ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారం పొందుట దుర్లభం. లంచం ఇచ్చుకోనిదే ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కష్టం.ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం (Right to Information Act) * [1] భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ అధికారులుఅడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
*Right to Information Act 2005 | సమాచార హక్కు చట్టం 2005*
👉మూలం : యాక్ట్.నెంబర్.12/2005
👉శాసనం చేసిన తేదీ : 15.జూన్.2005
👉ఆమోదం తెలిపింది : 22.జూన్.2005
👉అమలు : 12.అక్టోబర్.2005
👉నేటితో 13 సంవత్సరాలు పూర్తి(12.అక్టోబర్.2017)
👉మొదటి సమాచార హక్కు చట్టం ద్వారా అప్లికేషన్ ను సమర్పించింది - షాహిద్ రాజా బర్నీ
👉ఎప్పుడు : 12.అక్టోబర్.2005 నాడు
👉ఎవరికి : సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ - పూణే
👉Central Chief Information Commissioner : Radha Krishna Mathur
👉Telangana State Chief Information Commissioner : M.Rathan
👉సమాచార హక్కు చట్టం వర్తించని రాష్ట్రం - జమ్మూకాశ్మీర్
Vinays Info | VINAYS INFO