-రామోసి విప్లవం: ఈ
ఉద్యమాన్ని మహారాష్ట్రలో వాసుదేవ్ బలవంత్ పాడ్కే ప్రారంభించాడు. రామోసీలు,
లంగర్‌లు అనే కింది కులాల వారిని చైతన్యపరిచి 1879లో బ్రిటిష్
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాట్లు చేయించాడు.
-బిజోల ఉద్యమం: ప్రభుత్వం నిరంతరం పెంచుతున్న పన్నులను చెల్లించకూడదని 1905లో రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలో బిజోల రైతులు ఈ ఉద్యమాన్ని చేపట్టారు. దీనికి విజయ్‌సింగ్ పాతిక్, సాధు సీతారాందాస్, మాణిక్‌లాల్ వర్మ నాయకత్వం వహించారు.
-చంపారన్ సత్యాగ్రహం: బీహార్‌లోని చంపారన్‌లో 1860 నుంచి తీన్ కథియా విధానాన్ని బ్రిటిష్‌వారు అమలుపరిచారు. 3/20 వంతు నీలిమందును పండించాలని రైతులపై ఒత్తిడి చేయడంతోపాటు ఆ పంటను తక్కువ ధరకు కొనేవారు. 1900లో సింథటిక్ డై నుంచి పోటీ రావడంతో బ్రిటిష్ వ్యాపారులు మరింత తక్కువకు నీలిమందును విక్రయించాలని రైతులను అనేక బాధలు పెట్టారు. ఈ నేపథ్యంలో 1916 లక్నో కాంగ్రెస్ సమావేశంలో రాజ్‌కుమార్ శుక్ల మహాత్మాగాంధీని కలుసుకుని ఉద్యమం చేపట్టాలని కోరారు. 1917లో గాంధీ, బాబు రాజేంద్రప్రసాద్ (బీహార్ గాంధీ), నారాయణ సింహ, జేబీ కృపలాని తదితరులతో కలిసి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం పెంచిన పన్నులను (షారాబేసి) తగ్గించడానికి అంగీకరించింది.
-ఖేడా లేదా ఖైరా సత్యాగ్రహం: గుజరాత్‌లోని ఖేరా ప్రాంతంలో పంటలు సరిగా పండకపోయినా పన్నులు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడంతో 1917లో మోహన్‌లాల్ పాండ్య ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ, వల్లభాయ్ పటేల్, మహాదేశ్ దేశాయ్ చేపట్టి ప్రభుత్వానికి విన్నవించి సానుకూల ఫలితాలు సాధించారు.
-బర్దోలి సత్యాగ్రహం (1928): ఉద్యమ నాయకుడు వల్లభాయ్‌పటేల్. అయితే, ఉద్యమ సన్నద్ధతను కళ్యాణ్‌జీ మెహతా, కునవర్దీ మెహతా అనే యువకులు చేశారు. గుజరాత్‌లోని బర్దోలిలో స్థానిక ప్రభుత్వం 22 శాతం భూమి పన్నులు పెంచడంతో ఉద్యమం చేపట్టారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వం మాక్స్‌వెల్ బ్రూన్‌ఫీల్డ్ అధ్యక్షతన విచారణ కమిటీ వేయగా, నిజానిజాలు నిర్ధారించి పన్నును తగ్గించారు.
-మోప్లా ఉద్యమం: కేరళలో ముస్లిం రైతులు కౌలుదారి హక్కుల కోసం 1920లో ఉద్యమం చేపట్టారు. ఖిలాఫత్ ఉద్యమం వీరిని ఉత్తేజపరిచింది. బ్రిటిష్ ప్రభుత్వం ముఖ్య నాయకులను అరెస్టు చేయడంతో ప్రజలు హింసకు పాల్పడ్డారు. ఈ ఉద్యమానికి మహ్మద్ హాజి, అలీ ముసలియార్ నాయకత్వం వహించారు. వ్యవసాయ తిరుగుబాటు కాస్తా మతం రంగు పులుముకుంది. భూస్వాములు హిందూ అగ్రవర్ణాలైన నంబూద్రిలు, నాయర్‌లు అనే బ్రాహ్మణులు. దీంతో వీరిపై దాడులు జరిగాయి. ఈ తిరుగుబాటును బ్రిటిష్ వారు అణచివేశారు. ఈ సమయంలో బ్లాక్ హోల్ పోడనుర్ సంఘటన జరిగింది. రైల్వేవ్యాగన్‌లో 200 మంది తిరుగుబాటుదారులను బంధించడంతో గాలి ఆడక 66 మంది మృతిచెందారు.
-బోర్సాద్ సత్యాగ్రహం: పెంచిన పోల్ ట్యాక్స్(దొంగలను అణచివేసి, శాంతిభద్రతలు కాపాడుతున్నామని, కాబట్టి పన్నులను పెంచాలని గుజరాత్‌లో ప్రభుత్వం ఒత్తిడి చేసింది)కు వ్యతిరేకంగా సర్ధార్ వల్లభాయ్‌పటేల్ నాయకత్వాన 1923లో ఉద్యమం జరిగింది. ఈ పన్నును ప్రభుత్వం 1924లో ఎత్తివేసింది.
-కిసాన్ సభ ఉద్యమం: ఆల్ ఇండియా కిసాన్ సభను 1934లో లక్నోలో స్థాపించారు. ఈ సభకు అధ్యక్షులుగా స్వామి సహజానంద సరస్వతి, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌జీరంగా వ్యవహరించారు. రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం దేశంలో మొదటిసారి రైతు శిక్షణా సంస్థ ఇండియన్ పీసెంట్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ఎన్‌జీరంగా నిడబ్రోలులో ప్రారంభించాడు. బెంగాల్‌లో 1946లో జరిగిన రైతు ఉద్యమాన్ని తేబాగా ఉద్యమం అంటారు. ఈ ఉద్యమానికి సంబంధించి ఫ్లౌడ్ కమిషన్ వేసి నివారణ చర్యలు చేపట్టారు.
-ఈ పత్రికకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్‌లు వ్యాసాలు రాసి పంపేవారు.
-బ్రహ్మసమాజం నిర్వహణలో దేవేంద్రనాథ్ ఠాగూర్‌కు, కేశవచంద్రసేన్‌కు విభేదాలు వచ్చాయి.
-కేశవచంద్రసేన్ కులం పోవాలని, మతపరంగా బ్రహ్మసమాజం హిందూ మతానికి దూరంగా ఉండాలని తెలిపాడు.
-దేవేంద్రనాథ్ ఠాగూర్ కులాన్ని పోగొట్టలేమని, అందులోని విచక్షణాయుత కాఠిన్యాన్ని తగ్గించేలా ప్రచారం చేయాలని, బ్రహ్మసమాజం హిందూమతంలో ఒక భాగంగా ఉండాలని తెలిపాడు.
-చివరి రోజుల్లో దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్యాత్మిక, మత గ్రంథాల అధ్యయనంలో నిమగ్నమయ్యాడు

దేవేంద్రనాథ్ ఠాగూర్ (1817-1905)
-ఈయన రాజా రామ్మోహన్‌రాయ్ ఆలోచనలను, భావాలను వ్యాప్తి చేయడానికి తత్వబోధిని సభను 1839లో స్థాపించాడు. బెంగాలీ భాషలో తత్వబోధిని అనే పత్రికను ప్రారంభించాడు.-ఈ పత్రికకు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రాజేంద్రలాల్‌లు వ్యాసాలు రాసి పంపేవారు.