రాష్ట్రీయం
1) తెల్లకార్డు కలిగిన ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇందులో నేతన్నలకు ఎన్ని కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి ? జ: రూ.113 కోట్లు
2) రాష్ట్రంలో వైద్య పరిశోధనల కోసం ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేంటి ? జ: మెరిట్ ( Medical Education and Research in Telangana)
3) మెరిట్ పథకం కోసం 2016-17 రాష్ట్ర బడ్జెట్ లో ఎంత కేటాయించారు ? జ: రూ.12 కోట్లు
4) గ్రామాల అభివృద్ధి కోసం 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులపై ఎవరికి సర్వాధికారాలు ఉంటాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది ? జ: గ్రామ పంచాయతీలు
5) జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచి అశోక్ లేలాండ్, అభిబస్ సంస్థలు ఏర్పాటు చేసిన అవార్డుల్లో మూడింటిని గెలుచుకుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC). ఆ అవార్డుల పేరేంటి ? జ: ఇండియా బస్ అవార్డులు
6) మహిళా, శిశు వైద్యంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించినందుకు హైదరాబాద్ కు చెందిన ఏ దవాఖానాకు టైమ్స్ నెట్ వర్క్ అవార్డు లభించింది ? జ: లోటస్ ఆస్పత్రికి