాళాలలను ఏమంటారు? హౌవర్షియం కెనాల్స్
70.మానవునిలో చలనానికి తోడ్పడేవి ఏవి? కండరాలు
71.చనిపోయిన తర్వాత కండరాలలో కలిగే కఠినత్వాన్ని ఏమంటారు? రైగర్‌మార్టిస్
72.కండర సంకోచంలో ఉద్భవించే ఉష్ణాన్ని కొలిచే సాధనం? ధర్మోఫైల్
73.మానవుని కండరశక్తి సామర్థ్యాలను తెలిపే శాస్త్రం ఏది? ఎలక్ట్రోమయోగ్రఫీ
74.ఆహారాన్ని వాయునాళంలోకి రాకుండా చూసే అవయవం? ఉపజిహ్వ ( కొండనాలుక)
75. ఊపిరితిత్తులను కప్పిఉంచే పొర పేరేమిటి ? పుపుసావరణ త్వచం
76.ఊపిరితిత్తులకు కలుషిత రక్తాన్ని తెచ్చే ధమని? పుపుస ధమని
77.పెద్దవారిలో శ్వాసక్రియ రేటు ? నిమిషానికి 16 నుండి 18
78.శ్వాసక్రియలో పాల్గొనే రక్తంలోని భాగము? హీమోగ్లోబిన్
79.రక్తంలోని పసుపుపచ్చని ద్రవ పదార్థం? ప్లాస్మా
80.తెల్లరక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? శోషరస కణజాలంలో
81.ఎర్రరక్తకణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? ఎముక మజ్జ
82.ఎర్రరక్తకణాలను లెక్కించడానికి వాడే పరికరం? హీమో సైటోమీటర్
83.రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్? విటమిన్- కె
84.ఎర్రరక్త కణాల జీవితకాలం? 120రోజులు
85.రక్తం త్వరగా గడ్డకట్టని వారసత్వ వ్యాధి? హీమోఫీలియా
86.మానవుని గుండెను రక్షించు పొర? పెరికార్డియం
87.గుండె స్పందన రేటును కనుగొనడానికి ఉపయోగించే పరికరంఏదీ? ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్( ఇసిజి)
88.ఉత్రేరకాలుగా పనిచేసి జీర్ణక్రియా రేటును పెంచేవాటిని ఏమంటారు? ఎంజైమ్‌లు
89.జీర్ణమైన ఆహారం రక్తంలో ఎక్కడ కలుస్తాయి? చిన్న పేగులు
90.నోటిలోస్రవించే లాలాజలంలో ఉండే ఎంజైమ్? టయలిన్
91.జఠరరసంలో ఉండే ఆమ్లం ఏమిటి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం
92.జఠరరసంలో ఉండే ఎంజైమ్‌లు? పెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్
93.జఠరరస గ్రంథుల నుంచి స్రవించే హార్మోన్? గాస్ట్రిక్ హర్మోన్
94.కొవ్వులను జీర్ణం చేసే రసం ఏమిటి? పైత్యరసం
95.మూత్రపిండాలకు రక్తం తీసుకొని వచ్చే ధమనులు? వృక్కధమనులు
96.మూత్రపిండాలలో మూత్రాన్ని వడకట్టేవి? నెఫ్రానులు
97.ఒక్కొక్క మూత్రపిండంలో ఎన్ని నెఫ్రానులు ఉంటాయి? సుమారు పదిలక్షలు
98.ఊపిరితిత్తులు విసర్జించే పదార్థాలు? కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి
99.చర్మం విసర్జించే పదార్థం? స్వేదము
100.చర్మం యొక్క రంగు దేనివల్ల వస్తుంది? మొలనిన్
101. మానవునిలో ప్రేరణ, ప్రతిక్రియలను జరిపే వ్యవస్థ? నాడీవ్యవస్థ
102.నాడీ మండలంనకు ఆధారమైన జీవకణం? నాడీకణం ( న్యూరాన్)
103.కేంద్రనాడీ మండలంలో ఉండే భాగాలు? మెదడు, వెన్నుపాము
104.మానవునిలోని మెదడు బరువు? 1350గ్రాములు
105.శ్వాసక్రియ, రక్తప్రసరణలను నియంత్రించే మెదడు భాగం? మెడుల్లా అబ్లాంగేటా
106.మెదడు నుంచి శరీరభాగాలకు ఆజ్ఞలను కొనిపోయే నాడులు ఎన్ని? 12జతలు
107.వెన్నుపాము నుంచి శరీరభాగాలకు వ్యాపించే నాడులు ఎన్ని? 31జతలు
108.కంటిలోని కృష్ణపటలమును కెమోరాలోని ఏభాగంతో పోలుస్తారు? షట్టర్
109.కంటి రెటీనాతో కాంతికిరణములకు ఉత్తేజపడే నాడీకణముల పేరు? రాడ్స్ - కోన్స్
110.దంతం ఏపదార్థంతో తయారుచేయబడుతుంది? డెంటీన్
111.పాలను జీర్ణం చేసే ఎంజైమ్ ? రెనిన్
112.మానవశరీరంలో అతిపెద్ద గ్రంధి? కాలేయం
113.మాంసకృత్తులు రక్తంలో ఏరూపంలో కలుస్తాయి? అమైనోఆమ్లాలు
114.రోగనిరోధక శక్తిని కల్గించే రక్తకణాలు ఏవి? తెల్లరక్తకణాలు
115.మానవశరీర ఉష్ణోగ్రతను క్రమపరిచే గ్రంథి? పిట్యూటరీ గ్రంథి
116.ఆడమ్స్ ఆపిల్‌గా పిలువబడే వినాళగ్రంథి? థైరాయిడ్ గ్రంథి
117.మానవశరీరంలో ఉండే క్రోమోజోములు సంఖ్య? 23 జతలు
118.రక్తహీనత ఏ పోషక పదార్థం లోపం వలన కలుగుతుంది? ఇనుము
119.పాలలో ఉండే ప్రోటీన్? కేసిన్
120.శరీర పెరుగుదలకు తోడ్పడే పోషక పదార్థాలు. ? ప్రోటీన్‌లు
121.విటమిన్‌లను కనుగొన్న శాస్త్రవేత్త? ఫంక్
122.విటమిన్ - ఎ లోపం వలన కలిగే వ్యాధి? రేచీకటి
123.ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గితే వచ్చే వ్యాధి? డెర్మాటిస్ ( చర్మవ్యాధి)
124. ఆహారంలో ప్రోటీన్లు తగ్గితే వచ్చే వ్యాధి? క్వాషియార్కర్, మరాస్మస్
125.ఆహారంలో అయోడిన్ లోపం వలన వచ్చేవ్యాధి? గాయిటర్
126.ఆహారంలో జింక్‌లోపం వలన వచ్చేవ్యాధి? హైపోగొనాడిజం
127.త్రాగునీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే వచ్చే వ్యాధి? ఫ్లోరోసిస్
128.నీటిలో కరిగే విటమిన్‌లుల? బి మరియు సి
129.విటమిన్ - ఇ రసాయన నామం? టోకొఫెరాల్
130.విటమిన్ - సి రసాయన నామం? ఆస్కార్బిక్ ఆమ్లం
131.మానవుని శరీర ఉష్ణోగ్రత? 98.40 ఫా/ 36.90సె.గ్రే
132.ఒకసారి గుండెకొట్టుకొనుటకు ఎంత సమయం తీసుకుంటుంది? 0.5 సెకెన్లు
133.ఆహారం నిల్వ ఉంచడానికి వాడే రసాయన పదార్థం? ఫార్మాల్డిహైడ్
134.విటమిన్ బి12 లో ఉండే మూలకం? కోబాల్టు
135.మెనింజైటిస్ అనే వ్యాథి శరీరంలో ఏభాగానికి వస్తుంది? మెదడు
136.ల్యుకేమియా వ్యాధి ప్రభావం వేటిమీద ఉంటుంది? తెల్లరక్తకణాలు
137.సోమ్నాంబులిజం అంటే? నిద్రలో నడవడం
138.అమ్నేషియా వ్యాధి అంటే? జ్ఞాపకశక్తికోల్పోవడం
139.పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు? జోనాస్లాక్
140.సిర్రోసిస్ అనేవ్యాధి ఏ అవయవానికి వస్తుంది?కాలేయం
141.క్షయ వ్యాధి కారకమూన బ్యాక్టీరియా పేరు? మైకోబ్యాక్టీరియం ట్యుబర్‌క్యులోసిస్
142.ఎర్రరక్తకణాలనుంచి హీమోగ్లోబిన్ విడిపోయి ప్లాస్మాలో కలియడాన్ని ఏమంటారు? హీమోలైసిస్
143.రక్తకణాల తయారీని ఏమంటారు? హీమోపాయిసిస్
144.రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే రక్తకణాలు? త్రాంబోసైట్లు
145.శోషరసంలో ఉండే కణాలు.? లింఫోసైట్‌లు
146.సార్వజనీన గ్రహీత అయిన రక్తవర్గం? ఎబి గ్రూపు
147.సార్వజనీన దాత అయిన రక్త వర్గం? ఒ గ్రూపు
148.మూత్రపిండాలు పనిచేయనపుడు రక్తాన్ని ఏపద్థతిలో శుభ్రపరుస్తారు? డయాలిసిస్
149.కుష్టువ్యాధి నివారణకు వాడే మందులేవి? సల్ఫాడ్రగ్స్ లేక సల్ఫోన్స్
150. సూదులతో చేసే వైద్యం పేరు? ఆక్యుపంక్చర్