Type Here to Get Search Results !

Vinays Info

చీమలు ఎప్పుడూ ఒకే వరసలో ఎందుకు వెళ్తాయి?

 చీమలు ఎప్పుడూ ఒకే వరసలో ఎందుకు వెళ్తాయి?

మీరు ఎప్పుడైనా గమనించారా చీమలు ఎందుకు ఒకదాని వెనుక ఇంకోటి వెళ్తాయి అని ఎప్పుడైనా ఆలోచించారా?

ఎందుకు అలా వెళ్తాయో చూదాం.

▪️చీమలు అలా వరుసగా వెళ్ళడానికి ఒక పెద్ద కారణమే ఉంది.ఎందంటే ఒక చీమ కి ఏదైనా తినడానికి ఆహారం దొరికినప్పుడు, ఆ చీమ ఆ ఆహారాన్ని తన పుట్టలోకి తీసుకొని వెళ్తుంది. ఆ పుట్టలో చాలా చీమలు ఉంటాయి.ఆ చీమలు అన్ని ఆ దొరికిన ఆహారమును తినాలి అని చీమలు అనుకుంటాయి. అందుకని చీమలు ఆహారం తీసుకొని వెళ్ళేటప్పుడు పేరామోన్స్ అనే కెమికల్ ను వదిలి వెళ్తాయి.ఆ వాసన ను పసిగట్టి చీమలు అన్ని వరుసలో వెళ్తాయి.

🐜చూసారా ఒక చీమ అంటే ఇంకో చీమకి ఎంత ఇష్టమో..ఒక చీమకు దొరికిన ఆహారాన్ని తాను తినకుండా తనతో పాటు ఉన్న చీమలు అన్ని తినాలి అనుకుంటాయి కాబట్టే పేరామెన్స్ అనే కెమికల్ ను వదులుతాయి.

🐜మీరు ఇంకోటి గమనించారా..చీమలు వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాయి.మీరు ఎప్పుడైనా చూసారా.

🐜అవి మాట్లాడుకుంటున్నాయి అని మనం అనుకుంటాం కానీ అది నిజం కాదు.చీమల పుట్టలో కొన్ని చీమలు ఉంటాయి.ఎదురు వచ్చే చీమలు తన పుట్టలోని చీమలో కాదో అని వాసన చూస్తాయి.తన పుట్టలోని చీమ కాకపోతే చీమలు అన్ని కలిసి ఆ చీమని తరిమేస్తాయి.శాస్తవ్రేత్తలు బాగా పరిశీలించి ఈ సంగతి తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section