Type Here to Get Search Results !

Vinays Info

పది దేశాల కూటమి ఆసియాన్

 ASEAN
-తమ ప్రాంత సుస్థిరత, రాజకీయ, ఆర్థిక రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆసియా ఖండంలోని దక్షిణ తూర్పు ప్రాంతంలో ఉన్న పది దేశాలు కలిసి 1967, ఆగస్టు 8న బ్యాంకాక్‌లో అసోసియేషన్ ఆఫ్ సౌత్‌ఈస్ట్ ఆసియన్ నేషన్స్ (ఆసియాన్)గా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో థాయ్‌లాండ్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనై సభ్యదేశాలుగా ఉన్నాయి.
-ఈ కూటమి ఏర్పాటులో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాన పాత్ర పోషించారు. ఇవి ప్రారంభ సభ్యదేశాలు కాగా, బ్రూనై 1984, జనరవరి 7న, వియత్నాం 1995, జూలై 28న, లావోస్ 1997, జూలై 23న, కంబోడియా 1999, ఏప్రిల్ 30న సభ్యులుగా చేరాయి.
-కూటమి సెక్రటేరియట్‌ను 1976, ఫిబ్రవరిలో జకార్తాలో ఏర్పాటు చేశారు.
-ఆ దేశాల రాజధానులు, అధ్యక్షులు/ప్రధానులు..
-సింగపూర్ ప్రధాని లీ సిన్ లూంగ్, రాజధాని సింగపూర్
-ఇండోనేసియా పరిపాలకుడు అధ్యక్షుడు జోకో విడోడో, రాజధాని జకార్తా
-మయన్మార్ అధ్యక్షుడు మింట్ స్వీ (తాత్కాలిక), రాజధాని నేపితా
-వియత్నాం ప్రధాని ఎన్‌గ్యుయెన్ జువాన్ ఫ్యుసి, రాజధాని హనోయ్
-ఫిలిప్పీన్స్ అధ్యక్షడు రోడ్రిగో డ్యుటెర్టె, రాజధాని మనీలా
-మలేషియా ప్రధాని నజీబ్ రజాక్, రాజధాని కౌలాలంపూర్
-థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓ చా, రాజధాని బ్యాంకాక్
-బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా, రాజధాని బండార్ సెరి బెగవాన్.
-లావోస్ ప్రధాని థాంగ్లోవున్ సిసోయులిత్, రాజధాని వియత్నాం
-కంబోడియా ప్రధాని హున్ సెన్, రాజధాని ఫ్నోమ్ పెన్హ్
FOLLOW US ON | FB | TWITTER | GOOGLE+ | YOUTUBE

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section