కవలల దినోత్సవం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 22 న జరుపుకుంటారు . ప్రపంచవ్యాప్తంగా దాదాపు 125 మిలియన్ల ‘మల్టీపుల్స్’ (ఒకే కాన్పులో జన్మించిన ఒకరికన్నా ఎక్కువమంది) ఉన్నారు. ప్రపంచం లో మొట్టమొదట సారి కవలల దినోత్సవాన్ని పోలెండ్ వారు 1976లో నిర్వహించారు.
వేదాల్లో అశ్వినీ దేవతలు, రామయణంలో లవకుశలు, మహాభారతం లో నకుల సహదేవులు కవలలుగా మనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా గత 35 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా అనేక దేశాలలో దీనిని పాటిస్తున్నారు. పోలెండులో జన్మించిన ''మోజస్, ఆరన్ విల్‌కాక్స'' అనే కవల సోదరులు మరణించిన రోజును ప్రపంచ కవలల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దీనికి ఒక కథనం కూడా ప్రచారంలో వుంది. మోజస్, ఆరస్ విల్‌కాక్స తాము నివసిస్తున్న ఇంటి (ఊరు) కి ట్విన్స్ బర్గ్ అని పేరు పెట్టుకుని ఎంతో ఆప్యాయతతో ఉండేవారు. వివాహం తరువాత తమ అనుబంధం విడిపోవద్దన్న ఆలోచనతో అక్కచెల్లెళ్ళను వివాహం చేసుకుని, రెండు కుటుంబాలు ఎంతో అనురాగంలో ఉండేవి. విచిత్రంగా ఇద్దరూ ఒకే వ్యాధితో భాధపడుతూ ఒకే రోజున (ఫిబ్రవరి 22న) మరణించారు. బింబప్రతిబింబాల మాదిరిగా ఉన్న ఈ కవలసోదరుల గౌరవార్థం ఆ నాటినుంచి వారు మరణించినరోజును కవలల దినోత్సవంగా జరుపుతున్నారు.కారణంలో ఈ గ్రామంలోని ఆరువందలమంది జనభా ఉన్న ఈ గ్రామంలో 33జతల మంది కవలలే ఉన్నారు. చిలీ దేశానికి చెందిన లియొన్ టైన్ అల్బినా 55 మంది కవలలకు జన్మనిచ్చి గిన్నీస్ బుక ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఈమె ఐదు సార్లు ఒక్కోక్క కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. భారతదేశంలో మొదటిసారిగా కవలల పండుగ 2004లో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ పండుగలో దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవలలు తన సంతోషాలను పంచుకున్నారు. ట్విన్ ప్యారడైజ్ పేరుతో మేజిక ఫన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పండుగలో వందలాది మంది కవలలు పాల్గొన్నారు. ఇటీవల బెల్జియంలో శతవత్సరాలు నిండిన కవలలు అక్కాచెల్లెలు గబ్రీల్లె వౌడ్రెమర్, మారీ హెండ్రిక్స కుటుంబసభ్యుల సమక్షంలో జన్మదినోత్సవ కేక కట్ చేశారు.
ఒకే తల్లి గర్భం నుంచి ఒకేసారి ఒక్కరికన్నా ఎక్కువమంది జన్మిస్తేవారిని కవలలు గా పేర్కొంటారు. ఒకే కాన్పులో ఇద్దరు కవలలు సాధారణంగా జన్మిస్తే , ఒకే కాన్పులో ముగ్గురు నుంచి ఏడుగురు వరకు జన్మించడం అసాధారణంగా జరుగుతుంది. అయితే చాలా సందర్బాలలో వీరు బతికే అవకాశాలు తక్కువ. ఇద్దరు పిల్లల శరీరాలు కలిసిపోయి జన్మిస్తే వారిని అవిభక్త కవలలు లేదా సియామీ కవలలు అంటారు. సాధారణంగా యాభైవేల మంది లో ఒక్కరూ అవిభక్త కవలలుగా జన్మించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అవిభక్త కవలను చాలా జాగ్రత్తగా సర్జరీ ద్వారా వేరుచేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కవలలు ఒకే పోలికలతో ఉంటే వారిని మోనోజైగోటిక అని, వేర్వేరు పోలికలతో ఉంటే వారిని డైజైగోటిక గా వ్యవహరిస్తారు. కవలలు జన్మించడానికి ప్రధాన కారణాలు రెండు అండాలు విడుదల కావడం, లేదా ఫలదీకరణ చెందిన తరువాత పిండం రెండుగా విభజన చెందడం. రెండు అండాలు విడుదలై, రెండు వీర్యకణాలతో సంయోగం చెందినప్పుడు జన్మించే కవలల్లో ఆడ, మగ పిల్లలు ఉండే అవకాశాలు ఉంటాయి. అలాకాకుండా ఫలదీకరణం చెందిన తరువాత విభజన జరగడంతో జన్మించే కవలల్లో ఇద్దరూ ఆడా, లేదా ఇద్దరూ మగ పిల్లలు జన్మించే అవకాశం ఉంటుంది. వీరిలో పోలికలు చాలా ఎక్కువగా ఉంటాయి. వంశపారంపర్యంగా కూడా కవలలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు సూచిస్తూన్నారు. బిడ్డ కడుపులో ఉండగానే డాక్టర్ల సలహా, సూచనల మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన కవలలు నిండు నూరేళ్లు బతికే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 125 మిలియన్ల కవలలు ఉన్నారని 2006వ సంవత్సరంలో జరిపిన ఒక సర్వే ఆధారంగా తెలిసింది. ప్రపంచజనాభా ఇది 1.9శాతం. వీరిలో 0.2శాతం మంది గుర్తించడానికి వీలు కాకుండా అంటే ఒకే పోలికలతో ఉన్నవారే. పుట్టే ప్రతి వెయ్యిమంది కవలలలో 32 మంది మాత్రమే జీవిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ప్రపంచంలో అత్యధిక కవలల జనాభా కలిగిన దేశం యోరుబా. ఈ దేశంలో పుట్టే ప్రతివెయ్యిమంది శిశువుల్లో 45మంది కవలలే. భారతదేశంలో అలహాబాద్ సమీపంలోని మహమ్మద్ ఉమ్రి అనే అతిచిన్నగ్రామానికి కవలల గ్రామమని పేరు.