Type Here to Get Search Results !

Vinays Info

మహిళల ప్రత్యేక బిట్స్

Top Post Ad

ఉమెన్స్ స్పెషల్ బిట్స్

●1) మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో.. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు చేసిన అంకుర సంస్థ పేరు.?

*జ: వీహబ్*

●2) అగ్ని క్షిపణి కోసం పనిచేసిన.. టెస్సిథామస్ ను మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా, అగ్నిపుత్రిగా పిలుస్తారు. అయితే ఆమె ప్రస్తుతం ఏ సంస్థలో పనిచేస్తున్నారు..?

*జ: డిఆర్ డివో*

●3) ఎవరెస్ట్ పర్వతాన్ని రెండు సార్లు ఎక్కిన భారతీయ మహిళ.?

*జ: సంతోష్ యాదవ్*

●4) దేశంలో మొదటిసారిగా.. మొత్తం మహిళలతో నిర్వహిస్తున్న రైల్వే స్టేషన్ గా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న రైల్వే స్టేషన్..?

*జ: ముంబై లోని మాతుంగ రైల్వే స్టేషన్*

●5) ఐక్యరాజ్య సమితి.. ఏ సంవత్సరం నుంచి అధికారికంగా మార్చి 8ను అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా జరుపుకుంటోంది..?

*జ: 1975*

●6) మెగసెసె అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ..?

*జ: కిరణ్ బేడీ*

●7) దేశంలో మొట్టమొదటి పోలీసు డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టిన మహిళ..?

*జ: కంచన్ చౌదరి భట్టాచార్య*

●8) దేశ తొలి ఆరోగ్యశాఖా మంత్రి.. రాజ్ కుమారి అమృత్ కౌర్. అయితే.. ఆమె ఏ రాజ్యానికి చెందిన రాకుమార్తె..?

*జ: కపుర్తల*

●9) ప్రధాన ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన తొలి మహిళ..?

*జ: విఎస్ రమాదేవి*

●10) భారతదేశపు మొదటి మహిళా రైల్వే మంత్రి..?

*జ: మతమ బెనర్జీ*

●11) వరుసగా మూడు ఒలంపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన మహిళ..?

*జ: అంజలి భగవత్*

●12) తెలంగాణా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు...?

*జ: సానియా మీర్జా*

●13) భారతదేశం నుంచి నోబెల్ ప్రైజ్ సాధించిన మొదటి మహిళ మథర్ థెరిస్సా. అయితే ఆమె ఏ సంవత్సరంలో ఈ ఘనతను సాధించారు..?

*జ: 1979*

●14) 1997లో బుకర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ..?

*జ: అరుంధతీరాయ్*

●15) ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయ మహిళ..?

*జ: ఆర్తి సాహ*

●16) భారతరత్న పొందిన మొదటి మహిళ..?

*జ: ఇందిరాగాంధీ*

●17) మిస్ వరల్డ్ గా ఎంపికైన మొదటి భారతీయ మహిళ..?

*జ: రీటా ఫారియా*

●18) అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ మహిళ..?

*జ: కల్పనా చావ్లా*

●19) సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయవాది ఎవరు..?

*జ: ఫాతిమా బీబీ*

●20) ప్రపంచంలోనే.. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మహిళ.?

*జ: వాలెంటినా టెరిష్కోవా*

●21) భారత సైన్యంలో తొలి మహిళా సైనిక అధికారి..?

*జ: నీలా కౌశిక్ పండిట్*

●22) ఒలంపిక్స్ లో పాల్గొన్ని తొలి భారతీయ మహిళ..?

*జ: నోరా పోలీ*

●23) పెప్సీకో చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సంతతి మహిళ..?

*జ: ఇంద్రానూయి*

Below Post Ad