Type Here to Get Search Results !

Vinays Info

మిస్ వరల్డ్ గా మానుషి చిల్లర్

భారతీయ యువతి, హర్యానాకు చెందిన వైద్య విద్యార్థిని మానుషి చిల్లర్(20) మిస్ వరల్డ్‌గా ఎంపికైంది. బ్రెయిన్ విత్ బ్యూటీగా పేరుగాంచిన మానుషి ఈ ఏడాది ప్రథమార్థంలో మిస్ ఇండియా-2017గా ఎంపికైన విషయం తెలిసిందే. చైనాలోని సన్యా సిటీ, అరెనాంలో 67వ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ జరిగింది. 108 దేశాల నుంచి అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అందరిని వెనక్కినెట్టి విజేతగా నిలిచిన మానుషి చిల్లర్‌కు మిస్ వరల్డ్-2016 విన్నర్ స్టెఫానే డెల్‌వాలే కిరీటాన్ని బహుకరించింది. మిస్ వరల్డ్‌గా ఎంపికవడం అనేది తన చిన్ననాటి కల అని ఆమె ఈ సంద‌ర్భంగా పేర్కొంది. విజేతగా ఎంపికవడం అనేది ఒక ప్రయాణమని.. దాన్ని తానెప్పుడు మరచిపోనన్నారు. ఈ ప్రయాణంలో తానెంతో నేర్చుకున్నట్లు, ఎంతో సంతోషం పొందినట్లు.. ఫలితాన్ని మాత్రం విధికి వదిలేసినట్లు తెలిపింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section