Type Here to Get Search Results !

Vinays Info

తెలంగాణలోని నేలలు,Soils of Telangana

-భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరనే ‘నేల’ అంటారు.
-నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజి’ అంటారు.
-శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే పదార్థాన్ని ‘మృత్తిక అంటారు.
-తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్ట్రన్ సీ బోర్డ్ మధ్య పేలికలో దక్కన్ పీఠభూమిపై ఉంది.
-తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమైన ఒండ్రు నేలల నుంచి నిస్సారమైన ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది.
-తెలంగాణలో ఎగుడు, దిగుడులుగల పెనిప్లేయిన్‌లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి. 
-రాష్ట్రంలో ప్రధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.

ఎర్ర నేలలు

-రాష్ట్రంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి. 
-ఈ నేలల్లో.. మొక్కలకు కావాల్సిన పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువ, భాస్వరం అధికంగా ఉంటుంది. 
-తెలంగాణలో ఈ నేలలను చెల్క, దుబ్బ నేలలుగా వర్గీకరించారు. అందులో చెల్క నేలలు క్వార్ట్‌జైట్, ముడి గ్రానైట్ రాళ్లు రూపాంతరం చెందడంవల్ల ఏర్పడుతాయి. చెల్క నేలలు చాలా దిగువగా అంటే గుట్టల మధ్య భాగం వాలు భూముల్లో ఎక్కువగా ఉంటాయి.
-దుబ్బ నేలలు తక్కువ సారవంతం కలిగి ఉండి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి. 
-ఈ ఎర్ర నేలల్లో ప్రధానంగా వేరుశనగ పండుతుంది.
-ఎర్ర నేలలు వదులుగా ఉంటాయి. 
-ఈ ఎర్ర నేలలు రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగాడ్డి, నిజామాబాద్‌లలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈ నేలలు తక్కువగా ఉన్నాయి. 
-ఈ నేలలు రాష్ట్రంలో 48 శాతం విస్తరించి ఉన్నాయి

నల్లరేగడి నేలలు

-అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడుతాయి.
-ఇవి ఎక్కువగా బంకమట్టితో ఉండి, తేమను నిల్వ ఉంచుకునే శక్తి కలిగి ఉంటాయి.
-ఈ నేలలను ‘రేగర్ నేలలు’ అంటారు.
-ఈ నేలల్లో ఇనుము, కాల్షియం శాతం ఎక్కువగా, భాస్వరం, నైట్రోజన్, సేంద్రియ పదార్థం శాతం తక్కువగా ఉంటాయి.
-ఈ నేలలు ఆదిలాబాద్, రంగాడ్డి, నిజామాబాద్‌లలో ఎక్కువగా.. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌లలో తక్కువగా విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలల్లో ప్రధానంగా పత్తి, పొగాకు, పసుపు, మిరప, సజ్జ, జొన్న పంటలు అధికంగా పండుతాయి.
-రాష్ట్రంలో ఈ నేలలు 25 శాతం విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి.

రాతి నేలలు (లాటరైట్ నేలలు)

-ఈ నేలలు దేశంలో 4.3 శాతం విస్తరించాయి.
-రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ నేలలు 25 శాతం విస్తరించి ఉన్నాయి. 
-ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని ‘బ్రిక్ సాయిల్’ అంటారు.
-ఈ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.
-ఈ నేలలు అల్యూమినియం, ఇనుముల హైడ్రైడ్ ఆకై్సడ్ మిశ్రమం.
-ఈ నేలలు వర్షానికి తడిచి నల్లగా మారుతాయి.
-ఇవి ఎక్కువ వర్షపాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణోక్షిగతగల ప్రాంతాల్లో ఏర్పడుతాయి.
-ఈ నేలలు మెదక్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి.
-ఈ నేలలు పీత వర్ణం, గోధుమ, ఎరుపు రంగులను కలిగి ఉంటాయి.
-ఈ నేలతో ఇటుకలు తయారు చేస్తారు.
-ఈ నేలలో కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, సుగంధ ద్రవ్య పంటలు ఎక్కువగా పండుతాయి.

ఒండ్రు నేలలు

-ఈ నేలలు నదులు అనేక ఏండ్లుగా తమ ప్రవాహ క్రమంలో తీసుకొచ్చిన ఒండ్రుమట్టిని నిక్షేపణం చేయటం వలన ఏర్పడుతాయి.
-ఈ నేలలు తెలంగాణ విస్తీర్ణంలో 3వ స్థానాన్ని ఆక్రమించాయి.
-ఈ నేలలు నీటిని నిలువ చేసుకుంటాయి.
-ఈ నేలలు అత్యంత సారవంతమైనవి.
-ఈ నేలల్లో పొటాష్ శాతం ఎక్కువగా ఉండి, నైట్రోజన్, పాస్ఫరస్‌లు తక్కువ శాతంలో ఉంటాయి.
-ఈ నేలలు అధికంగా గోదావరి, కృష్ణా, పెన్నా నదుల డెల్టా ప్రాంతాల్లో ఉన్నాయి.
-ఈ నేలలు వరి, చెరకు, అరటి, మామిడి, నిమ్మ, బత్తాయి పంటలకు శ్రేష్ఠమైనవి.
-ఈ నేలలు మెత్తటి రేణుయుత అవక్షేపాలు నిక్షేపించడంవల్ల ఏర్పడ్డాయి.
-ఈ మృత్తికల్లో ఇసుక పాలు ఎక్కువ.
-ఈ నేలలు పసుపు రంగులో ఉంటాయి.
-ఈ నేలల్లో పొటాష్, సున్నపురాయి సమృద్ధిగా ఉంటాయి. నత్రజని తక్కువగా ఉంటుంది. 
-రాష్ట్రంలో ఈ నేలలు 20 శాతం విస్తరించి ఉన్నాయి.
-మృత్తికల నిర్మాణం ఎలా జరుగుతుందో తెలిపే శాస్త్రం - లిథాలజి
-ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section