Mande Satyanaarayana : మండే సత్యనారాయణ (1933 - నవంబర్ 27, 2013) ( మండే సత్యం) విప్లవ కవి.
జననం
నల్గొండ జిల్లా, భువనగిరిలో 1933లో పుట్టారు. 16వ ఏటనే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. 1953లో రైల్వే ఉద్యోగంలో చేరారు. 1954లో వివాహం జరిగింది. ఉద్యోగంలో మజ్దూర్ యూనియన్ కార్యకర్తగా పేరుపొందారు. కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడటంతో పీపుల్స్‌వార్‌కు దగ్గరయ్యారు. పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు.
మరణo
నవంబర్ 27, 2013లో గుండెపోటుతో కన్నుమూశారు.
ఈయన రాసిన పాటలు
- పల్లెలెట్లా కదులుతున్నయంటే
- తెలంగాణ గట్టు మీద చందమామయ్యో
- బతుకులేమో ఎండీపాయే
- రాజిగో..ఒరె రాజిగో