పిన్ కోడు:(Postal Index Number లేదా PIN లేదా Pincode):
📮 తపాలా సూచిక సంఖ్య. ఈ విధానము,భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడింది. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది.దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన(unique) పిన్ నెంబర్‌ను కేటాయించారు.దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postal regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.
📮 భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి
పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు-తపాలా సర్కిల్:
11 ఢిల్లీ 12 and 13 హర్యానా 14 to 16 పంజాబ్ 17 హిమాచల్ ప్రదేశ్ 18 to 19 జమ్మూ & కాశ్మీరు 20 to 28 ఉత్తరప్రదేశ్ 30 to 34 రాజస్థాన్ 36 to 39 గుజరాత్ 40 to 44 మహారాష్ట్ర 45 to 49 మధ్యప్రదేశ్ 50 to 53 ఆంధ్రప్రదేశ్,తెలంగాణ 56 to 59 కర్నాటక 60 to 64 తమిళనాడు 67 to 69 కేరళ 70 to 74 పశ్చిమ బెంగాల్ 75 to 77 ఒడిషా 78 అస్సాం 79 ఈశాన్య భారత్ 80 to 85బీహారు మరియు జార్ఖండు