తెలంగాణా తల్లి రూపంలో ప్రత్యేకతలు:
🍁 తెలంగాణా తల్లికి మొదట ఒక రూపాన్నిచ్చింది ప్రముఖ తెలంగాణ రచయిత,తత్వవేత్త బి.ఎన్.రాములు
🍁 తెలంగాణా తల్లి రూపంలో కుడిచేతిలో మొక్కజొన్న కంకి కలదు
(ఇది 50 శాతం తెలంగాణ ప్రాంత మెట్టపంటలకు సాంకేతం)
🍁 తెలంగాణా తల్లి ఎడమచేతిలో బతుకమ్మ కలదు (ఇది తెలంగాణాకే సొంతమైన ప్రపంచ ప్రఖ్యాతి నోందిన గొప్ప మహిళా పండుగ)
🍁 తెలంగాణ తల్లి కిరీటంలోని వడ్డాణoలో ప్రపంచ ప్రఖ్యాతి నోందిన రెండు తెలంగాణా వజ్రాలున్నాయి.అవి కోహినూర్ వజ్రం,జాకబ్ వజ్రం.
🍁 తెలంగాణా తల్లి కాలిమెట్టెలు ముత్తయిదకు చిహ్నంగా నిండయిన రూపానికి సూచిక. ఈ వెండి మెట్టెలు కరీoనగర్ *ఫిలిగ్రీ* ఆభరణాలకు గుర్తు.
🍁 పసునూరి దయాకర్ తయారుచేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని 15-11-2007 న టిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం (తెలంగాణ భవన్ లో) కేసిఆర్ ఆవిష్కరించారు.
🍁 తెలంగాణా తల్లి ధరించిన చీర గద్వాల్,పోచoపల్లి.