ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం | World Red Cross Day
★రెడ్‌క్రాస్ సొసైటీ అంటే ఏంటి? ఇది ఏం చేస్తుంది? అన్న విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం...
*◆ యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.*
*◆1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన "హెన్రీ డునాంట్ "అనే వ్యక్తి ముందుకొచ్చాడు.*
*◆ ఆ సంఘటన తరువాత...తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.*
◆ స్విడ్జర్లాండ్ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు.
*◆రెడ్ క్రాస్ నిర్మాత జాన్ హెన్రీడూన్ హంట్ జయంతిని ప్రతి సంవత్సరం మే 8న వరల్డ్ రెడ్‌క్రాస్ డేగా నిర్వహిస్తూ వస్తున్నారు.*
*◆1901 లో ఈయనకు 'మొదటి నోబెల్ శాంతిబహుమతి 'లభించింది.*
*★ఆపద సమయంలో అక్కున చేర్చుకొని, చేయూత నివ్వడంతో, రక్తదానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించడంలో రెడ్‌క్రాస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నది..*
◆మానవతా విలువలు పెంపొందించడం తోపాటు శాంతిసందేశం అందించడం, ఆపదలో వున్నవారిని అదుకోవడంలో స్ఫూర్తి నింపుతూ..అగ్రభాగాన నిలుస్తుంది.
కనుక మనమూ ఆవైపుకు అడుగులు వేద్దాం!
తోటివారికి సాయపడడాం..