Type Here to Get Search Results !

Vinays Info

World Press Freedom day

నేడు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం

★ "ప్రభుత్వానికి ఉండే మూడు అంగాల (లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్‌, జుడిషియరీ) తో పాటు ప్రజాస్వామ్యవ్యవస్థ ఆరోగ్యానికి అత్యావశ్యకమైనది పత్రికాస్వేచ్ఛ. అందుకే దాన్ని నాల్గవ అంగంగా, నాలుగవ స్తంభంగా పేర్కొన్నారు."

*★ ఫోర్త్‌ ఎస్టేట్‌ అంటే పత్రికలులేదా ప్రసార మాధ్యమాలు.*

*■ 1729-1797 సంవత్సరాల నడుమ జీవించిన ఆంగ్లోఐరిష్‌ పొలిటికల్‌ థియరిస్ట్‌ ఎడ్మండ్‌ బ్రూక్‌ మొదటిసారిగా పత్రికలను ఉద్దేశించి పౌరుష పదజాలంతో శక్తి అన్న పదాన్ని ప్రయోగించాడు. ప్రజాభిప్రాయాన్ని  ప్రతిబింబించడంలోనూ, మలచడంలోనూ మీడియా నిర్వహించే పాత్ర కీలకమైంది. మీడియా శక్తిమంతమైందనడానికి దాని మీద జరిగే దాడులే దాఖలా. అనేకదేశాలలో మీడియా మీద ఇంకా ఆంక్షలున్నాయి.*

*◆ ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు ఒకెత్తయితే మాఫియాముఠాలు పెంచే ఒత్తిడి ఇంకొకెత్తు. టెర్రరిస్టు గ్రూపులూ, డ్రగ్‌ మాఫియా మీడియా పై ఎప్పుడూ కత్తిగట్టే ఉంటాయి. విధినిర్వహ ణలో బలైన జర్నలిస్టులెందరో ఉన్నారు. వారంతా పత్రికాస్వేచ్ఛకు పట్టిన దివిటీలు..*

*◆ యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌లోని 19వ అధికరణం భావప్రకటన స్వేచ్ఛని గురించి చెబుతుంది. పత్రికాస్వేచ్ఛకు అదే ఆధారభూమిక.*

*■ 1993లో ఐక్యరాజ్యసమితి ఈ మానవ హక్కుల ఉద్ఘాటన చేసింది. అంతకు రెండేళ్ల ముందు 1991లో ఆఫ్రికన్‌ జర్నలిస్టులు ఏప్రిల్‌ 29 నుండి మే 3 వరకూ నమీబియాలోని విండ్‌హాక్‌లో ఒక సమావేశం జరిపి పత్రికా స్వేచ్ఛపై ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆఫ్రికాలోని అనేక దేశాలలో సెన్సార్‌షిప్‌ వుండేది. పత్రికాస్వేచ్చ మీద ఆంక్షలుండేవి. వాటికి నిరసనగా 'ఆఫ్రికన్‌ జర్నలిస్టులు ప్రకటన చేసిన మే 3 నాడే ' ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం జరపాలని ఐరాస నిర్ణయించింది.*

■ ఈ సందర్భంగా యునెస్కో 1997 నుండి ఏటా మే 3 నాడు గుల్లెర్మోకేనో వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ అవార్డును ప్రదానం చేస్తూ వస్తోంది. ప్రమాదం అంచుల్లో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికాస్వేచ్ఛకు ప్రతీకగా నిలచిన జర్నలిస్టులకు, ఈ అవార్డు ప్రదానం చేస్తారు. అవార్డు కింద 25,000 అమెరికన్‌ డాలర్ల నగదు బహుమతి ఉంటుంది.

■ గుల్లెర్మోకేనో ఒక కొలంబియన్‌ న్యూస్‌ పేపర్‌కు ఎడిటర్‌గా ఉండేవారు. అయితే కేనో తన వ్రాతలతో డ్రగ్‌ మాఫియా కన్నెర్రకు గురి అయ్యారు. 1986 డిసెంబర్‌ 17న ఆయన దారుణంగా తన న్యూస్‌ పేపర్‌ ఆఫీసు ఎదుటే హత్య చేయబడ్డాడు. ఆయన బలిదానం పత్రికాస్వేచ్ఛకు స్ఫూర్తి.

■ దేశాలన్నీ ఒకటిగా లేవు. కొన్ని దేశాలలో పత్రికాస్వేచ్ఛ అన్న మాటే వినబడకూడదు! జర్నలిస్టులు అనేకదేశాలలో నిప్పుల నడక సాగిస్తున్నారు.ఎంతోమంది మీడియా ఉద్యోగులు హత్యలకు గురి అవుతున్నారు

*◆ నిజానికి ఒక జర్నలిస్టు విధినిర్వహణలో చంపబడ్డాడంటే, అది వ్యక్తిగతమైన దాడి కానే కాదు, అది భావప్రకటన స్వేచ్ఛ మీద జరిగిన దాడే!*

*🌤ఇంతకీ ప్రపంచంలో పత్రికాస్వేచ్ఛకు సంబంధించి ఏ దేశం ఏ దశలో ఉంది?..*

■ స్వచ్ఛందసంస్థ లెక్కల ప్రకారం, మూడింట ఒక వంతు ప్రపంచజనాభా పత్రికాస్వేచ్ఛ లేని వ్యవస్థలలో జీవిస్తోంది. ప్రజాస్వామ్యదేశా లలో పరిస్థితి ఫర్వాలేదు.'' కొన్ని సూచికల ఆధారంగా ఒక సర్వే జరపగా అందులో  భారతదేశం 105వ స్థానంలో ఉంది.

◆ క్యూబా, మయన్మార్‌, ఎరిత్రియా, తుర్క్‌మెనిస్థాన్‌, ఇరాన్‌, ఉజ్బెకిస్థాన్‌ వంటి దేశాలలో పత్రికాస్వేచ్ఛ పరిస్థితి దారుణం.

◆ ఫిన్‌ల్యాండ్‌, ఐస్‌ల్యాండ్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ పత్రికాస్వేచ్ఛలో మొదటి స్థానంలో ఉన్నాయి.

◆ కనుక పత్రికాస్వేచ్ఛను పత్రికలు , ప్రభుత్వాలుకాదు, ప్రజలే కాపాడుకోవాలి.. అప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని ఆశిద్దాం..

🌐సేకరణ:సురేష్ కట్టా-నెల్లూర్ సోషల్ టీచర్
                     

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section