Type Here to Get Search Results !

Vinays Info

👉 World Laugher Day

నేడు..ప్రపంచ నవ్వుల దినోత్సవం.
"నవ్వు ఒక యోగం... నవ్వడం ఒక భోగం..."అన్నారు పెద్దలు
 
*◆ మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నవ్వు దోహదపడుతుందని అందరూ నమ్ముతున్నారు.*
*◆ నవ్వడం వలన శరీరంలోనున్న రోగాలన్నీ మటుమాయమవుతాయని ఆరోగ్యనిపుణు లు తెలిపారు. నవ్వడం మూలాన జీవితంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చని పేర్కొన్నారు.*
*■ 1995లో మార్చి 13 న భారతీయ వైద్యుడు ... డా. మదన్‌ కటారియా ప్రపంచ నవ్వుల దినాన్ని స్టృస్టించారు . నవ్వుల క్లబ్ గా ప్రారంభమయిన ఈ పండుగ రానురాను 65 దేశాలలో ఆరువేల కు పైగా నవ్వుల క్లబ్ లుగా విలసిల్లినాయి.*
*■ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మొదట్లో జనవరి రెండో ఆదివారం నాడు జరుపుకునే వారు. జనవరిలో చలి వాతావరణమని హాస్య ప్రియులు కోరగా  దాంతో లాఫ్టర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ వాళ్లు ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే మొదటి ఆదివారం నాడు జరపాలని నిర్ణయించారు.*
■ నవ్వడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని, ప్రపపంచశాంతి ఈ దినోత్సవ నిర్వహణ పరమార్థమని నిర్వాహకుల అభిప్రాయం
*■ ప్రతి మనిషికీ - ఎక్కడ పుట్టినా, మరెక్కడ పెరిగినా... అర్థం అయ్యే భాష నవ్వు. బహుశా ప్రతి ఒక్కరి నవ్వులోనూ అర్థం కూడా ఒకటే. నవ్వడం మనం నేర్చుకోనక్కరలేని భాష. పుట్టుక నుండే మనకు నవ్వు వస్తుంది. మరో విశేషం ఏంటంటే, నవ్వు మనకు తెలీకుండానే వస్తుంది. వచ్చిన నవ్వును బలవంతంగా మనం ఆపగలమే కానీ, బలవంతంగా నవ్వలేం (ఇప్పుడు చాలామంది తంటాలు పడి పడీ పడీ నవ్వుతుంటారనుకోండి, రాకపోయినా)..*
■ ఒక మనిషి ఎంత సంతోషంగా వున్నాడో తెల్సుకోడానికి అతను రోజుకు ఎన్నిసార్లు మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడో లెక్కవేస్తే సరిపోతుంది. ఒంటరిగా వున్నప్పటికంటే జనంలో వున్నప్పుడు మనం 30 రెట్లు ఎక్కువగా నవ్వుతాం.
*హాస్య ప్రియత్వం తగ్గుతోందా!..*
*■ నవరసాల్లో ఒకటి హాస్యం. కానీ ఒక రకంగా అది మన జీవితాల్లో తగ్గిపోతోందనిపిస్తోంది. కోపం..ముభావం...ఆవేశం...అసంతృప్తి...ఎప్పుడూ మన వెన్నంటి వుండేవే. సంవత్సరాలు, దశాబ్దాలు గడుస్తున్నా వీటినుంచి మనిషి బయటపడలేకపోతున్నాడు. దానికి ఒకటి రెండూ కాదు. ఎన్నో కారణాలు. జీవితంలో పెరిగే వేగం, ఒత్తిడి, పోటీ, సమస్యలు ... ఇంకా ఎన్నెన్నో. ఇవే మనషిని నవ్వుకు దూరం చేస్తున్నాయి. అసలు నవ్వడమే మర్చిపోయేలా చేస్తున్నాయి.*
■ కాసేపు నింపాదిగా, హాయిగా గడిపే తీరిక వుండడంలేదు. ఇలా గడిపితేనే కదా, మనుషుల మధ్యన మాటా ముచ్చట వుండేది, సంభాషణ కొనసాగేది. అప్పుడే హాస్యం పుడుతుంది. సంభాషణలో చతురోక్తులకీ, ఛలోక్తులకీ చోటు వుంటుంది. కానీ అలాంటి అవకాశం, తీరిక ఇప్పుడు లేదు మరి. ఇంతేకాక ఎప్పుడూ ఏవో చికాకులతో, చింతలతో, అర్థం లేని లక్ష్యాల సాధనకోసం పరుగులాటలో ఒత్తిడిలో కాలం గడిపేస్తుంటారు.
*■ ఇలా నిరంతరం ఒత్తిడికీ, దిగుళ్లకీ లోనై మనుషుల్లో హాస్య ప్రియత్వం తగ్గిపోతోంది. హాయిగా స్వేచ్ఛగా, నవ్వే అమ్మాయిలు అరుదుగా కనిపిస్తారు. మగవాళ్లలోనూ నవ్వు ఎక్కడ వుంది? ఏదో సీరియస్‌గా ముఖమంతా గంటు పెట్టుకొని కూచుంటారు. నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా వుండే తత్వం కూడా అరుదే. అందుకే నవ్వు భాగ్యమైపోయింది. అందుకే ఇప్పుడు నవ్వడం కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమొచ్చింది. ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో లాఫింగ్‌ క్లబ్బులు ఏర్పడ్డాయి. నవ్వులను మరిచిపోయిన వాళ్లకు నవ్వడం నేర్పిస్తున్నాయి. నవ్వడాన్ని ప్రాక్టీస్‌ చేయిస్తున్నాయి. నవ్వును చంపేసిన మనమే నవ్వడం నేర్చుకుంటున్నాం...అన్నిటికీ విరుగుడు నవ్వే.*
*నవ్వుతో జబ్బులకు చెక్‌..*
*◆ఇదివరకు మనవాళ్ళు నవ్వు నాలుగు విధాలా చేటు అన్నారు. కాని ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.*
*◆జబ్బులలో 70 శాతం ఏదో ఒక విధమైన ఒత్తిడికి సంబంధం వున్నవే. అధిక రక్తపోటు, గుండెజబ్బులు, డిప్రెషన్‌, ఇన్సోమియా, మైగ్రిన్‌, ఆతృత, అలర్జీ, పెప్టిక్‌ అల్సర్‌... వగైరాలు ఆ కోవకు చెందినవే. నవ్వుల మందు తీసుకుంటే ఆవి తగ్గుముఖం పట్టే అవకాశం వుంది.*
◆తమలో తాము ముడుచుకుపోయే వారితో పోలిస్తే తరచూ నవ్వేవారికి గుండెజబ్బు వచ్చే ప్రమాదం తక్కువ.
*◆టెన్షన్‌ తగ్గించే సేఫ్టీ వాల్వులాంటి నవ్వు వల్ల ఒత్తిడికి కారణమైన హార్మోన్ల ఉత్పత్తి తగ్గి ఉపశమనం కలుగుతుంది. 10 నిమిషాలు నవ్వగలిగితే 10-20 మి.మీ రక్తపోటు తగ్గుతుంది.*
◆రోజువారీ నవ్వులు రోగనిరోధక వ్యవస్థను వృద్ధి చేస్తాయి. అందుకు అవసరమైన లింపాసైట్స్‌ ఉత్పత్తిని పెంచుతాయి.
*◆అలాగే ముక్కు, శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన పొరలలో నవ్వుల వల్ల మెరుగుదల వుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.*
◆శరీరంలో సహజరోగ నిరోధకాలైన హార్మోన్ల ఉత్పత్తి పెరిగి, ఆర్తరైటిస్‌(Arthritis), స్పాండులైటిస్‌, మైగ్రిన్‌ వంటి వ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
*◆ఊపిరితిత్తుల సామర్థ్యం, రక్తంలో ఆక్సిజన్‌ పరిమాణం పెరుగుతాయి. కనుక ఆస్తమా రోగులకూ మేలు కలుగుతుంది.*
*●అయితే దీర్ఘకాలిక వ్యాధులు కేవలం నవ్వు మందుతోనే తగ్గుతాయని చెప్పలేం. పైగా ఒత్తిడికి గురవడం వల్ల అడ్రినాలిన్‌ ఎక్కువగా విడుదలౌతుంది. నవ్వితే అది బాగా తగ్గుతుంది.*
■ జీవితంలో ఆశ, విశ్వాసం అవసరం. హాస్యం ఆ రెంటినీ ఇస్తుంది. సజీవమైన నవ్వులు తొణికిసలాడేవారే అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తులు.  మీరూ ఆ నవ్వులలో పాలు పంచుకోండి
మరి..మీ నవ్వే మీకు టానిక్‌..

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section