సూచికలు

VINAYS INFO
VINAYS INFO

ప్రజాస్వామ్య సూచీ

-ప్రజాస్వామ్య సూచీ-2017ను బ్రిటన్‌కు చెందిన సంస్థ ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఎస్‌యూ) విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో నార్వే ఉండగా, ఆ తర్వాత వరుసగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ ఉన్నాయి. భారత్ 42వ స్థానంలో నిలిచి దోషపూరిత ప్రజాస్వామ్య దేశాల జాబితాలోనే కొనసాగుతుంది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కింది.

అంతర్జాతీయ మేధో హక్కుల సూచీ

-అమెరికా చాంబర్స్ ఆఫ్ కామర్స్‌లో భాగమైన గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐసీసీ) 50 దేశాలకు చెందిన అంతర్జాతీయ మేధో హక్కుల సూచీ-2018ని విడుదల చేసింది. ఈ సూచీలో అగ్రస్థానంలో అమెరికా ఉండగా, బ్రిటన్, స్వీడన్, ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెనెజులా, అల్జీరియా, ఈజిప్టు, పాకిస్థాన్, అర్జెంటీనా కింది నుంచి వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలో భారత్‌కు 44వ స్థానం దక్కింది.

సమ్మిళిత అభివృద్ధి సూచీ

-అభివృద్ధి చెందుతున్న దేశాల సమ్మిళిత అభివృద్ధి సూచీ-2018ని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సమ్మిళిత ఆధునిక ఆర్థిక వ్యవస్థల జాబితాలో నార్వే మొదటి స్థానంలో ఉండగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల జాబితాలో లిథువేనియా తొలి స్థానంలో ఉంది. భారత్‌కు 62వ స్థానం దక్కింది. అభివృద్ధి- సుస్థిర ప్రగతిలో 66వ స్థానం, తరాల మధ్య సమానత్వంలో 44వ ర్యాంకు వచ్చింది. 2017 జాబితాలో మొత్తం 79 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ 60వ స్థానంలో ఉంది. 2018 సూచీలో 103 అభివృద్ధి చెందుతున్న దేశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

విశ్వసనీయత సూచీ

-ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ దేశంగా భారత్‌కు మూడో స్థానం లభించింది. ప్రభుత్వం, వ్యాపార రంగం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా పనితీరుపై ఎడల్‌మెన్ ట్రస్ట్ బారోమీటర్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులను ఇచ్చింది. విశ్వసనీయతలో చైనా ప్రథమస్థానం, ఇండోనేషియా ద్వితీయ స్థానంలో నిలిచాయి. 28 దేశాల్లో సర్వే చేయగా, 20 దేశాలు అవిశ్వసనీయ ప్రాంతాలు అనే విభాగంలో చేరాయి.

ప్రతిభా పోటీతత్వ సూచీ

-అడెక్కొ, ఇన్‌సీడ్, టాటా కమ్యూనికేషన్స్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ప్రపంచ ప్రతిభా పోటీతత్వ సూచీలో భారత్‌కు 81వ ర్యాంకు దక్కింది. మేధావులను ఆకర్షించడంలో 98వ స్థానం, మేధావులను నిలుపుకోవడంలో 99వ స్థానం లభించాయి. 

FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

You may like these posts

Post a Comment