తెలంగాణ రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా సుఖేందర్‌రెడ్డి
-తెలంగాణ
రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌రెడ్డి
నియమితులయ్యారు. ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్లుగా ఉద్యానశాఖ
డైరెక్టర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి
ఉంటారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్
-మార్చి
6న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా రజత్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు ఆయన రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.
తొలి మహిళా రైల్వేస్టేషన్ బేగంపేట
-మార్చి 8న బేగంపేట రైల్వేస్టేషన్‌ను మహిళా రైల్వేస్టేషన్‌గా దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ ప్రకటించారు.
జయమ్మకు నారీశక్తి పురస్కారం
-2017
సంవత్సరానికి నారీ శక్తి పురస్కారం తెలంగాణ నుంచి జయమ్మ అందుకున్నారు.
హెచ్‌ఐవీ నియంత్రణకు, సెక్స్ వర్కర్ల కుటుంబాల పరిరక్షణకు చేస్తున్న
ఉద్యమాలకు గుర్తింపుగా ఆమెకు ఈ అవార్డు వచ్చింది. అంతర్జాతీయ మహిళా
దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం
చేస్తున్న మహిళలను గుర్తించి కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం
చేస్తుంది.
కలెక్టర్ యోగితా రాణాకు అవార్డు
-బేటీ
బచావో.. బేటీ పడావో పథకం అమలులో అద్భుత ప్రగతి సాధించినందుకు హైదరాబాద్
జిల్లా కలెక్టర్ యోగితా రాణా జాతీయ అవార్డు అందుకున్నారు. రాజస్థాన్‌లోని
జంజునులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో యోగితా రాణాకు ప్రధాని
మోదీ అవార్డును బహూకరించారు.
మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీహబ్
-మహిళా
పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉమెన్
ఎంటర్‌ప్రెన్యూర్ హబ్ (వీహబ్)ను ఏర్పాటు చేసింది. రూ. 15 కోట్లతో
హైదరాబాద్‌లోని అంబేద్కర్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీహబ్‌ను
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు.
వింగ్స్ ఇండియా ఏరోస్పేస్ సదస్సు
-ఎయిర్
పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్
అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్త ఆధ్వర్యంలో బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్
ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సు మార్చి 8 నుంచి 11 వరకు జరిగింది. ఈ
సదస్సులో 10 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 125 కంపెనీలు తమ
ఉత్పత్తులను ప్రదర్శించాయి.
మనూ బాకర్‌కు రెండు స్వర్ణాలు
సీనియర్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో
హర్యానాకు చెందిన 16 ఏండ్ల మనూ బాకర్ స్వర్ణ పతకం గెలిచింది. దీంతోపాటు 10
మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా
నిలిచి స్వర్ణం సాధించింది.
భారత్ బికు దేవధర్ ట్రోఫీ
దేవధర్ క్రికెట్ ట్రోఫీని భారత్ బి జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో కర్ణాటక జట్టును భారత్ బి జట్టు ఓడించింది.
అజ్లాన్‌షా టైటిల్ ఆస్ట్రేలియా కైవసం
మలేషియాలో
జరిగిన అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భారత్ ఐదో స్థానంలో నిలిచింది.
అజ్లాన్‌షా హాకీ టైటిల్‌ను 12వ సారి ఆస్ట్రేలియా కైసవం చేసుకుంది.
రన్నరప్‌గా ఇంగ్లండ్ నిలిచింది. గతంలో ఇంగ్లండ్ రెండు సార్లు అజ్లాన్‌షా
టైటిల్‌ను గెలిచింది.
బీసీసీఐ కొత్త కాంట్రాక్టులు
మార్చి
7న బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. 26 మందికి చోటుదక్కింది.
తొలిసారిగా ఎ ప్లస్ గ్రేడ్‌ను కూడా చేర్చింది. ఇందులో ఐదుగురికి
చోటుదక్కింది. ఎ ప్లస్ గ్రేడ్‌కు రూ. 7 కోట్లు, ఎ గ్రేడ్‌కు రూ. 5 కోట్లు,
బి గ్రేడ్‌కు రూ. 3 కోట్లు, సి గ్రేడ్‌కు కోటి రూపాయలు ఇవ్వనున్నారు.
కోన తరుణ్ జోడీకి జమైకా టైటిల్
జమైకా
ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ కోన తరుణ్
డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ
టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో తరుణ్- సౌరభ్‌శర్మ జంట... గారెత్ హెన్రీ,
రికెట్స్ (జమైకా) జంటపై విజయం సాధించింది.
ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్
-మార్చి 6న
ఫోర్బ్స్ వెల్లడించిన వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో మొదటి స్థానంలో అమెజాన్
చీఫ్ జెఫ్ బెజోస్ నిలిచాడు. 18 ఏండ్లపాటు అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్
అధినేత బిలిగేట్స్ రెండో స్థానానికి పడిపోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్
అధినేత ముఖేశ్ అంబానీ 19వ స్థానంలో నిలిచారు.
బిల్‌గేట్స్ నాలుగు దేశాలకు రూ. 1000 కోట్ల విరాళం
-మహిళలు
ఆర్థిక సాధికారిత సాధించడమే లక్ష్యంగా భారత్, కెన్యా, టాంజానియా, ఉగాండా
దేశాలకు రూ. 1000 కోట్ల ప్రాజెక్టును బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్
ప్రకటించింది. ఈ నాలుగు దేశాల్లో లింగ సమానత్వాన్ని పెంచడం, డిజిటల్ ఆర్థిక
సమ్మేళనాన్ని విస్తరించడం, ఉద్యోగావకాశాలు పెంచడం, వ్యవసాయరంగానికి, మహిళా
బృందాలకు మద్దతునివ్వడం వంటి వాటికోసం ఈ నిధులను ఖర్చు చేస్తారు.
యూఎన్‌వో నినాదం
-మార్చి 8న ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవం నినాదం పురోగతి కోసం పట్టు అని ప్రకటించింది.
చైనా శాశ్వత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
-చైనా
శాశ్వత అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్ కొనసాగనున్నారు. ఓ వ్యక్తి
అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువ సార్లు పనిచేయకూడదంటూ ఉన్న పరిమితిని
ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు చైనా పార్లమెంట్ మార్చి 11న ఆమోదం తెలిపింది.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపక చైర్మన్ మావో జెడాంగ్ తర్వాత
అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్‌పింగ్ రికార్డు
సృష్టించనున్నారు.
బాలకృష్ణకు ప్రిట్జ్‌కర్ పురస్కారం
-ప్రముఖ
ఆర్కిటెక్ట్ బాలకృష్ణ దోశీ ప్రతిష్ఠాత్మక ప్రిట్జ్‌కర్ పురస్కారాన్ని
గెలుచుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయుడు ఆయనే. ప్రిట్జ్‌కర్
పురస్కారం ఆర్కిటెక్ట్ రంగంలో నోబెల్‌తో సమానం.
ఐటీబీపీ తొలి మహిళా అధికారిగా ప్రకృతి
ఇండో-
టిబెటన్ సరిహద్దు పోలీసు దళం (ఐటీబీపీ) తొలి మహిళా అధికారిగా బీహార్‌లోని
సమస్తిపూర్ జిల్లాకు చెందిన ప్రకృతి ఎంపికయ్యారు. ఆమె నేరుగా కంబాట్ ఆఫీసర్
హోదాలో చేరుతున్నారు. భద్రతా దళాల్లో మహిళా అధికారులను నియమించేందుకు
2016లో కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
సూఫీ గాయకుడు ప్యారేలాల్ మృతి
ప్రఖ్యాత
పంజాబీ సూఫీ గాయకుడు ప్యారేలాల్ వడాలీ మృతిచెందారు. పంజాబీ సూఫీ గాయకుల
ద్వయంగా ఖ్యాతిగాంచిన ప్యారేలాల్ తన అన్న పూరన్ చంద్ వడాలీతో కలిసి అనేక
పాటలు పాడారు.
ఆంగ్‌సాన్ సూకీ నుంచి అవార్డు వెనక్కి
ఆంగ్‌సాన్
సూకీకి ఇచ్చిన మానవ హక్కుల అవార్డును వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా
హోలోకాస్ట్ స్మారక మ్యూజియమ్ ప్రకటించింది. ఆరేండ్ల క్రితం హోలోకాస్ట్ ఎలై
వీసెల్ అవార్డును అందజేసింది.
భారత్, ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు
-ఫ్రాన్స్
అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా
భారత్, ఫ్రాన్స్ మధ్య రూ. 81,000 కోట్ల విలువైన 14 ఒప్పందాలు కుదిరాయి.
రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార పరిరక్షణ, ఇండో - పసిఫిక్ ప్రాంతంలో
సహకారం, ఉగ్రవాద నిర్మూలన వంటి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.
మేఘాలయ సీఎంగా కాన్రాడ్
-మార్చి
6న మేఘాలయ 12వ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) అధినేత కాన్రాడ్
సంగ్మా ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ గంగాప్రసాద్.
నాగాలండ్ సీఎంగా నీప్యూ రియో
-మార్చి
7న నాగాలాండ్ సీఎంగా నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ
(ఎన్‌డీపీపీ) నేత నీప్యూ రియో ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ
ఆచార్య.
తిపుర సీఎంగా విప్లవ్‌దేవ్
-మార్చి 9న త్రిపుర సీఎంగా బీజేపీకి చెందిన విప్లవ్ దేవ్ ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ తథాగతరాయ్.
బీబీబీపీ పథకం 640 జిల్లాలకు
-మార్చి
8న బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా నేషనల్
న్యూట్రిషన్ మిషన్ (ఎన్‌ఎన్‌ఎం)ను రాజస్థాన్‌లోని జంజునులో ప్రధాని నరేంద్ర
మోదీ ప్రారంభించారు. బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని 161 జిల్లాల
నుంచి దేశవ్యాప్తంగా 640 జిల్లాలకు విస్తరించనున్నారు.
చరిత్ర అధ్యయనంపై కేఎన్ దీక్షిత్
-దేశ చరిత్రపై పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలపై అధ్యయనం కోసం కేఎన్ దీక్షిత్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
జాతీయ ప్రజాప్రతినిధుల సదస్సు
-మార్చి
10న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నాయకత్వంలో జాతీయ ప్రజాప్రతినిధుల
సదస్సు జరిగింది. దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాలుగా 115 జిల్లాలను
కేంద్రం గుర్తించింది.
ఐఎస్‌ఏ తొలి సమావేశం
సోలార్
ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 121 దేశాలను ఒకే వేదికపైకి
తీసుకురావాలన్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్(ఐఎస్)ను ఏర్పాటు చేశారు. ఈ
కూటమి వ్యవస్థాపక సదస్సు మార్చి 11న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో
జరిగింది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇమాన్యుయేల్ మక్రాన్ పాల్గొన్నారు. తొలి సదస్సులో ఆరు దేశాల ఉపాధ్యక్షులు,
ఉప ప్రధానులతోపాటు 19 దేశాల నుంచి మంత్రుల స్థాయి బృందాలు పాల్గొన్నాయి.
Social Plugin