-19వ శతాబ్దంలో ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యావిధానం భారతీయుల మనస్సులను
వికసింపజేసి, యథార్థానికి నాటి ప్రపంచ పోకడలను సన్నిహితంగా తీసుకొచ్చింది.
కొంతకాలం వరకు భారతీయులు పాశ్చాత్య విద్యతోపాటు ఫ్రాన్స్‌లో వెల్లివిరిసిన
హేతువాద ప్రభావాల్లో ఉండిపోయారు. నాటి భారతీయ పునరుజ్జీవనోద్యమం నిజమైందని,
కాన్‌స్టాంటినోపుల్ నగర పతనం తర్వాత ఐరోపాలో జరిగిన విప్లవాత్మకమైన ఉద్యమం
కంటే తీవ్రమైందని, విస్తృతమైనదని సర్ జాదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు.
-మత సంస్కరణ అనేది హిందువులకు కొత్తకాదు. భారతదేశ చరిత్ర పరిశీలిస్తే వేదకాలం నుంచి హిందూమతం సంస్కరణలకు లోనైనట్లు మనకు తెలుసు. వేదమతం నుంచి ఉపనిషత్తుల మతాలకు, బౌద్ధ, జైన మతాలకు మార్పులు గమనించడమైంది. తర్వాత కాలంలో ఇస్లాం మత ప్రభావం వల్ల హిందూ మతంలో జ్ఞాన, కర్మ మార్గాల స్థానంలో అందరికీ సులభమార్గమైన భక్తిమార్గం ద్వారా మోక్షాన్ని పాందవచ్చనే భావన కలిగి మధ్యయుగ శతాబ్దాల్లో చైతన్యుడు, వల్లభాచార్యుడు, కబీర్, తుకారాం, గురునానక్, రాందాస్ వంటి భక్తులు ప్రచారం చేశారు.
-19వ శతాబ్దంలో క్రైస్తవ మతవ్యాప్తిని అరికట్టడం కోసం, తమ మతస్తులకు మతంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటం కోసం హిందూమత సంస్కరణోద్యమానికి పూనుకున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే పునరుజ్జీవనోద్యమానికి ప్రాచీన భారతీయ సాహిత్య అధ్యయనం, ఆంగ్ల విద్య, సాహిత్య ప్రభావం, జాతీయతా భావాలు, భారత సంస్కృతిని అణచివేయడానికి విదేశీయులు పాటించిన విధానాలు ముఖ్య కారణంగా కనిపిస్తాయి. ఇందులో భాగంగా పాశ్చాత్య భావాలను అలవర్చుకోవడం, వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య తదితర డిమాండ్ల మూలంగా, సాంఘిక ధోరణులు వాటంతటవే ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
-రాజారామ్మోహన్‌రాయ్‌ను భారతదేశంలో మొదటి మోడ్రన్ మ్యాన్‌గా కీర్తిస్తారు.
-సాంఘిక, మత, రాజకీయ ఉద్యమాలకు నాంది పలికాడు. ఈయనను భారతదేశ సంఘ సంస్కరణ పితగా పేర్కొంటారు.
-ఈయన ఐరోపా ఉదారభావం వల్ల ప్రభావితుడయ్యాడు.
-వివిధ గ్రంథాల్లో వాస్తవంగా ఏం చెప్పారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఇంగ్లిష్, ఫ్రెంచి, లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలను నేర్చుకున్నాడు.
-ఈయన ఏకేశ్వరోపాసనను నమ్మాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో 1803లో పర్షియన్ భాషలో తువఫత్ ఉల్ మొహావుద్దీన్ లేదా A GIFT TO MONOTHEISTS అనే గ్రంథం రాశాడు.
-మత అంశాల్లో హేతుబద్ధతకు, మానవ పరిశీలనా శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.
-1815లో హిందూమతంలోని సాంఘిక చెడులను తొలిగించడానికి ఆత్మీయ సభను కలకత్తాలో ఏర్పాటు చేశాడు. ఇదే 1828లో బ్రహ్మ సమాజంగా మారింది.
-క్రైస్తవ మతంలో హేతుబద్ధత లేని అంశాలను విమర్శిస్తూ 1820లో THE PRECEPTS OF JESUS, THE GUIDE TO PEACE AND HAPPINESS అనే గ్రంథాలు రాశాడు.
-క్రైస్తవ మిషనరీల విమర్శలకు వ్యతిరేకంగా వేదాంత తత్వంలోని గొప్పతనాన్ని బలపరిచాడు.
-ఈయన 1829లో సతీసహగమన చట్టం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
-ఆధునిక విద్యావిధానం ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా అందాలని పోరాడాడు. ఈ నేపథ్యంలో మెకాలే బిల్లు వచ్చింది.
-భారతదేశంలో రాజకీయ ఆలోచనలను చేసిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్‌రాయ్ ప్రజలకు సంబంధించిన అంశాలపై పాలనలో మార్పు రావాలని, ప్రజా ఆందోళనను నిర్వహించిన మొదటి వ్యక్తి.
-బ్రహ్మ సమాజం సభ్యులు ఒకే దైవాన్ని నమ్మారు. రామ్మోహన్‌రాయ్ వర్ణవ్యవస్థను, ఛాందస బ్రాహ్మణుల క్రౌర్యాన్ని, కర్మకాండను, విగ్రహారాధనను ఖండించాడు.
-హిందూ మతంలోని లోపాలను తొలిగించి, వేదాలను, ఉపనిషత్తులను ఆధారంగా చేసుకుని, ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించాలనేదే బ్రహ్మసమాజం ప్రధాన ఆశయం.
-ఈయన నాయకత్వంలో బ్రహ్మ సమాజం సతీసహగమనాన్ని, బాల్య వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది.
-బ్రహ్మసమాజం అనుసరించిన ముఖ్య సిద్ధాంతం ఏకేశ్వరోపాసన. ఇది విశ్వమానవ సౌభ్రాతృత్వ సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటింది. అన్ని మతాలను, మత గ్రంథాలను గౌరవించాలని ఉపదేశించింది.
-కానీ, ఏ మత గ్రంథాన్ని ప్రామాణికంగా స్వీకరించలేదు. బ్రహ్మసమాజాన్ని సాంఘిక మత సంస్కరణోద్యమంగా వర్ణించవచ్చు.
-రాజా రామ్మోన్‌రాయ్ తన భావాలను ప్రచారం చేయడానికి సంవాద కౌముది, మిరాత్ ఉల్ అక్బర్ అనే పత్రికలను స్థాపించాడు.
-ఈయనకు చివరి మొగల్ చక్రవర్తుల్లో ఒకరైన రెండో అక్బర్ రాజా అనే బిరుదును 1830లో ఇచ్చాడు.
-1833లో రాజా రామ్మోహన్‌రాయ్ రెండో అక్బర్ పెన్షన్ కోసం బ్రిటన్ కోర్టులో వాదిస్తూ బ్రిస్టల్ నగరంలో మృతిచెందాడు.
-ఈయన మరణానంతరం విశేషానుభవజ్ఞులు, సంస్కారవంతులైన ఇతని అనుచరులు దేవేంద్రనాథ్‌ఠాగూర్, కేశవ చంద్రసేన్‌లు బ్రహ్మ సమాజం బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.
-మత సంస్కరణ అనేది హిందువులకు కొత్తకాదు. భారతదేశ చరిత్ర పరిశీలిస్తే వేదకాలం నుంచి హిందూమతం సంస్కరణలకు లోనైనట్లు మనకు తెలుసు. వేదమతం నుంచి ఉపనిషత్తుల మతాలకు, బౌద్ధ, జైన మతాలకు మార్పులు గమనించడమైంది. తర్వాత కాలంలో ఇస్లాం మత ప్రభావం వల్ల హిందూ మతంలో జ్ఞాన, కర్మ మార్గాల స్థానంలో అందరికీ సులభమార్గమైన భక్తిమార్గం ద్వారా మోక్షాన్ని పాందవచ్చనే భావన కలిగి మధ్యయుగ శతాబ్దాల్లో చైతన్యుడు, వల్లభాచార్యుడు, కబీర్, తుకారాం, గురునానక్, రాందాస్ వంటి భక్తులు ప్రచారం చేశారు.
-19వ శతాబ్దంలో క్రైస్తవ మతవ్యాప్తిని అరికట్టడం కోసం, తమ మతస్తులకు మతంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటం కోసం హిందూమత సంస్కరణోద్యమానికి పూనుకున్నారు. సూక్ష్మంగా పరిశీలిస్తే పునరుజ్జీవనోద్యమానికి ప్రాచీన భారతీయ సాహిత్య అధ్యయనం, ఆంగ్ల విద్య, సాహిత్య ప్రభావం, జాతీయతా భావాలు, భారత సంస్కృతిని అణచివేయడానికి విదేశీయులు పాటించిన విధానాలు ముఖ్య కారణంగా కనిపిస్తాయి. ఇందులో భాగంగా పాశ్చాత్య భావాలను అలవర్చుకోవడం, వితంతు పునర్వివాహం, కులాంతర వివాహాలు, స్త్రీ విద్య తదితర డిమాండ్ల మూలంగా, సాంఘిక ధోరణులు వాటంతటవే ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
రాజా రామ్మోహన్‌రాయ్ (1772-1833)
-1772లో బెంగాల్‌లోని రాధానగర్‌లో రాజా రామ్మోహన్‌రాయ్ జన్మించాడు.-రాజారామ్మోహన్‌రాయ్‌ను భారతదేశంలో మొదటి మోడ్రన్ మ్యాన్‌గా కీర్తిస్తారు.
-సాంఘిక, మత, రాజకీయ ఉద్యమాలకు నాంది పలికాడు. ఈయనను భారతదేశ సంఘ సంస్కరణ పితగా పేర్కొంటారు.
-ఈయన ఐరోపా ఉదారభావం వల్ల ప్రభావితుడయ్యాడు.
-వివిధ గ్రంథాల్లో వాస్తవంగా ఏం చెప్పారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో పర్షియన్, అరబిక్, సంస్కృతం, ఇంగ్లిష్, ఫ్రెంచి, లాటిన్, గ్రీకు, హిబ్రూ భాషలను నేర్చుకున్నాడు.
-ఈయన ఏకేశ్వరోపాసనను నమ్మాడు. విగ్రహారాధనను వ్యతిరేకించాడు. ఈ నేపథ్యంలో 1803లో పర్షియన్ భాషలో తువఫత్ ఉల్ మొహావుద్దీన్ లేదా A GIFT TO MONOTHEISTS అనే గ్రంథం రాశాడు.
-మత అంశాల్లో హేతుబద్ధతకు, మానవ పరిశీలనా శక్తికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పాడు.
-1815లో హిందూమతంలోని సాంఘిక చెడులను తొలిగించడానికి ఆత్మీయ సభను కలకత్తాలో ఏర్పాటు చేశాడు. ఇదే 1828లో బ్రహ్మ సమాజంగా మారింది.
-క్రైస్తవ మతంలో హేతుబద్ధత లేని అంశాలను విమర్శిస్తూ 1820లో THE PRECEPTS OF JESUS, THE GUIDE TO PEACE AND HAPPINESS అనే గ్రంథాలు రాశాడు.
-క్రైస్తవ మిషనరీల విమర్శలకు వ్యతిరేకంగా వేదాంత తత్వంలోని గొప్పతనాన్ని బలపరిచాడు.
-ఈయన 1829లో సతీసహగమన చట్టం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
-ఆధునిక విద్యావిధానం ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా అందాలని పోరాడాడు. ఈ నేపథ్యంలో మెకాలే బిల్లు వచ్చింది.
-భారతదేశంలో రాజకీయ ఆలోచనలను చేసిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్‌రాయ్ ప్రజలకు సంబంధించిన అంశాలపై పాలనలో మార్పు రావాలని, ప్రజా ఆందోళనను నిర్వహించిన మొదటి వ్యక్తి.
బ్రహ్మ సమాజం (1828)
-హిందూ మతంలోని పవిత్రతను కాపాడాలని, ఏకేశ్వరోపాసనను పెంచాలనే లక్ష్యంతో 1828లో బ్రహ్మ సమాజాన్ని కలకత్తాలో స్థాపించాడు.-బ్రహ్మ సమాజం సభ్యులు ఒకే దైవాన్ని నమ్మారు. రామ్మోహన్‌రాయ్ వర్ణవ్యవస్థను, ఛాందస బ్రాహ్మణుల క్రౌర్యాన్ని, కర్మకాండను, విగ్రహారాధనను ఖండించాడు.