Type Here to Get Search Results !

Vinays Info

మానవుడిలో జన్యు సంబంధ వ్యాధులు

Top Post Ad

 
థలసీమియా:
» దీనివల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ క్షీణిస్తుంది.
వర్ణాంధత్వం:
» ఈ వ్యాధిగ్ర‌స్థులు ప్రాథమిక రంగుల (ఎరుపు, నీలం, ఆకుపచ్చ)ను గుర్తించలేరు.
సికెల్‌సెల్ అనీమియా:
» ఈ వ్యాధివల్ల ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి వర్ణవిహీనమవుతాయి.
ఆల్బినిజం:
» ఈ వ్యాధి వల్ల మెలనిన్ లోపిస్తుంది. దీని లోపంతో చర్మం తెలుపు రంగులోకి మారుతుంది. శుక్లపటలంలో మార్పులు వస్తాయి.
టైరోసినోసిస్:
» ఈ వ్యాధి వల్ల హైడ్రాక్సీ ఫినైల్ పైరూవిక్ ఆమ్లం, టైరోసిస్ మూత్రం ద్వారా విసర్జితమవుతాయి.
హీమోఫీలియా:
» ఈ వ్యాధి లక్షణం - గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టకుండా నిరంతరాయంగా రక్తం స్రవిస్తుంది.
» ఈ వ్యాధిని రాయల్ డిసీజ్ అంటారు.
» ఈ వ్యాధి వల్ల రక్తస్రావం జరుగుతుంది. కాబట్టి బ్లీడర్ వ్యాధి అని కూడా అంటారు.
ఫినైల్ కీటోన్యూరియా:
» ఒక జత అంతర్గత జన్యువుల ప్రభావం వల్ల రక్తం, మస్తిష్క మేరు ద్రవం, చెమటలో అధిక శాతం ఫినైల్ అలనైన్ ఉండి బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది.
ఆల్కాప్టోన్యూరియా:
» ఈ వ్యాధి ప్రభావం వల్ల ఎక్కువ పరిమాణంలో హోమో జెనెటిసిక్ ఎసిటిక్ ఆమ్లం మూత్రంలో కలసి నలుపు రంగులో విసర్జితమవుతుంది.
గాయిట్రస్ క్రెటినిజమ్:
» తీవ్ర బుద్ధిమాంద్యం, అవటు గ్రంథి ఉబ్బడం ఈ వ్యాధి వల్లే సంభవిస్తాయి.

Below Post Ad