2.ఎవరేం పని చేస్తారు!
- కమల వాళ్ళ ఇంట్లో - అమ్మ,నాన్న, తాతయ్య, నాయనమ్మ, తమ్ముడు ఉంటారు.
- కుటుంబంలోని వ్యక్తులందరూ కలిసిమెలిసి పనులు చేసుకోవాలి.
- ఇలా చేసుకోవడం వలన వారిలో ప్రేమ, అభిమానం కలుగుతాయి.
- సమ్మక్క - బుట్టలు అల్లుతుంది
- వెంకన్న - చెప్పులు కూడతాడు.
- కోమరయ్య - క్షవరం చేస్తాడు.
- శంకరయ్య - కట్టెపని చేస్తాడు.
- ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనులను వృత్తులు అంటారు.
- అన్ని వృత్తులవాళ్ళు గ్రామ అభివృద్ధికి అవసరం.
- పెద్దలు బయట చేసే పనుల వల్ల కుటుంబానికి ఆదాయం వస్తుంది.
- రాజయ్య రోడ్లు ఊడవడం, కాలువలు శుభ్రం చేస్తాడు.